నేటి నుంచే సచిన్ ఆఖరి మ్యాచ్

 

 

 

ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్ కు ముగింపు పలికే ఆ పోరు ఈ రోజు మొదలైంది. క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ముంబై గడ్డపైనే ఈ పరుగుల వేటగాడు ఆఖరి ఆట ఆడుతున్నాడు. తన 200వ టెస్ట్‌తో తన పరుగుల దాహానికి పరిసమాప్తి పలుకనున్నాడు. మ్యాచ్ జట్ల మధ్యే జరుగుతున్న దృష్టంతా ఆ ఒక్కడిపైనే...ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మ్యాచ్ లోనూ సచిన్ పై భారీగా అంచనాలున్నాయి. సచిన్ టెండూల్కర్ శతకంతో కెరీర్ కు ముగిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

మరోవైపు మొదటి మ్యాచ్ లో విజయంతో జోరు మీదున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి మాస్టర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్లోనైనా గెలిచి భారత అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లాడానికి వెస్టిండీస్ సిద్దమైంది.