వైద్య విద్యార్థిని ఆత్మహత్య
posted on Oct 13, 2014 10:23AM
.jpg)
హైదరాబాద్‌లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణం ఒక వైద్యురాలని అంటూ సూసైడ్ నోట్‌లో ఆ విద్యార్థిని పేర్కొంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మాధవి ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసి హైదరాబాద్ విద్యానగర్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో పీజీలో చేరింది. హాస్టల్‌లో వుంటున్న మాధవి ఆదివారం నాడు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు మెడికో మాధవి గదిలో తనిఖీ చేయగా వారికి సూసైడ్‌నోట్ కనిపించింది. అందులో తాను ఆత్మహత్య చేసుకోవడానికి డ్యూటీ డాక్టర్ కారణమని మాధవి చేతిరాతతో రాసి ఉంది. ఈ విషయం తెలిసింది. మాధవి తల్లిదండ్రులు నగరానికి చేరుకుని, తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.