జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా..మహిళా కమిషన్ సీరియస్

 

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు. మహిళల ఆత్మాభిమానాల‌పై దాడి చేయడం గత వైసీపీ ఐదేళ్లుగా సాధారణం అయ్యిందని, మహిళలను రాజకీయ ముసుగులో కొన్ని‌ మీడియా ఛానళ్లు తిట్టిస్తున్నాయని, ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు. జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా ఆమె ప్రశ్నించారు. 

జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయ కోణంలో, అనుకూల ఛానెల్ ఉందని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. గుంటూరులో 150 యూనివర్సిటీల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారని వాస్తవాలు తెలియకుండా ఎలా మాట్లాడుతారని ఛైర్ పర్సన్ ప్రశ్నించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తలో ఎక్కడా కూడా ప్రాంతం పేరు లేదు, అలాంటిది జర్నలిస్టు అయ్యుండి ఒక ప్రాంత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడం సరికాదని ఆమె హెచ్చరించారు. చదువుకున్న జర్నలిస్టుగా మహిళలను అవమానించడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu