LATEST NEWS
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎరుకలి మహదేవప్ప సోమవారం (ఫిబ్రవరి 9) అర్థరాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణాలపై మక్తల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మహదేవప్ప ఆత్మ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదలా ఉండగా మహదేవప్ప ఆత్మ హత్యకు పాల్పడటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎంపీ డీకే అరుణ మక్తల్‌కు చేరుకుని మహదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహదేవప్పది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ కాంగ్రెస్ చేసిన హత్యేనని అన్నారు. బెదిరింపులలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను మించిపోయిందని విమర్శించారు. ఒత్తిడి, బెదరింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారన్న డీకే అరుణ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తాను పాల్గొన్న రోడ్ షో, బీజేపీ సమావేశాలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఓటమి భయంతో బెదరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
గత కొద్ది రోజులుగా బీజేపీ అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా బెదరింపులు వస్తున్నాయన్న డీకే అరుణ.. కోస్గి నియోజకవర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరించి, కాంగ్రెస్‌లో చేర్చుకున్నారంటూ ఎంపీ అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే, కోస్గి నియోజకవర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని , సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని డీకే అరుణ ఇరోపించారు.
హిందూ వ్యతిరేకత విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ ల మధ్య నేనంటే నేను గోప్ప అన్న సంవాదం నడుస్తోందా? తాజాగా ఇరువురూ చెన్నైలోని ఓ వివాహ వేడుకలో కలుసుకుని పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు జగన్, ఉదయనిథి స్టాలిన్ హాజరయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎందరో అతిరథ మహారథులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి. జగన్ ఉదయనిథి స్టాలిన్ ఇరువురూ ఆ వివాహ వేడుకలో కలిసి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో నెటిజనులు వారి హిందూ వ్యతిరేక వైఖరిపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఆ ట్రోలింగ్ లో భాగంగానే సనాతన ధర్మం అనేది వైరస్ అని భలే అన్నావ్ అని జగన్ రెడ్డి అంటే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన నీ ముందు నేనెంత అన్న చర్చ జరిగి ఉంటుందంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. హిందూ ధర్మంపై వ్యతిరేకత విషయంలో ఉదయనిధి స్టాలిన్, వైఎస్ జగన్ లలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అన్న డిబేట్ కు కూడా వీరిరువురి భేటీ దృశ్యాలు దోహదం చేశాయి. వీరిరువురిలో ఉదయనిథి స్టాలిన్ ఒక రకంగా బెటర్.. ఆయన ఎటువంటి దాపరికం లేకుండా తన హిందూ వ్యతిరేక వాణిని కుండబద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యక్తం చేశారు.
ఆ విషయంలో ఆయనకు ఎటువంటి శషబిషలూ లేవు. అయితే జగన్ అలా కాదు.. ఓ పక్క తాను హిందూ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే.. చేతల్లో తన వ్యతిరేకత చూపుతుంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరకామణి చోరీ చాలా చిన్న వ్యవహారం అనడం. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ అని ధృవపడినా, అందులో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ బుకాయించడం వరకూ జగన్ హిందూ వ్యతిరేకతను చాపకింద నీరులా కనిపించీ కనిపించకుండా చాటుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇద్దరే. హిందూ వ్యతిరేకత విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పొలిటికల్ క్లియరెన్స్ ను రిజెక్ట్ చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పడం ఇది మూడో సారి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళ్లాలంటే విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ అనుమతినే పొలిటికల్ క్లియరెన్స్ అంటారు.
అయితే తరచుగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాన్ పర్యటనపై కేంద్రం ఈ పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం వరుసగా మూడో సారి అనుమతి నిరాకరించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా నిరాకరించింది. అంతకు ముందు పారిస్ ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లాలని భావించిన పంజాబ్ సీఎం మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు.
ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య, విదేశీ పంజాబీల సహకారం కోసం మాన్ విదేశీ పర్యటనకు సంకల్పించారు. కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది.
ALSO ON TELUGUONE N E W S
-నితిన్ కి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది!
-ప్రాబ్లెమ్ ఎక్కడ వస్తుంది
-అభిమానులు ఏమంటున్నారు
సినీ కాలం కలిసి రావడం లేదో లేక ఎవరి దిష్టి అయినా తగిలిందో ఏమో గాని నితిన్(Nithiin)సినీ కెరీర్ అంత ఊపుతో వెళ్లడం లేదు.ఈ విషయంలో అభిమానులతో పాటు ప్రేక్షకులు నితిన్ సినీ గ్రాఫ్ చూస్తూ రెండున్నర దశాబ్దాల క్రితమే మొదటి రెండు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న నితిన్, ప్రెజెంట్ నితిన్ ఒకరేనా అని ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి. పెర్ఫార్మ్ పరంగా ఎలాంటి లోటు లేదు. కానీ సరైన కథలు ఎంచుకోకపోవడం వలనే ప్లాప్ లని చాలా గట్టిగా వడిసి పట్టుకుంటున్నాడనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినపడుతుంది. నితిన్ నుంచి ఇప్పటి వరకు 35 చిత్రాలు వచ్చాయి.రీసెంట్ గా తన 36 వ చిత్రాన్నివిభిన్నచిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్(Vi anand)తో చేస్తున్నట్టుగా అనౌన్స్ మెంట్ వచ్చింది.ఇప్పుడు మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
తొలి చిత్రం 'ఆయ్' తోనే మంచి స్పాన్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు అంజి కె. మణిపుత్ర(Aniji K maniputhra).ఇటీవల నితిన్ కి అంజి ఒక స్టోరీ నేరేట్ చేశాడట. సదరు కథ, కధనం నచ్చడంతో అంజికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ట్రేడ్ వర్గాలు స్పందిస్తు నితిన్ ముందుగా తన 36 వ చిత్రాన్ని ఎవరితో చేస్తాడు. లేక రెండు సినిమాలు ఒకే సారి చేస్తాడా అనే కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు.
also read: 2. 5 కోట్లు చెల్లించండి.. లేదంటే జైలుకే
వీఐ ఆనంద్ మూవీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతుండగా నితిన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నటుగా తెలుస్తుంది. 2005 వ సంవత్సరంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'అల్లరి బుల్లోడు'లో నితిన్ డ్యూయల్ రోల్ చేశాడు.అంటే మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత డ్యూయల్ రోల్ లో కనిపించినట్లవుతుంది. అంజి సినిమాకి సంబంధించిన కథ విషయంలో ఇంకా ఎలాంటి వార్తలు రావడం లేదు.
-ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది
-అభిమానులు ఏమంటున్నారు
-కట్టకపోతే ఏం జరుగుతుంది
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)నుంచి సినిమా వస్తుందంటే సౌత్ సినీ సర్కిల్స్ లో ఉండే సినీ జాతర తెలిసిందే. సినిమా అనౌన్స్ మెంట్ రోజు నుంచే సదరు సినీ జాతర ప్రారంభమవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రజినీ సినీ ప్రోటాన్షియల్ కి ఉన్న కెపాసిటీ లో అదొక మచ్చు తునక మాత్రమే. అలాంటి చరిష్మా ఉన్న రజినీ మూవీ ఇప్పుడు 2 .5 కోట్ల రూపాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని చవి చూస్తున్న సినిమా ఏంటో చూద్దాం.
కొచ్చడైయాన్(Kochadaiiyaan)..రజినీకాంత్ నుంచి వచ్చిన మొట్టమొదటి పీరియాడిక్ నేపథ్యంతో కూడిన యానిమేటెడ్ మూవీ. తెలుగులో విక్రమసింహా అనే పేరుతో డబ్ అవ్వగా 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వన్ ఎంటర్టైన్మెంట్ పై మురళీ మనోహర్(Murali Manohar)మరో ఇద్దరితో కలిసి నిర్మించాడు. కొచ్చడైయాన్ కి సంబంధించిన పనుల కోసం బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ కంపెనీ నుంచి మురళి మనోహర్ కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అమౌంట్ కి .5 కోట్లు రూపాయలు చెక్ ద్వారా చెల్లించాడు.కానీ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో దీంతో సదరు యాడ్ కంపెనీ కోర్టులో కేసు వేయగా కొన్నేళ్ల విచారణ తర్వాత ట్రయల్ కోర్టు మురళిని దోషిగా తేలుస్తూ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆ తీర్పుని మురళీ మద్రాస్ హైకోర్టులో సవాలు చేసాడు. రీసెంట్ గా మద్రాస్ హైకోర్ట్ కేసుపై స్పందిస్తు నిర్దిష్ట గడువులోపు 2.52 కోట్ల రూపాయలు యాడ్ కంపెనీకి మురళి మనోహర్ చెల్లించాలి. ఒక వేళ గడువులోపు చెల్లించకపోతే జైలుకి వెళ్లాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది.
also read: spirit: స్పిరిట్ నుంచి తప్పుకోవడంపై ప్రకాష్ రాజ్ ట్వీట్.. అనుకున్నదే నిజమయ్యింది
రజనీకాంత్, దీపికా పదుకొణె, శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి తదితరులు మెరిసిన కొచ్చడైయాన్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంపై అభిమానులు బాధపడుతున్నారు. రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించింది.
- ఎన్‌బికె111లో బాలయ్య ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారో తెలుసా?
- సినిమా రిలీజ్ విషయంలో బాలయ్య, గోపీచంద్ కొత్త ప్లానింగ్!
- ఇప్పటి వరకు చేయని కొత్త జోనర్‌లో బాలయ్య సినిమా!
2023లో ‘వీరసింహారెడ్డి’తో బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేశారు నటసింహ నందమూరి బాలకష్ణ. ఇప్ప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ మూవీతో రాబోతున్న విషయం తెలిసిందే. బాలయ్యను మరో కొత్త యాంగిల్‌లో చూపించేందుకు గోపీచంద్ మలినేని కసరత్తు చేస్తున్నారు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు ప్రచారంలో ఉన్నాయి.
వాస్తవానికి బాలయ్యతో తను చేసే రెండో సినిమాను ఎంతో భారీ స్థాయిలో చెయ్యాలనుకున్నారు గోపీచంద్. అందుకే మొదట చారిత్రక కథాంశాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ కథకు భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. అంతేకాదు, సినిమా పూర్తి కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇవన్నీ దష్టిలో పెట్టుకొని ఆ స్క్రిప్ట్‌ను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు గోపీచంద్. బాలయ్యను ఒక కొత్త లుక్‌లో చూపించేందుకు పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ముంబాయి బ్యాక్‌డ్రాప్ ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథ ఓకే అయిపోయిందని తెలుస్తోంది.
నందమూరి బాలకష్ణ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో టచ్ చేయని డాన్ క్యారెక్టర్ ఈ సినిమాలో చెయ్యబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముంబాయి బ్యాక్‌డ్రాప్ అంటున్నారు కాబట్టి అది నిజమే అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఇటీవలికాలంలో ఎక్కువ సినిమాల్లో బాలయ్య డూయల్ రోల్ చేశారు. అయితే ఈ సినిమాలో మాత్రం సింగిల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయినప్పటికీ మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఈ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు, ఇంతకుముందు కంటే స్టైలిష్ గా ఈ సినిమాలో బాలయ్య కనిపిస్తారట.
బాలయ్య మెయిన్ పవర్ డైలాగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు, అభిమానులు ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాలోని డైలాగులు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జరుగుతోంది. మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రాన్ని కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేశారు గోపీచంద్ మలినేని.
2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి, 2025 సంక్రాంతికి డాకు మహరాజ్ చిత్రాలతో సందడి చేసిన బాలయ్య.. ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగలేదు. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న తన 111వ సినిమాని మొదట సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. సంక్రాంతి సీజన్ అనేసరికి టాలీవుడ్ టాప్ హీరోలంతా పండగకే రావాలనుకుంటారు. అయితే ఈసారి బాలయ్య సోలోగా రావాలని డిసైడ్ అయ్యారట. అందుకే డిసెంబర్‌లోనే సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.
-స్పిరిట్ లో తప్పుకున్నాడని కొన్ని రోజులుగా న్యూస్
-తన ట్వీట్ తో అసలు విషయం చెప్పేసిన ప్రకాష్ రాజ్
-ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఏమంటారు
యాక్టింగ్ పరంగా సౌత్ సినీ పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించే నటుల్లో ప్రకాష్ రాజ్(Prakash Raj)ఒకరు. 'ఓజి' లో సత్యదాదా క్యారక్టర్ ద్వారా ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసాడు. దీంతో ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga)అప్ కమింగ్ మూవీ స్పిరిట్(Spirit)లో ప్రకాష్ రాజ్ క్యారక్టరైజేషన్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానులతో పాటుప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.సెల్యులాయిడ్ పై సరికొత్త క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసే సందీప్ రెడ్డి వంగ తో ప్రకాష్ రాజ్ ఫస్ట్ టైం చేస్తుండటమే. కానీ కొన్ని రొజుల నుంచి సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని,ప్రభాస్, ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలని సందీప్ రెడ్డి తెరకెక్కించే తీరు ప్రకాష్ రాజ్ కి నచ్చటం లేదు. దీంతో గుడ్ బై చెప్పి వెళ్లిపోయాడనే న్యూస్ పట్టా పగ్గాల్లేకుండా సోషల్ మీడియా మార్కెట్ లో స్వతంత్ర హోదాలో తిరుగుతుంది.కానీ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ తో సదరు హోదా డమ్మీ అంటు కళ్లెం వేసాడు.మరి ట్వీట్ లో ఏముందో చూద్దాం.
సినిమా స్ఫూర్తిపై విషపూరితమైన, నకిలీ వార్తలని ప్రచారం చేసే వారందరికీ చెప్తున్నాను. స్పిరిట్ లో నా సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించలేదు. వాట్స్ అప్ ఫ్యాక్టరీలు కథలని ఊహిస్తారు. ఆ పని ఆపేసిపెద్దవారై జీవితాన్ని గడపండి అని తన స్టైల్లో ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ రూమర్స్ ని సృషించే వాళ్ళకి కడుపుమంటగా మారింది. అభిమానులు. మూవీ లవర్స్ కి మాత్రం మహదానందంగా ఉండటంతో పాటు స్పిరిట్ ద్వారా మీ నట విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించి ఆనందింప చెయ్యాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also read: ప్రేమ అనేది శాపం.. అందుకేనా ఆ విధంగా చేస్తుంది
ఇప్పటికే రిలీజైన ‘స్పిరిట్’వాయిస్ టీజర్‌లో జైలు అధికారిగా ప్రకాష్‌రాజ్ చేస్తున్నాడనే విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ పై ఒక రేంజ్ లోనే అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకి మించి అలరించేలా చేసే ట్రాక్ రికార్డు ప్రకాష్ రాజ్ సొంతం.
Prakash Raj has been one of the most controversial actors of Indian Cinema. His political views, fights with filmmakers and public outbursts have all caused troubles for him. He had been banned thrice to four times by MAA - Movie Artists Association for disciplinary action.
So, it became easy to believe that he had issues with Spirit director Sandeep Reddy Vanga, who also comes across as a hot head and has a reputation for being controversial. Deepika Padukone had a fallout with him and decided to not be part of Spirit. Now, rumours have been plenty that Prakash Raj and Vanga had issues.
The rumors even stated that Prakash Raj has been ousted from the film. The actor clarified on X, "To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life." He clarified that he did not start shooting.
Prabhas, Triptii Dimri, Vivek Oberoi are playing leading lady roles in the movie with Prakash Raj playing a prominent role. The movie shoot started last month with Prabhas and Prakash Raj clarified that he did not join sets yet. But in Sound Teaser, Sandeep Reddy Vanga made it clear that the veteran actor has a very important character.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు. భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం. భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం, కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా, బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు. బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే..
మాజీ ప్రేమికుల గురించి..
భాగస్వామికి గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది. అందుకే ఒక కొత్త బంధం మొదలుపెట్టాక గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది. దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది.
సొంత వ్యక్తుల చెడుగుణం..
భాగస్వామి స్నేహితుల్లో లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది. సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇతరుల రహస్యాలు..
ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే.. మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి స్నేహితుల గోప్యతను గౌరవించాలి. వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు.
ఇష్టాలు, అయిష్టాలు..
భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే.. ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి, చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు.
సోషల్ మీడియా పాస్వర్డ్ లు..
నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్‌వర్డ్‌లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్ అవసరం. ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు.
సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.
*రూపశ్రీ
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది. అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కొందరైతే ఎంత గొప్ప గిఫ్ట్ ఇస్తే తమ ప్రేమ అంత గొప్పది అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ డబ్బు కంటే, బహుమానం కంటే.. మనసులో ఉన్న ప్రేమ, భావం చాలా ముఖ్యమైనది. ప్రేమిస్తున్న వ్యక్తి తమకు ఎంత ప్రత్యేకం అనే విషయాలు తెలియజేయడానికి డబ్బు పెట్టి బహుమానాలు కొని ఇవ్వాల్సిన అవసరం లేదని, మనస్ఫూర్తిగా కొన్ని పనులు చేయడం ద్వారా ప్రేమిస్తున్న వారిని సంతోషపెట్టవచ్చని అంటున్నారు. ఇంతకీ డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రపోజ్ చేయడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..
చేతి లేఖ..
నేటి డిజిటల్ యుగంలో, చేతితో రాసిన లేఖ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. మనసులో ఉన్న స్పష్టమైన భావాలను కాగితంపై ఉంచినప్పుడు అది ఎదుటి వారి హృదయాన్ని నేరుగా చేరుతుంది. ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారో, మొదటిసారి కలిసినప్పుడు ఎలా అనిపిస్తోందో.. వారితో గడిపే క్షణాలు ఎంత విలువైనవో వారికి తెలిసేలా మనసును ఆకట్టుకునే రాయవచ్చు. భాష మీద పట్టు, మంచి అభిరుచి ఉన్నవారు అయితే చిన్న కవిత లేదా భావుకతతో కూడిన వాక్యాలను కలిపి రాయవచ్చు.
సర్‌ప్రైజ్..
సర్‌ప్రైజ్‌లు అంటే ఎప్పుడూ ఖరీదైన హోటళ్లు లేదా పెద్ద పార్టీలు అని అర్థం కాదు. లాంగ్ డ్రైవ్‌లను ఆస్వాదించే అభిరుచి ఉంటే వారిని సాయంత్రం బయటకు తీసుకెళ్ళడం, ఎక్కవ గందరగోళం లేని ప్రదేశంలో కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదా టెర్రస్‌పై విందును ప్లాన్ చేయడం చాలా బాగుంటాయి. ఎదుటి వారికి ప్రాధాన్యత ఇస్తే అదే వారికి గొప్ప బహుమానం.
స్వీట్ మెమోరీస్..
ఒక ఖాళీ జాడి లేదా పెట్టె తీసుకొని చిన్న కాగితాలు కూడా తీసుకోవాలి. ప్రతి కాగితంపై ఇద్దిరకి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం, ఒక ఫన్నీ క్షణం లేదా భాగస్వామి లో ఉండే మంచి అలవాటును రాయాలి. ఈ బహుమతి చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇది మనసును హత్తుకునేలా చేస్తుంది.
ఖరీదు..
బహుమతులు ఖరీదైనవి కానవసరం లేదు. ఫోటో ఫ్రేమ్, పేరుతో డిజైన్ చేయబడిన కాఫీ మగ్, కీచైన్ లేదా సంబంధానికి రిలేటెడ్ గా ఉండే ఏదైనా చిన్న వస్తువు మరింత హార్ట్ టచింగ్ గా ఉంటాయి. మనసులో ఉన్న ఆలోచన, ఎదుటి వ్యక్తి మీద ప్రేమ మొదలైని బహుమతిలో ఎక్స్పెస్ చేయగలిగితే దాని విలువ ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది.
సమయం..
ప్రేమను వ్యక్తం చేయడమే కాదు.. ఎదుటి వ్యక్తి ప్రాధాన్యత అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా కేటాయించాల్సింది సమయం. కనీసం ఒక్కరోజైనా పూర్తీ సమయం వారితో గడపడానికి ప్రయత్నించడం, సోషల్ మీడియా ఫోన్ డిస్టర్బ్ ఎక్కువ లేకుండా చూసుకోవడం వంటివి చేయాలి. ఒకరితో ఒకరు సమయం గడపడం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, హాయిగా నవ్వడం.. ఇవన్నీ బంధానికి కొత్తదనాన్ని ఇస్తుంది.
ప్రశంస..
చాలామంది తాము ఇష్టపడిన వ్యక్తిలో ఏ చిన్న తప్పు కనిపించినా దాన్న ఎత్తి చూపుతూ ఉంటారు. వారిని నొప్పించేలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిలో ఉండే మంచి అలవాట్లు, వారిలో ఉన్న ప్రత్యేకత చూడగలిగి, వారిని మెచ్చుకుంటూ ఉంటే.. ఇద్దరి జీవితాలు బాగుంటాయి. ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది.
*రూపశ్రీ.
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు. కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 246 ఏళ్ల క్రితం భారతదేశంలో బ్రిటీషర్ల అవినీతిని, వారి తప్పులను ధైర్యంగా బహిర్గతం చేసి, ప్రజలకు అందించిన వార్తాపత్రిక ఒకటుంది. నిజానికి ఈ వార్తాపత్రిక భారతదేశంలో స్వతంత్ర జర్నలిజానికి పునాది వేసింది. ఆ వార్తా పత్రిక పేరే హిక్కీస్ బెంగాల్ గెజిల్. దీన్ని హికీ గెజిట్ అని, బెంగాల్ గెజిట్ లేదా కలకత్తా జనరల్ అడ్వర్డైజర్ అని వివిధ పేర్లతో పిలిచారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
జనవరి 29, 1780..
భారతదేశంలో అధికారిక జర్నలిజం యుగం జనవరి 29, 1780న ప్రారంభమైంది. జేమ్స్ అగస్టస్ హికీ అనే వ్యక్తి కలకత్తాలో దేశంలోని మొట్టమొదటి వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. ఇది "హికీ గెజిట్", "బెంగాల్ గెజిట్" లేదా "కలకత్తా జనరల్ అడ్వర్టైజర్" అని వివిధ పేర్లతో పిలువబడింది. సమాచారంపై అధికారంలో ఉన్నవారు గుత్తాధిపత్యం వహించిన కాలం అది. అటువంటి క్లిష్ట సమయాల్లో హిక్కీ రెండు పేజీల వార్తాపత్రికను ప్రచురించడం ద్వారా కమ్యూనికేషన్ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేశాడు.
న్యాయం, ధైర్యం..
హికీ ఈ వార్తాపత్రికను సమాచార వనరుగా మాత్రమే కాకుండా స్వతంత్ర వేదికగా కూడా స్థాపించారని చెబుతారు. ఆయన వార్తాపత్రిక అత్యంత గొప్ప లక్షణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నత స్థాయి అధికారులపై తిరుగులేని విమర్శలు చేయడం. ఆయన పరిపాలనలోని లోపాలను ప్రజలకు బహిర్గతం చేసి, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిగా పనిచేశారు. ఆయన నిర్భయంగా మొదలు పెట్టిన ఈ జర్నలిజం భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు పునాది వేసింది.
అణచివేత..
హిక్కీ నిష్పాక్షికంగా విమర్శించే వైఖరి ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చలేదు. దీని వలన హిక్కీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆగ్రహానికి గురయ్యాడు. అతనికి భారీ జరిమానా విధించి, జైలు శిక్ష కూడా విధించారు.
కేవలం రెండేళ్లే..
ప్రభుత్వ ఒత్తిడి, అణచివేత విధానాల కారణంగా, ఆ వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. చివరికి 1782లో, హికీ ప్రింటింగ్ ప్రెస్ జప్తు చేశారు. ఈ చారిత్రాత్మక వార్తాపత్రిక ప్రచురణను శాశ్వతంగా నిలిపివేశారు.
చెరగని ముద్ర..
వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉనికిలో ఉన్నప్పటికీ, అది భారత చరిత్రపై చెరగని ముద్ర వేసింది. ఈ వార్తాపత్రిక యొక్క అసలు కాపీలు ఇప్పటికీ లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో, భారతదేశంలోని ఎంపిక చేసిన ఆర్కైవ్‌లలో భద్రపరిచారు. ఇదీ భారతదేశంలో ప్రారంభించిన మొదటి వార్తాపత్రిక ప్రభంజనం.
*రూపశ్రీ.
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎరుకలి మహదేవప్ప సోమవారం (ఫిబ్రవరి 9) అర్థరాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణాలపై మక్తల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మహదేవప్ప ఆత్మ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదలా ఉండగా మహదేవప్ప ఆత్మ హత్యకు పాల్పడటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎంపీ డీకే అరుణ మక్తల్‌కు చేరుకుని మహదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహదేవప్పది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ కాంగ్రెస్ చేసిన హత్యేనని అన్నారు. బెదిరింపులలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను మించిపోయిందని విమర్శించారు. ఒత్తిడి, బెదరింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారన్న డీకే అరుణ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తాను పాల్గొన్న రోడ్ షో, బీజేపీ సమావేశాలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఓటమి భయంతో బెదరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
గత కొద్ది రోజులుగా బీజేపీ అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా బెదరింపులు వస్తున్నాయన్న డీకే అరుణ.. కోస్గి నియోజకవర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరించి, కాంగ్రెస్‌లో చేర్చుకున్నారంటూ ఎంపీ అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే, కోస్గి నియోజకవర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని , సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని డీకే అరుణ ఇరోపించారు.
హిందూ వ్యతిరేకత విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ ల మధ్య నేనంటే నేను గోప్ప అన్న సంవాదం నడుస్తోందా? తాజాగా ఇరువురూ చెన్నైలోని ఓ వివాహ వేడుకలో కలుసుకుని పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు జగన్, ఉదయనిథి స్టాలిన్ హాజరయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎందరో అతిరథ మహారథులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి. జగన్ ఉదయనిథి స్టాలిన్ ఇరువురూ ఆ వివాహ వేడుకలో కలిసి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో నెటిజనులు వారి హిందూ వ్యతిరేక వైఖరిపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఆ ట్రోలింగ్ లో భాగంగానే సనాతన ధర్మం అనేది వైరస్ అని భలే అన్నావ్ అని జగన్ రెడ్డి అంటే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన నీ ముందు నేనెంత అన్న చర్చ జరిగి ఉంటుందంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. హిందూ ధర్మంపై వ్యతిరేకత విషయంలో ఉదయనిధి స్టాలిన్, వైఎస్ జగన్ లలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అన్న డిబేట్ కు కూడా వీరిరువురి భేటీ దృశ్యాలు దోహదం చేశాయి. వీరిరువురిలో ఉదయనిథి స్టాలిన్ ఒక రకంగా బెటర్.. ఆయన ఎటువంటి దాపరికం లేకుండా తన హిందూ వ్యతిరేక వాణిని కుండబద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యక్తం చేశారు.
ఆ విషయంలో ఆయనకు ఎటువంటి శషబిషలూ లేవు. అయితే జగన్ అలా కాదు.. ఓ పక్క తాను హిందూ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే.. చేతల్లో తన వ్యతిరేకత చూపుతుంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరకామణి చోరీ చాలా చిన్న వ్యవహారం అనడం. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ అని ధృవపడినా, అందులో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ బుకాయించడం వరకూ జగన్ హిందూ వ్యతిరేకతను చాపకింద నీరులా కనిపించీ కనిపించకుండా చాటుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇద్దరే. హిందూ వ్యతిరేకత విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు.
పంజాబ్ ముఖ్యమం్తరి భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పొలిటికల్ క్లియరెన్స్ ను రిజెక్ట్ చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పడం ఇది మూడో సారి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళ్లాలంటే విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ అనుమతినే పొలిటికల్ క్లియరెన్స్ అంటారు.
అయితే తరచుగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాన్ పర్యటనపై కేంద్రం ఈ పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం వరుసగా మూడో సారి అనుమతి నిరాకరించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా నిరాకరించింది. అంతకు ముందు పారిస్ ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లాలని భావించిన పంజాబ్ సీఎం మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు.
ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య, విదేశీ పంజాబీల సహకారం కోసం మాన్ విదేశీ పర్యటనకు సంకల్పించారు. కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది.
నేటి వేగవంతమైన జీవితంలో, మనం చిన్న చిన్న అలవాట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు . కామన్ గా ఆఫీసులో, ఇంట్లో లేదా బయటకు వెళ్లినప్పుడు నిలబడి నీరు తాగుతుంటారు. దీని వల్ల ఏం జురుగుతుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇదేం చెడ్డ అలవాటు కాదులే అనుకుంటారు చాలామంది. కానీ ఆయుర్వేదం మాత్రం ఇది చాలా చెడ్డ అలవాటు అంటోంది. శరీరానికి నీరు ఎంత ముఖ్యమైనదో.. నీరు తాగే పద్దతి కూడా అంతే ముఖ్యమని ఆయుర్వేదం చెబుతుంది. నిలబడి నీరు త్రాగడం క్రమంగా శరీరానికి హాని కలిగిస్తుందట. దీని గురించి పూర్తీ విషయాలు తెలుసుకుంటే..
కూర్చుని నీరు తాగితే..
కూర్చుని సౌకర్యవంతంగా నీరు త్రాగినప్పుడు శరీరం దానిని నెమ్మదిగా గ్రహించడానికి సమయం ఉంటుంది. అయితే నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు వేగంగా గ్రహించబడుతుంది. శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇది క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఆయుర్వేదం ప్రకారం..
ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలోని నీటి సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల నీరు సరిగ్గా ఉపయోగించబడకుండా కీళ్ళు, మోకాళ్ల చుట్టూ పేరుకుపోతుంది, దీని వలన చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు,బిగుసుకుపోవడం, కీళ్ల సమస్యలు వస్తాయి.
కూర్చిని నీరు తాగితే జరిగేది ఇదే..
కూర్చుని నీరు త్రాగినప్పుడు శరీరం దానిని ఫిల్టర్ చేసి, తరువాత దానిని మూత్రపిండాలకు పంపిస్తుంది. అయితే, నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు ఫిల్టర్ చేయకుండానే మూత్రపిండాలకు చేరుతుంది, వాటిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి.
నిలబడి నీరు తాగితే..
నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు కడుపులోకి వేగంగా చేరుతుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లత్వం, గుండెల్లో మంట, మలబద్ధకం, బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
శరీరంలో జరిగే మార్పు..
శరీరం నీటిని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు, అది శరీర శక్తిని, బలాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ పని లేకపోయినా అలసిపోయి, నీరసంగా ఉన్నట్టు అనిపించవచ్చు.
అందుకే ఇలా చేయాలి..
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నీరు త్రాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ హాయిగా కూర్చుని నీరు త్రాగాలి, అది కూడా నెమ్మదిగా సిప్ బై సిప్ త్రాగాలి, తొందర తొందరగా నీరు తాగకూడదు. చాలా చల్లటి నీరు కూడా తాగకుండా ఉండటం మంచిది. గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు మంచిది, గోరు వెచ్చగా ఉన్న నీరు మంచిది. గాజు లేదా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని త్రాగడం శ్రేష్టం. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగడం మంచిది కాదు.
*రూపశ్రీ.
డయాబెటిస్ చాలామందిని కుదిపేస్తున్న సమస్య. ఒకప్పుడు 60ఏళ్ళు దాటిన వృద్దులలో డయాబెటిస్ కనిపించేది. కానీ నేటి కాలంలో మాత్రం 30 ఏళ్లు కూడా నిండకనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. మరీ దారుణం ఏమిటంటే.. చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య ఉంటోంది. అయితే రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు అంటున్నారు. ఇంతకీ డయాబెటిస్ రావడానికి రోజువారీ జీవితంలో చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే..
జన్యు సమస్య కాదు..
డయాబెటిస్ అనేది తల్లిదండ్రుల నుండి వస్తుందని చాలా మంది అనుకుంటారు. దీన్ని జన్యు పరమైన సమస్యగా చెబుతారు. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఆధునిక జీవనసైలి, ఆహారం, శరీరానికి కష్టం లేకపోవడం వంటి అలవాట్ల వల్ల వస్తోంది.
ప్రాచీన ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..
ప్రాచీన భారతీయ గ్రంథాలు అయిన చరక సంహితలో చరకాచార్యుడు డయాబెటిస్ ను మధుమేహం గా వివరించాడు. మూత్రంలో తీపి రుచి ఉండటం ద్వారా దీన్ని గుర్తించారట.
సుశ్రుత సంహితలో సుశ్రుతుడు 20రకాల మధుమేహాలను చెప్పి వీటి లక్షణాలు, కారణాలు, చికిత్సలను కూడా తెలిపాడు.
పై విషయాలను బట్టి చూస్తే.. మధుమేహం అనేది పూర్వ కాలం నుండే ఉన్నా.. అది నేటికాలంలో మనుషుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తోంది.
ఇన్సులిన్ వ్యవస్థ..
శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థను పాడు చేసే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి. వీటిని చాలా వరకు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది డయాబెటిస్ రావడానికి కారణం అవుతుంది.
అల్పాహారం..
అల్పాహారాన్ని దాటవేడయం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనకు అంతరాయం కలుగుతుంది. బోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది క్రమంగా డయాబెటిస్ కు దారితీస్తుంది.
ఎక్కువ సేపు కూర్చోవడం..
ఒకప్పుడు బాగా పని చేసి.. అలసిపోయినప్పుడు కొద్దిసేపు కూర్చొనేవారు. కానీ నేటికాలంలో ఆఫీసులలో గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. నాలుగు గంటలకు ఒకసారి బ్రేక్ పేరుతో కొద్దిసేపు లేచి తిరగడం చేస్తున్నారు. దీని వల్ల శరీర కణాలు ఇన్సులిన్ కు సున్నితంగా మారిపోతాయి. శరీరం గ్లూకోజ్ శోషణను ఇది నెమ్మదిస్తుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ పేరుకోవడానికి దారి తీస్తుంది.
ఆలస్యంగా, భారీగా తినడం..
రాత్రి భోజనం ఎప్పుడూ 7 లేదా 8 గంటల లోపు తినాలని చెబుతుంటారు. గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు పెద్దలు. అంటే సాయంత్రం ఇంట్లో దీపం వేయడం, రాత్రి ఆహారం తీసుకోవడం ఒకేసారి జరగాలని దీని ఉద్దేశ్యం. అంతలోపు తీసుకోకపోయినా కనీసం 7 నుండి 8 లోపు తీసుకోవాలి. కానీ ఆలస్యంగా 10 గంటలకు పైన లేదా 11 గంటలకు పైన తినడం, అది కూడా చాలా భారీగా తినడం చేస్తుంటారు. ఈ అలవాటు కొన్ని నెలలు, ఏళ్ల పాటు కొనసాగితే డయాబెటిస్ పక్కాగా వస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
శరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..!
ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు. అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు శరీరానికి అందవు, ఎంత తిన్నా ఏం మార్పు లేదని చాలామంది కన్ప్యూజన్ అవుతుంటారు. అయితే ఆహారాల కాంబినేషన్ లు మ్యాజిక్ చేస్తాయి. ఆహారంలో లభించే పోషకాల సినర్జిస్టిక్ ప్రభావం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మల్టీవిటమిన్లు సహజంగా మొత్తం ఆహారాలలో కనిపిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు, అవి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
ఫైబర్..
ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఇది శరీరంలోకి పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది.
ఎంజైమ్‌లు..
పోషకాలను విచ్ఛిన్నం చేసి నిర్దిష్ట మూలకాలను సక్రియం చేస్తాయి.
ఫైటోకెమికల్స్..
పోషకాలను నష్టం నుండి రక్షిస్తాయి. పోషకాలను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి.
ఆహార కాంబినేషన్లు..
బెస్ట్ కాంబో..
సిట్రస్ పండ్లు లేదా ఆకుకూరలతో కూరగాయలు, గింజలతో పండ్లు.
బెస్ట్ కలర్స్..
వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ముఖ్యమైన ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
ఆహార కొవ్వును సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి విటమిన్లు A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అవసరం.
కాల్షియం, విటమిన్-డి..
తగినంత విటమిన్ డి లేకుండా శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించదు. అందువల్ల కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో విటమిన్ డి ని సప్లిమెంట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బలమైన దంతాలు, ఎముకలను నిర్వహించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
విటమిన్-సి, ఐరన్..
విటమిన్ సి తో ఐరన్ తీసుకోవడం వల్ల శరీరం దానిని సులభంగా జీర్ణం చేస్తుంది. అందుకే పాలకూరతో నిమ్మకాయ, టమోటాలతో పప్పు, బెర్రీలతో బలవర్థకమైన తృణధాన్యాలు వంటి కాంబినేషన్లు మంచివిగా పరిగణించబడతాయి.
ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్..
ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి ప్రోబయోటిక్స్ అవసరమైన బ్యాక్టీరియా. అవి జీర్ణక్రియకు సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, దోస, కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాను నిర్వహించడానికి ప్రీబయోటిక్ ఆహారాలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్‌కు ఎరువుగా పనిచేసే ఒక రకమైన ఆహార ఫైబర్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆపిల్స్, తృణధాన్యాలలో ప్రీబయోటిక్స్ కనిపిస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
