LATEST NEWS
పంజాబ్ ముఖ్యమం్తరి భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పొలిటికల్ క్లియరెన్స్ ను రిజెక్ట్ చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పడం ఇది మూడో సారి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళ్లాలంటే  విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ అనుమతినే పొలిటికల్ క్లియరెన్స్ అంటారు.   అయితే తరచుగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్  మాన్ పర్యటనపై కేంద్రం ఈ పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. మాన్  విదేశీ పర్యటనకు కేంద్రం వరుసగా మూడో సారి అనుమతి నిరాకరించడం గమనార్హం.   ఈ ఏడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా నిరాకరించింది. అంతకు ముందు పారిస్ ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లాలని భావించిన పంజాబ్ సీఎం మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య,  విదేశీ పంజాబీల సహకారం కోసం మాన్ విదేశీ పర్యటనకు సంకల్పించారు.  కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది.   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (ఫిబ్రవరి 9) హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి హస్తిన చేరుకుంటారు. రాత్రికి ఆయన హస్తినలో బసచేసి మంగళవారం (ఫిబ్రవరి10)  కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్తమంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులతో ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు.  ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు   బకాయిల విడుదల,   పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన  నిర్మలా సీతారామన్ ను కోరే అవకాశం ఉందం టున్నారు. అదే విధంగా  జధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు.  ఈ  భేటీల  అనంతరం మంగళవారం సాయంత్రం  ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి  విజయవాడ చేరుకుంటారు.
రాజకీయ నాయకులలో భాషా సంస్కారం తగ్గిపోతోందన్న విమర్శ ఇటీవలి కాలంలో చాలా చాలా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సభ్య సమాజం ఇసుమంతైనా సహించని పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై దూషణలకు దిగడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. ఇటీవల వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఉపయోగించిన అసభ్య పదజాలం, దూషణలు, అలాగే మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా మరో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగు రమేష్  ఉపయోగించిన భాష ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా సంస్కారం లేకుండా ప్రత్యర్థులపై దూషణల పర్వానికి దిగడం అన్నది ఎక్కువైందని పరిశీలకులు అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ రకమై భాష వినియోగానికి శ్రీకారం చుట్టినది బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. కేసీఆర్ ఆరంభించిన ఈ ఆమోదయోగ్యం కాని భాషను ప్రత్యర్థులపై ప్రయోగించే సంస్కృతిని కేసీఆర్ ఆరంబిస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కొనసాగించారని ఆయన పేర్కొన్నారు. బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడారని  గుర్తుచేశారు. అయితే అప్పట్లో ఉద్యమ వేడి కారణంగా కేసీఆర్ భాషను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. అభ్యంతరం ఉన్నా.. తెలంగాణ సెంటిమెంట్ అత్యంత బలంగా ఉండటంతో.. అడ్డు చెప్పి ఎదుర్కోవడానికి వెనుకాడారని పేర్కొన్నారు.  రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదప్రయోగాలు మాత్రం కేసీఆర్ హయాంలోనే మొదలైందన్న ఆయన ఈ ధోరణి రాజకీయ నాయకులలో ప్రబలడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు.   కేసీఆర్‌ను తమ గురువుగా భావించే జగన్.. ఏపీ రాజకీయాలలోకి కూడా భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, అసభ్య పదజాలంతో ప్రత్యర్థులను దూషించడం మొదలెట్టి కొనసాగిస్తున్నారని విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన సాగిన ఆ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నాయకులు, మంత్రులు సైతం దారుణమైన బూతులతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై విరుచుకుపడ్డారన్నారు. దీని వల్ల ఏపీ రాజకీయ సంస్కృతి దారుణంగా దెబ్బతిందన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా  సమస్యలను చర్చల ద్వారా కాకుండా..  ప్రత్యర్థులను అణచివేస్తూ, తొక్కుకుంటూ ముందుకు సాగాలనే తత్వం వారిద్దరిలోనూ కనిపిస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే బూతులు మాట్లాడటం  యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఏబీవీ అభిప్రాపడ్డారు.  
ALSO ON TELUGUONE N E W S
The excitement surrounding Natural Star Nani’s upcoming film The Paradise has reached a new high with the commencement of a special song shoot. Nani and the team are currently filming the explosive introduction track "Aaya Sher" in Hyderabad. This high-energy song is being choreographed by Sudhan Master on a lavish scale with hundreds of background dancers, aiming to deliver a goosebump-inducing experience on the big screen. The music for this mass anthem is composed by the sensational Anirudh Ravichander, who has delivered a gritty and powerful tune tailored for Nani’s signature dance style. The collaboration between Nani and director Srikanth Odela has already created massive expectations, and this song is set to further elevate the film's hype. Produced by Sudhakar Cherukuri, the project is being mounted with high production values and a strong technical crew. The Paradise is a period action drama that boasts an impressive ensemble cast, featuring veteran actor Mohan Babu alongside Raghav Juyal and Sampoornesh Babu. Every aspect of the production is being handled with immense care. The film is gearing up to entertain global audiences with a release planned in eight languages across the world. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాల్లో సంక్రాంతికి థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ ఉంది. బాక్సాఫీస్ వద్ద 375 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా జీ5 వేదికగా ఫిబ్రవరి 11 నుండి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ.. ఇలా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి రేసులో నిలిచిన మరో సినిమా ‘అనగనగా ఒకరాజు’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.   సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ‘నారీ నారీ నడుమ మురారి’, జియో హాట్ స్టార్‌లో ‘ది రాజా సాబ్‌’ చిత్రాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఇవిలా ఉంటే.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమా నేరుగా ఓటీటీలో ఫిబ్రవరి 12 నుంచి విన్ వేదికగా స్ట్రీమ్ అవనుంది. ఈ సినిమాలో లయ, శివాజీ మళ్లీ జంటగా కనిపిస్తారు. అలాగే మలయాళీ మెడికో థ్రిల్లర్ ‘బేబీ గర్ల్‌’ ఫిబ్రవరి 12 నుంచి ప్రేక్షకుల్ని అలరించనుంది.    జియో హాట్ స్టార్‌లో నివిన్ పౌలి హీరోగా నటించిన ‘సర్వం మాయా’ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మంజుమల్ బాయ్స్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సౌబీన్ షాహీర్ ‘పాతి రాత్రి’ సినిమా కూడా ఫిబ్రవరి 13 నుండి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ చిత్రం ‘నీలకంఠ’ సన్ నెక్స్‌ట్‌లో ఈ వారం నుంచి స్ట్రీమ్ అవుతుంది. వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే ‘ది కంజూరింగ్: లాస్ట్ నైట్స్‌’ జియో హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 13నుంచి, ఇటాలియన్ సిరీస్ ‘మోటార్ వ్యాలీ’ నెట్ ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
    -పవన్ నెక్స్ట్ సినిమాకి ప్రభాస్ ఫౌజీ కి సంబంధం ఏంటి! -సురేందర్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పని ఎంత వరకు వచ్చింది.  -ఇమాన్వి ఇస్మాయిల్ మరో భారీ ఆఫర్ దక్కించుకుందా! -అదే నిజమైతే జరిగేది ఇదేనా! ఒక్కో హీరోయిన్ ది ఒక్కో టైం. ఆ టైం వచ్చినపుడు సదరు హీరోయిన్ ని ఆపడం ఎవరి తరం కాదు. తమ సినిమాలో బుక్ చేసుకున్న మేకర్స్ సైతం సెకండ్ ఒపీనియన్ కి వెళదామనే ఆలోచన కూడా చెయ్యరు. టైం కి అంత అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ శక్తులన్నీ ఇమాన్వి ఇస్మాయిల్‌(Imanvi Ismail)కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ఛాన్స్ దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మనం కూడా సదరు వార్తల పూర్తి డీటెయిల్స్ చూద్దాం.   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీని సురేందర్ రెడ్డి(Surendar Reddy)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కబోతుందనే టాక్ ఆల్రెడీ ఉంది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలబడాలనే లక్ష్యంతో పవన్ ఫ్రెండ్  రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇమాన్వి ని ఫిక్స్ చేసారని, త్వరలోనే అధికార ప్రకటన రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న న్యూస్ గా మారింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇమాన్వి ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)తో 'ఫౌజీ'(Fouji)చేస్తుంది. సదరు ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ నో అర్ధం చేసుకోవచ్చు. పైగా ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటుంది. మరి ఆ వెంటనే ఏ మాత్రం గ్యాప్ లేకుండా పవన్ తో జోడి కట్టే ఛాన్స్ వచ్చిందని వినిపిస్తుండటంతో సదరు న్యూస్ కి ప్రాధాన్యత పెరిగింది. also read: డబ్బు అవసరం కాబట్టే చేశాను.. నిజం ఒప్పుకున్న సీనియర్ నటీమణి  సినీ విశ్లేషకులు సైతం ఈ విషయంపై స్పందిస్తు ఇమాన్వి కనుక పవన్ తో జోడి కట్టడం పక్కా అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇమాన్వి నెంబర్ వన్ హీరోగా జెండా పాతడం ఖాయం. ఆ సత్తా ఆమెకి ఉంది.పైగా ఫౌజీ క్రేజీ ని కూడా పవన్ మూవీకి ఇమాన్వి ఫ్రీగా ఇచ్చినట్లవుతుందని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఇమాన్వి  సిల్వర్ స్క్రీన్ పై కూడా  ఆ స్థాయి చరిష్మా ని అందుకోవడమే ఖాయమనే నమ్మకం అభిమానుల్లో ఉంది.      
  వచ్చే సంక్రాంతి బరిలో నలుగురు సీనియర్ స్టార్లు గతంలో ఈ ఫోర్ పిల్లర్స్ ఎన్నిసార్లు తలపడ్డారు? ఎవరు పైచేయి సాధించారు? ఒక్క హిట్ కూడా చూడని స్టార్ ఎవరు?   సీనియర్ స్టార్స్ చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh), నాగార్జున(Nagarjuna)లను టాలీవుడ్ కి నాలుగు స్తంభాలుగా భావిస్తుంటారు. అలాంటి ఈ నలుగురు స్టార్స్.. ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగితే ఎలా ఉంటుంది. 2027 సంక్రాంతికి అలాంటి అద్భుతమే జరిగేలా ఉంది.    బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిరంజీవి 158వ సినిమా (Mega 158), గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బాలకృష్ణ 111వ సినిమా (NBK 111) సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఇక వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న నాలుగో సినిమాని కూడా సంక్రాంతికి తీసుకురానున్నారు. నాగార్జున సైతం 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్ తో 2027 సంక్రాంతి బరిలో దిగుతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని.. 2027 జనవరి 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.   మొత్తానికి వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ బాక్సాఫీస్ బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో గతంలో వీరు ఎన్నిసార్లు బాక్సాఫీస్ వార్ కి దిగారు? ఆ పోరులో ఎవరు పైచేయి సాధించారు? అనే చర్చ జరుగుతోంది.   టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ ఇప్పటిదాకా మూడుసార్లు మాత్రమే క్లాష్ కి రావడం విశేషం. మొదటిసారి 1986లో వీరి మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. నాగార్జున, వెంకటేష్ అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభించగా.. బాలకృష్ణ, చిరంజీవి అప్పటికే హీరోలుగా నిలదొక్కుకున్నారు. ఆగస్టు 7, 1986న బాలకృష్ణ 'దేశోద్ధారకుడు' విడుదలవ్వగా.. ఆ తర్వాత వారం వారం గ్యాప్ తో వెంకటేష్ 'కలియుగ పాండవులు', చిరంజీవి 'చంటబ్బాయ్', నాగార్జున 'కెప్టెన్ నాగార్జున' సినిమాలు విడుదలయ్యాయి. మొదటి పోరులో బాలకృష్ణ, వెంకటేష్ విజయాలు చూడగా.. చిరంజీవి, నాగార్జున పరాజయాలు చూశారు. ఆ తర్వాతి కాలంలో 'చంటబ్బాయ్' కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. థియేటర్లలో మాత్రం కమర్షియల్ సక్సెస్ చూడలేదు.     రెండోసారి 1987లో ఈ నలుగురు హీరోలు తలపడ్డారు. 1987, జూలై 23న 'పసివాడి ప్రాణం'తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాగా.. జూలై 31న 'రాము'తో బాలకృష్ణ, ఆగష్టు 12న 'అగ్ని పుత్రుడు'తో నాగార్జున, ఆగష్టు 14న 'విజేత విక్రమ్'తో వెంకటేష్ రంగంలోకి దిగారు. ఈ పోరులో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ అందుకోగా, బాలకృష్ణ సాధారణ హిట్ తో సరిపెట్టుకున్నారు. నాగార్జున, వెంకటేష్ మాత్రం ఫ్లాప్స్ ని చూశారు.      పదేళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి 1997లో ఈ నలుగురు స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్ కి దిగారు. 1997 అక్టోబర్ 3న చిరంజీవి 'మాస్టర్' విడుదలవ్వగా.. అక్టోబర్ 9న వెంకటేష్ 'పెళ్లి చేసుకుందాం', అక్టోబర్ 23న బాలకృష్ణ 'దేవుడు', అక్టోబర్ 30న నాగార్జున 'రక్షకుడు' రిలీజ్ అయ్యాయి. ఈ పోరులో చిరంజీవి, వెంకటేష్ సక్సెస్ చూడగా.. బాలకృష్ణ, నాగార్జునలకు నిరాశ ఎదురైంది.     ఇలా మొత్తం మూడుసార్లు తలపడగా.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తలా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్నారు. నాగార్జునకు మాత్రం మూడుసార్లూ నిరాశే ఎదురైంది.   ఏకంగా మూడు దశాబ్దాల తర్వాత.. 2027 సంక్రాంతికి టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ మళ్ళీ బాక్సాఫీస్ వార్ కి సై అంటున్నారు. ఈ నలుగురూ ఒకేసారి సంక్రాంతి బరిలో నిలవడం ఇదే మొదటిసారి. సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చి నాగార్జున ఈసారైనా విజయాన్ని ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.    
- మరోసారి వార్తల్లోకి వచ్చిన ‘స్పిరిట్‌’! - ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి మధ్య రేగిన వివాదం ఏంటి? - ‘స్పిరిట్‌’ నుంచి ప్రకాష్ రాజ్ బయటికి రావడానికి అదే కారణమా? - ప్రకాష్ రాజ్ విషయంలో ‘స్పిరిట్‌’ మేకర్స్ డెసిషన్ ఏంటి?   ఈమధ్యకాలంలో టాలీవుడ్‌లోని టాప్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్న విషయం తెలిసిందే. అన్నింటి కంటే రెబల్‌స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల పైనే అందరి దష్టీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ సందీప్‌రెడ్డి వంగా వంటి విలక్షణ దర్శకుడితో ప్రభాస్ చేస్తున్న సినిమా అంటే దానికి ఓ ప్రత్యేకత ఏర్పడుతుంది. సందీప్‌రెడ్డి అంతకుముందు చేసిన అర్జున్‌రెడ్డి, యానిమల్ సినిమాలే దానికి కారణం. ఆ సినిమాల్లో హీరో ఎంత ఫెరోషియస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఇప్ప్పుడు ప్రభాస్, సందీప్ కాంబినేషన్‌లో రూపొందుతన్న ‘స్పిరిట్’ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.    ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్‌ను ఒక డిఫరెంట్ లుక్‌తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌లో చూపించబోతున్నాడు సందీప్. ఇక అతని సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ తప్ప్పుకున్నారనేది ఆ వార్త.    తన గత చిత్రాలకు భిన్నంగా ఎంతో ఫాస్ట్‌గా ‘స్పిరిట్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు సందీప్. అందులో భాగంగానే ప్రభాస్, ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఆమధ్య న్యూస్ వచ్చింది. అయితే సడన్‌గా ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్ప్పుకున్నారనే వార్త ఇప్ప్పుడు అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. అంత హైప్ ఉన్న భారీ సినిమా నుంచి ప్రధాన నటుడు తప్ప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెట్టేస్తే.. ముందు ఆ వార్త రావడంతోనే షూటింగ్‌లో ఏం జరుగుతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది.    గతంలో రిలీజ్ అయిన ‘స్పిరిట్’ వాయిస్ టీజర్‌లో ఒక జైలు అధికారిగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారనే విషయం అర్థమైంది. ప్రత్యేకంగా టీజర్‌లో వాయిస్ ఉంది అంటే సినిమాలో అతని క్యారెక్టర్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రాధాన్యం ఉన్న నటుడు సినిమా నుంచి తప్ప్పుకోవడం అనేది ఇప్ప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి.  మొదట అనుకున్న హీరోయిన్ దీపికా పదుకొనే. కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి యానిమల్‌లో నటించిన దీప్తి తిమ్రిని తీసుకున్నారు.    ఇక అసలు విషయానికి వస్తే.. ప్రకాష్‌రాజ్, సందీప్‌రెడ్డి మధ్య తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్ప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్‌రాజ్‌తో షూటింగ్ మొదలైన కొన్నిరోజులకే ఈ వార్త బయటికి రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సీన్స్‌ని సందీప్ తీస్తున్న విధానంతో ప్రకాష్‌రాజ్ ఏకీభవించకపోవడం వల్ల షూటింగ్‌కి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. అందుకే ప్రకాష్ రాజ్ సినిమా నుంచి బయటికి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. ప్రకాష్‌రాజ్ విషయంలో సందీప్ టెన్షన్ పడుతున్నాడని, నెక్స్‌ట్ ఏం చెయ్యాలన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదని సమాచారం.    ప్రకాష్‌రాజ్ స్థానంలో మరో నటుడ్ని తీసుకుంటారా లేక అతనితోనే కాంప్రమైజ్ అయి కంటిన్యూ అవుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ప్రకాష్‌రాజ్‌గానీ, చిత్ర యూనిట్‌గానీ స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. ‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా చేస్తున్నారు సందీప్‌రెడ్డి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
  స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 246 ఏళ్ల క్రితం భారతదేశంలో బ్రిటీషర్ల అవినీతిని,  వారి తప్పులను ధైర్యంగా బహిర్గతం చేసి, ప్రజలకు అందించిన వార్తాపత్రిక ఒకటుంది. నిజానికి ఈ వార్తాపత్రిక భారతదేశంలో స్వతంత్ర  జర్నలిజానికి పునాది వేసింది. ఆ వార్తా పత్రిక పేరే హిక్కీస్ బెంగాల్ గెజిల్. దీన్ని హికీ గెజిట్ అని, బెంగాల్ గెజిట్  లేదా కలకత్తా జనరల్ అడ్వర్డైజర్ అని వివిధ పేర్లతో పిలిచారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. జనవరి 29, 1780.. భారతదేశంలో అధికారిక జర్నలిజం యుగం జనవరి 29, 1780న ప్రారంభమైంది. జేమ్స్ అగస్టస్ హికీ అనే వ్యక్తి కలకత్తాలో దేశంలోని మొట్టమొదటి వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. ఇది "హికీ గెజిట్", "బెంగాల్ గెజిట్" లేదా "కలకత్తా జనరల్ అడ్వర్టైజర్" అని వివిధ పేర్లతో పిలువబడింది. సమాచారంపై అధికారంలో ఉన్నవారు గుత్తాధిపత్యం వహించిన కాలం అది. అటువంటి క్లిష్ట సమయాల్లో హిక్కీ రెండు పేజీల వార్తాపత్రికను ప్రచురించడం ద్వారా కమ్యూనికేషన్ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేశాడు. న్యాయం, ధైర్యం.. హికీ ఈ వార్తాపత్రికను సమాచార వనరుగా మాత్రమే కాకుండా స్వతంత్ర వేదికగా కూడా స్థాపించారని చెబుతారు. ఆయన వార్తాపత్రిక  అత్యంత గొప్ప లక్షణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నత స్థాయి అధికారులపై తిరుగులేని విమర్శలు చేయడం. ఆయన పరిపాలనలోని లోపాలను ప్రజలకు బహిర్గతం చేసి, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిగా పనిచేశారు. ఆయన నిర్భయంగా మొదలు పెట్టిన ఈ జర్నలిజం భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు పునాది వేసింది. అణచివేత.. హిక్కీ నిష్పాక్షికంగా  విమర్శించే వైఖరి ఈస్ట్  ఇండియా కంపెనీకి నచ్చలేదు. దీని వలన హిక్కీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆగ్రహానికి గురయ్యాడు. అతనికి భారీ జరిమానా విధించి,  జైలు శిక్ష కూడా విధించారు. కేవలం రెండేళ్లే.. ప్రభుత్వ ఒత్తిడి,  అణచివేత విధానాల కారణంగా, ఆ వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. చివరికి 1782లో, హికీ ప్రింటింగ్ ప్రెస్ జప్తు చేశారు.  ఈ చారిత్రాత్మక వార్తాపత్రిక ప్రచురణను శాశ్వతంగా నిలిపివేశారు. చెరగని ముద్ర.. వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉనికిలో ఉన్నప్పటికీ, అది భారత చరిత్రపై చెరగని ముద్ర వేసింది. ఈ వార్తాపత్రిక యొక్క అసలు కాపీలు ఇప్పటికీ లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో,  భారతదేశంలోని ఎంపిక చేసిన ఆర్కైవ్‌లలో భద్రపరిచారు. ఇదీ భారతదేశంలో ప్రారంభించిన మొదటి వార్తాపత్రిక ప్రభంజనం.                               *రూపశ్రీ.
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది.  కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది.  ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ,  1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది.   ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం,  సమయం చాలా తగ్గాయి. భారత తపాలా శాఖ.. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి.  వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది.  ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం. ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి  ఈ సర్వీస్ ను నడిపింది. అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.                                  *రూపశ్రీ.
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య.  క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు.  ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి,  దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు,  ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  దీని గురించి ఆరోగ్య నిపుణులు,  ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు. క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం,  జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం,  శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా,  ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం,  శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది.  పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది. ప్రభుత్వ విధానాలు.. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు,  దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి. ప్రజలు చేయాల్సినది.. క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.  క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి,  శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు,  ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకోవడం,  వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి.  ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.                                    *రూపశ్రీ.
పంజాబ్ ముఖ్యమం్తరి భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పొలిటికల్ క్లియరెన్స్ ను రిజెక్ట్ చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పడం ఇది మూడో సారి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళ్లాలంటే  విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ అనుమతినే పొలిటికల్ క్లియరెన్స్ అంటారు.   అయితే తరచుగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్  మాన్ పర్యటనపై కేంద్రం ఈ పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. మాన్  విదేశీ పర్యటనకు కేంద్రం వరుసగా మూడో సారి అనుమతి నిరాకరించడం గమనార్హం.   ఈ ఏడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా నిరాకరించింది. అంతకు ముందు పారిస్ ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లాలని భావించిన పంజాబ్ సీఎం మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య,  విదేశీ పంజాబీల సహకారం కోసం మాన్ విదేశీ పర్యటనకు సంకల్పించారు.  కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది.   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (ఫిబ్రవరి 9) హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి హస్తిన చేరుకుంటారు. రాత్రికి ఆయన హస్తినలో బసచేసి మంగళవారం (ఫిబ్రవరి10)  కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్తమంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులతో ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు.  ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు   బకాయిల విడుదల,   పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన  నిర్మలా సీతారామన్ ను కోరే అవకాశం ఉందం టున్నారు. అదే విధంగా  జధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు.  ఈ  భేటీల  అనంతరం మంగళవారం సాయంత్రం  ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి  విజయవాడ చేరుకుంటారు.
రాజకీయ నాయకులలో భాషా సంస్కారం తగ్గిపోతోందన్న విమర్శ ఇటీవలి కాలంలో చాలా చాలా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సభ్య సమాజం ఇసుమంతైనా సహించని పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై దూషణలకు దిగడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. ఇటీవల వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఉపయోగించిన అసభ్య పదజాలం, దూషణలు, అలాగే మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా మరో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగు రమేష్  ఉపయోగించిన భాష ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా సంస్కారం లేకుండా ప్రత్యర్థులపై దూషణల పర్వానికి దిగడం అన్నది ఎక్కువైందని పరిశీలకులు అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ రకమై భాష వినియోగానికి శ్రీకారం చుట్టినది బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. కేసీఆర్ ఆరంభించిన ఈ ఆమోదయోగ్యం కాని భాషను ప్రత్యర్థులపై ప్రయోగించే సంస్కృతిని కేసీఆర్ ఆరంబిస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కొనసాగించారని ఆయన పేర్కొన్నారు. బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడారని  గుర్తుచేశారు. అయితే అప్పట్లో ఉద్యమ వేడి కారణంగా కేసీఆర్ భాషను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. అభ్యంతరం ఉన్నా.. తెలంగాణ సెంటిమెంట్ అత్యంత బలంగా ఉండటంతో.. అడ్డు చెప్పి ఎదుర్కోవడానికి వెనుకాడారని పేర్కొన్నారు.  రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదప్రయోగాలు మాత్రం కేసీఆర్ హయాంలోనే మొదలైందన్న ఆయన ఈ ధోరణి రాజకీయ నాయకులలో ప్రబలడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు.   కేసీఆర్‌ను తమ గురువుగా భావించే జగన్.. ఏపీ రాజకీయాలలోకి కూడా భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, అసభ్య పదజాలంతో ప్రత్యర్థులను దూషించడం మొదలెట్టి కొనసాగిస్తున్నారని విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన సాగిన ఆ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నాయకులు, మంత్రులు సైతం దారుణమైన బూతులతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై విరుచుకుపడ్డారన్నారు. దీని వల్ల ఏపీ రాజకీయ సంస్కృతి దారుణంగా దెబ్బతిందన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా  సమస్యలను చర్చల ద్వారా కాకుండా..  ప్రత్యర్థులను అణచివేస్తూ, తొక్కుకుంటూ ముందుకు సాగాలనే తత్వం వారిద్దరిలోనూ కనిపిస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే బూతులు మాట్లాడటం  యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఏబీవీ అభిప్రాపడ్డారు.  
శరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..!   ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది.  శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు.  అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు శరీరానికి అందవు,  ఎంత తిన్నా ఏం మార్పు లేదని చాలామంది కన్ప్యూజన్ అవుతుంటారు. అయితే ఆహారాల కాంబినేషన్ లు మ్యాజిక్ చేస్తాయి.  ఆహారంలో లభించే పోషకాల సినర్జిస్టిక్ ప్రభావం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మల్టీవిటమిన్లు సహజంగా మొత్తం ఆహారాలలో కనిపిస్తాయి. విటమిన్లు,  ఖనిజాలతో పాటు, అవి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఫైబర్.. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఇది శరీరంలోకి పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఎంజైమ్‌లు.. పోషకాలను విచ్ఛిన్నం చేసి నిర్దిష్ట మూలకాలను సక్రియం చేస్తాయి. ఫైటోకెమికల్స్.. పోషకాలను నష్టం నుండి రక్షిస్తాయి.  పోషకాలను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి. ఆహార కాంబినేషన్లు.. బెస్ట్ కాంబో.. సిట్రస్ పండ్లు లేదా ఆకుకూరలతో కూరగాయలు, గింజలతో పండ్లు. బెస్ట్ కలర్స్.. వివిధ రంగుల పండ్లు,  కూరగాయలు ముఖ్యమైన ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఆహార కొవ్వును సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి విటమిన్లు A, D, E,  K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అవసరం. కాల్షియం, విటమిన్-డి.. తగినంత విటమిన్ డి లేకుండా  శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించదు. అందువల్ల  కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో విటమిన్ డి ని సప్లిమెంట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బలమైన దంతాలు,  ఎముకలను నిర్వహించడానికి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్-సి, ఐరన్.. విటమిన్ సి తో ఐరన్ తీసుకోవడం వల్ల  శరీరం దానిని సులభంగా జీర్ణం చేస్తుంది. అందుకే పాలకూరతో నిమ్మకాయ, టమోటాలతో పప్పు, బెర్రీలతో బలవర్థకమైన తృణధాన్యాలు వంటి కాంబినేషన్లు మంచివిగా పరిగణించబడతాయి. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్.. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి ప్రోబయోటిక్స్ అవసరమైన బ్యాక్టీరియా. అవి జీర్ణక్రియకు సహాయపడతాయి,  రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, దోస,  కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాను నిర్వహించడానికి ప్రీబయోటిక్ ఆహారాలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్‌కు ఎరువుగా పనిచేసే ఒక రకమైన ఆహార ఫైబర్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆపిల్స్,  తృణధాన్యాలలో ప్రీబయోటిక్స్ కనిపిస్తాయి.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు.  ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం  ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం.  అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.  ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పేగు ఆరోగ్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.   షుగర్ లెవల్స్.. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  టైప్ 2 డయాబెటిస్‌కు  దారితీస్తుంది. కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం.. ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్.. ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం  ప్రధాన వడపోత  అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది.  ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది,  క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్,  ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది,  అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు,  శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల,  ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,  కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు.  కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే.. మనం తినే,  త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.  కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే..  డిటాక్స్ డ్రింక్.. రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది  చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా,  యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్  డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట,  మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సొంపు నీటిని ఎలా చేసుకోవాలి.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ సోంపు.. 1 టీస్పూన్ జీలకర్ర.. 1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు.. తయారు విధానం.. పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్‌లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి.  దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి.  ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.   డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది,  కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది సొంపు చేసే మ్యాజిక్.. పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది.  ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు,  ముడతలను తగ్గిస్తుంది,  ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.