రేవంత్ రెడ్డి ఇంట్లో ఏ ఆధారాలు దొరకలేదు... ఏసీబీ డీఎస్పీ సునీతా

ఓటుకు నోటు కేసులో ఓవైపు ఏసీబీ అధికారులు విచారణ జరుపుతూనే మరోవైపు నిందితుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. దీనిలో భాగంగా జూబ్లిహిల్స్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సునీతా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశామని, అయితే ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. బ్యాంకు ఖాతాల వివరాలు, దస్తావేజులు, పాస్ పోర్టుకు సంబంధించిన వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నామని అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu