పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన మంత్రులు.. రావొచ్చు..! రాకపోవచ్చు..!
posted on Oct 17, 2015 12:32PM

ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు ప్రారంభమయ్యాయి. ఏపీ మంత్రులు మంత్రులు అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, టిడి జనార్ధన్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరిని ఇతర పార్టీ నేతలను ఆహ్వానించే బాధ్యతను అప్పగించారు. దీనిలో భాగంగానే వీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ నానక్‌రాంగూడలో సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి శంకుస్థాపనకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి నాకు రావాలని ఉంది కానీ ఆసమయంలో షూటింగ్ నిమిత్తం గుజరాత్ వెళ్లవచ్చు అని అన్నారు. తాను వచ్చేది రానిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కాగా ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్ లా కాకూడదని ఆయన అన్నారు. అంతేకాదు ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు ఆయనను కలవడం సరికాదని.. గొడవల ఎల్లకాలం ముందుకు సాగలేమని.. సామరస్య వాతావరణం ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. కాగా శంకుస్థాపనకు వచ్చి రాజధానికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందించాలని మంత్రులు కోరారు. అంతేకాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడతారని తెలిపారు.