రేప్ కేసులో సాక్షాత్తు కలెక్టర్... ప్రస్తుతం పరారీలో

ఛత్తీస్ గడ్ లో ఒక 33 ఏళ్ల మహిళ తాను నిర్వహిస్తున్నఎన్జీవో ఫండ్స్ కోసం జాన్జ్ గిర్ - చంప జిల్లాల కలెక్టర్ గా పని చేస్తున్న జనక్ పాఠక్ ను గత నెల కలవడం జరిగింది. ఐతే ప్రస్తుతం మా దగ్గర ఫండ్స్ లేవు.. ఉన్నపుడు కాల్ చేస్తా అని చెప్పి ఆమె పర్సనల్ నంబర్ తీసుకున్నాడట. ఐతే తాజాగా ఆ మహిళ ఆ కలెక్టర్ పై రేప్ కేసు పెట్టింది. 

విషయం ఏంటంటే ఆమె పర్సనల్ నంబర్ తీసుకున్న కలెక్టర్ గారు కొద్దీ రోజుల క్రితం ఆమెకు కాల్ చేసి సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత ఆఫీసుకు వచ్చి కలవాలని చెప్పారట. దానికి ఆమె 5 గంటల తరువాత మీ ఆఫీసు పని చేస్తుందా అని అడగగా నార్మల్ గా మా ఆఫీసు పనిని 5 గంటలకే ముగిస్తాం ఐతే మీది ఎన్జీవో కాబట్టి మీకోసం ప్రత్యేకంగా పని చేయాలని డిసైడ్ అయ్యాం అని చెప్పడం తో ఆమె వెళ్లి కలిసింది. ఐతే కలెక్టర్ గారు ఆమె నిర్వహించే ఎన్జీవో గురించి ఆరా తీస్తున్నట్లు నటిస్తూ ఆమె దగ్గరకు చేరి అసభ్యంగా ప్రవర్తిస్తూ కలెక్టర్ కార్యాలయం లోనే రేప్ చేసాడని ఆమె ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సాక్ష్యంగా ఆమె కలెక్టర్ తనతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణలను ప్రూఫ్ గా చూపించింది. 

దీంతో కలెక్టర్ ను విచారించేందుకు పోలీసులు కలెక్టర్ ఇంటికే వెళ్లగా అయన కనిపించక పోవడంతో విచారణకు తమ ముంచు హాజరవ్వాలని ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. ఆ కలెక్టర్ కోసం చాల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడం తో అయన పరారీలో ఉన్నాడని డిసైడ్ అయ్యారు పోలీసులు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆ కలెక్టర్ ను సస్పెండ్ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu