సీఎం చంద్రబాబుకు రాజ్‌నాథ్ ఫోన్

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ఉదయం ఫోన్ చేశారు. హుదూద్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై ఎలా వుందని  ఆయన ఈ సందర్భంగా చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు తుఫాను నష్టం వివరాలతో, రాష్ట్రంలోని పరిస్థితిని రాజ్నాథ్ సింగ్‌కి  వివరించారు. పరిస్థితి అంచనాకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆంధ్రప్రదేశ్ రావాలని చంద్రబాబు కోరారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. తుఫాను ప్రభావ పరిస్థితిని వివరించారు. రాజ్ నాథ్ ఫోన్ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu