'ఆటో నగర్ సూర్య' పస్ట్ లుక్ విడుదల
posted on Nov 22, 2012 5:31PM
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 'ఆటో నగర్ సూర్య' పస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రేపు నాగచైతన్య బర్త్ డే సందర్బంగా ఆటో నగర్ సూర్య పస్ట్ లుక్ ను విడుదల చేశారు. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా రెండు విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి. చైతన్య తండ్రి నటించిన ‘ఢమరుకం' చిత్రం రేపు విడుదలవ్వడంతో పాటు, ‘ఆటో నగర్ సూర్య' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కావటంతో అభిమానులు పండగా చేసుకుంటున్నారు.
దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్. వినోదం, యాక్షన్ అంశాలతో మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెట్టబోతున్నారు . ఈ చిత్రంలో సాయికుమార్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.

