విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు ప్రకటన



ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచడం మీద  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు ఏపీఈఆర్సీ ప్రతిపాదన చేసిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్ బోర్డును లాభాల్లోకి తెచ్చామని, విద్యుత్ లోటు కూడా తగ్గించామని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి బాగా పెంచామని, వ్యవసాయ రంగానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటన ముఖ్యాంశాలు:

* ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యుత్ ఛార్జీలు తక్కువ
* ఎఫ్సీఏ ఒక్క పైసా కూడా ఉండదు
* వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఛార్జీలు పెంచడం లేదు
* 200లోపు యూనిట్లు వాడితే విద్యుత్ ఛార్జీలు పెరగవు
* 86 శాతం మందికి ఒక్క పైసా కూడా ఛార్జీలు పెరగవు
* 14 శాతం మందికే విద్యుత్ చార్జీలు పెరుగుతాయి
* పేదవాళ్లపై విద్యుత్ భారం వేయం
* ఏపీ ఈఆర్సీ 22.5 శాతం  ఛార్జీలు పెంచాలని ప్రతిపాదిస్తే తిరస్కరించాను.
* బడ్జెట్లో రూ.3,186 కోట్ల రెవెన్యూ లోటు ఉంది.
* నాణ్యత కోసమే విద్యుత్ సంస్కరణలు
* అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్ల వల్లనే సమస్యలు
* రెగ్యులేటరీ కమిషన్ను బలోపేతం చేశాం