స్ఫూర్తిదాయకంగా ఏపీ నవనిర్మాణ దీక్ష

 

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నాడు నవనిర్మాణ దీక్షను స్ఫూర్తిదాయకంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నవనిర్మాణ దీక్షను విజయవాడలో నిర్వహిస్తు్న్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కూడా నవ నిర్మాణ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం సచివాలయంలో సాధారణ పరిపాలనా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సచివాలయ ఉద్యోగులు ఈ దీక్షలో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ నిర్వహించుకున్న ఈ నవ నిర్మాణ దీక్ష రాష్ట్ర ప్రజలకు, నాయకులకు ఒక స్ఫూర్తిని ఇచ్చే విధంగా వుండాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉద్దేశంతోనే నవనిర్మాణ దీక్షకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆశలు ఎంతో ఆశాజనకంగా వున్నాయి. ఎన్నో లక్ష్యాలు రాష్ట్రం ముందు వున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ లక్ష్యాలను చేరుకుంటున్నందన్న నమ్మకం అందరిలోనూ వుంది. ప్రజల నుంచి మాత్రమే కాకుండా ప్రతిపక్షం నుంచి కూడా ప్రభుత్వానికి సహకారం అందినట్లయితే ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణం అత్యంత ప్రశంసనీయంగా జరిగే అవకాశం వుంది. అయితే ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంగా వున్న వైసీపీ నుంచి అలాంటి సహకారాన్ని ఆశించడం దురాశే అవుతుంది.

అయితే పరిస్థితులు ఎలా వున్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్‌ని కొత్తగా నిర్మించుకోవాల్సిన అవసరం వుంది. ఆ అవసరాన్ని మరోసారి గుర్తు చేయడంతోపాటు, ఇప్పటికే వున్న స్ఫూర్తికి మరింత ఉద్దీపన కలిగించే విధంగా ఈ నవ నిర్మాణ దీక్ష వుంటుందని భావించవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu