పట్టిసీమపై అధికార ప్రతిపక్షాల పంతం దేనికి?
posted on Mar 24, 2015 11:07AM
.jpg)
ఒకవైపు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ శాసనసభ్యులు కీలకమయిన బడ్జెట్ సమావేశాలు బహిష్కరించి మరీ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బస్సు యాత్రలు చెప్పట్టేందుకు సన్నధం అవుతుంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే పట్టిసీమ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేందుకు సన్నధం అవుతోంది. అధికార పార్టీ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటే, ప్రతిపక్ష పార్టీ అది ఎందుకూ పనికిరాని ప్రాజెక్టని ప్రజలకు హితభోద చేసేందుకు కంకణం కట్టుకొంది.
ఈవిధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే అంశంపై పూర్తి విభిన్నమయిన వాదనలు వినిపిస్తుండటంతో ఈవిషయంలో చాలా అయోమయం ఏర్పడింది. కనుక మీడియా స్వయంగా చొరవ తీసుకొని రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా సంబంధిత రంగానికి చెందిన ఇంజనీర్లు, నిపుణులు, మేధావులను రప్పించి వారి చేత ఈ ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి వైకాపా ఇప్పటికే తన వాదనలను తన మీడియా ద్వారా ప్రజలకు వినిపిస్తోంది కనుక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీడియా ద్వారానే ఈ ప్రాజెక్టు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే అపోహలకు తావు ఉండదు.