ఇవాళ చెన్నైలో పుట్టే ఆడపిల్లలకు 10,000/-
posted on Feb 24, 2016 1:13PM

తమిళనాట జయలలితకు ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమ అధినాయకురాలిగా కొలుచుకునే జయలలిత పుట్టినరోజు వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. ఈ సందర్భంగా వందలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మ రూపాన్ని తమ చేతుల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొత్తకొత్త పథకాలకు ఇవాల్టి నుంచే శ్రీకారం చుట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటుతున్నారు. ఇక పార్టీ తరఫున రక్తదాన శిబిరాలు, అన్నదానాలు సరేసరి! ఇదంతా అలా ఉంచితే... చెన్నై నగరపాలక సంస్థ నడిపే ఆసుపత్రులలో ఇవాళ జన్మించే పాపలకు 10,000 రూపాయలను అందచేయబోతోంది ప్రభుత్వం. జయకుమార్ అనే న్యాయవాదైతే మరో అడుగు ముందుకు వేసి ఉత్తరచెన్నైలో ఇవాళ పుట్టే పాపలకు తాను బంగారు ఉంగరాలను బహుకరించనున్నట్లు చెప్పారు.