టెన్నిస్ కి అండీ రాడిక్ గుడ్ బై
posted on Sep 6, 2012 5:35PM
యూఎస్ ఓపెన్ కు టెన్నిస్ స్టార్ స్టార్ అండీ రాడిక్ గుడ్ బై చెప్పాడు. అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్ పోత్రో చేతిలో ఓటమిపాలైన రాడిక్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ లో కెరీర్ విషాదంతో ముగిసింది. 12 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో 2003 యూఎస్ ఓపెన్ తోపాటు 32 టైటిల్స్, 20 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అంతేకాకుండా తన టెన్నిస్ కెరీర్ లో మూడు సార్లు వింబుల్డన్ రన్నరప్ గా నిలిచాడు. 2002 నుండి 2009 వరకు ప్రతి సంవత్సరం ఫెదరర్‌తో పాటు ఆండీ రాడిక్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ టాప్ 10లో స్థానం పొందాడు. టెన్నిస్‌లో అత్యంత శక్తివంతమైన సర్వీస్‌కు రాడిక్ పేరు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రికార్డు చేయబడిన వేగవంతమైన సర్వ్ అతనిదే, దాని వేగం 155 mph.