LATEST NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో ఏకంగా పది గంటల పాటు బైఠాయించి సంచలనం సృష్టించారు. పల్పాడు జిల్లా జిల్లా పోలీసు లీగల్ సలహాదారుగా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని వెంటనే నియమించాలంటూ ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి ఏకంగా పది గంటల పాటు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై తెలుగుదేశం అధిష్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విషయమేంటంటే.. పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం (మార్చి 31) ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు. ఆయన జరిపి ఉత్తర్వులిస్తానని చెప్పారు. అయితే ఎమ్మెల్యే చదలవాడ మాత్రం నియామక పత్రం చేతికిచ్చే వరకు కదిలేది లేదని ఎస్పీ ఛాంబర్‌లోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో ఆయన తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎస్పీ చాంబర్ లోనే కూర్చున్న ఎమ్మెల్యే ఒక దశలో ఆ చాంబర్ లోని బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లో మాట్లాడినా ఆయన బయటకు రాలేదు. దీంతో పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకువచ్చారు.
చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర తెలుగుదేశం నేతలు వచ్చి బుధవారం (ఏప్రిల్ 1) సాయంత్రంలోగా నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శాంతించారు. రాత్రి తొమ్మదిన్నర గంటల ప్రాంతంలో ఆయన తన నిరసర విరమించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం అమరావతి. ఈ విషయంలో వైఎసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట. అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు.
ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది.
మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.
అస్సాంలో యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది. ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో యువత బరిలోకి దిగింది.
అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు.
నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది.
గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది. తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి. ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.
ALSO ON TELUGUONE N E W S
-చిత్ర సీమని కుదిపేసిన దర్శకుడి అరెస్ట్
-రెండుసార్లు కోర్టు కొట్టివేసింది
-ఇప్పుడు మూడోసారి ఏకంగా అరెస్ట్
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం
రంజిత్ బాలకృష్ణన్(Ranjith Balakrishnan).. మలయాళ చిత్ర సీమలో క్రియేటివ్ దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నటుడుగా, రచయితగా అనేక చిత్రాలకి పని చేసి 2001లో దర్శకుడిగా మారి ఇప్పటి వరకు సుమారు ఇరవై రెండు చిత్రాల వరకు తెరకెక్కించాడు. రీసెంట్ గా రంజిత్ పై ఒక నటి లైంగిక ఆరోపణల చేయడంతో కొచ్చి పోలీసులు అరెస్ట్ చెయ్యడం సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు రంజిత్ తనని కారవాన్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని సదరు నటి జస్టిస్ హేమ కమిటీతో పాటు పోలీసులకి దర్యాప్తు చేసింది. ఈ మేరకు కొచ్చి సిటీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో ఇడుక్కి జిల్లాలో ఉన్న రంజిత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
రంజిత్ పై 2024లోను ఒక బెంగాలీ నటి లైంగిక ఆరోపణల కేసు నమోదు చేసింది. 2009లో 'పలేరి మాణిక్యం' సినిమా షూటింగ్ సమయంలో కొచ్చిలోని గెస్ట్ హౌస్‌లో రెంజిత్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక దాడికి ప్రయత్నించారనేది ఆమె ఆరోపణ. దీంతో పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. గత అక్టోబర్‌లో విచారణకి రాగా 2009లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేయడానికి మెజిస్ట్రేట్ కోర్టుకి ఉన్న కాలపరిమితి ముగిసిపోయిందని హైకోర్టు తన తీర్పుని వెల్లడి చేస్తూ కొట్టివేసింది.
2012లో బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో డైరెక్టర్ రెంజిత్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, దుస్తులు లేని చిత్రాలు కూడా తీశాడని కోజికోడ్ కి చెందిన ఒక యువకుడు ఫిర్యాదు చేశాడు.దీంతో ఎర్నాకుళం నార్త్ పోలీసులు రెంజిత్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఫిర్యాదు చేయడానికి 12 ఏళ్లు ఆలస్యమైందన్న కారణంతో కర్ణాటక హైకోర్టు 2025 జులైలో ఆ కేసుని కూడా రద్దు చేసింది. అలాంటిది ఇప్పుడు మూడో సారి లైంగిక ఆరోపణలతోనే రంజిత్ అరెస్ట్ కావడం గమనార్హం. రంజిత్ నుంచి గత ఏడాది ఆరో, సమ్ వన్ అనే షార్ట్ ఫిలిం వచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి గ్లింప్స్ వరకు ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా రీసెంట్‌గా విడుదలైన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె(Raghu Kunche) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, ఏఆర్ రెహమాన్ సంగీతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి.
90s నాటి రెహమాన్ కనిపిస్తున్నారు..
పెద్ది నుంచి విడుదలైన చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం గురించి రఘు కుంచె మాట్లాడుతూ.. "ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట 'చికిరి చికిరి'. ప్రతి రోజూ వింటున్నాను. చాలా కాలం తర్వాత రెహమాన్ గారు మళ్ళీ తన వింటేజ్ స్టైల్‌ను చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆయన సాంగ్స్ చాలా సింపుల్ గా, మెలోడియస్ గా ఉండేవి. ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాక కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ వైపు వెళ్లారు. కానీ 'పెద్ది' చిత్రంతో మళ్ళీ తన మార్కు 90ల నాటి వింటేజ్ రెహమాన్‌ను గుర్తుచేస్తున్నారు. ఆ పాటల్లోని ఫ్లేవర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రెహమాన్ నుంచి తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను అద్భుతంగా రాబట్టుకున్నారు" అని ప్రశంసించారు.
మట్టి వాసన ఉన్న కథలు ఎప్పుడూ స్పెషలే..
ప్రస్తుతం ప్రేక్షకులు రూటెడ్ కథలకు, అంటే మట్టి వాసన ఉన్న విలేజ్ సబ్జెక్టులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని రఘు కుంచె అభిప్రాయపడ్డారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే కథలు కేవలం పాత జ్ఞాపకాలనే కాకుండా, కొత్త తరానికి ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమిళంలో మారి సెల్వరాజ్, వెట్రిమారన్ వంటి దర్శకులు ఇలాంటి కథలతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇప్పుడు మన తెలుగులో కూడా అలాంటి ప్రయత్నాలు జరగడం శుభపరిణామమని అన్నారు. 'పెద్ది' కూడా అలాంటి ఒక పవర్‌ఫుల్ రూటెడ్ సబ్జెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.
పహిల్వాన్ లుక్ అదిరిపోయింది..
రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో చరణ్ ధరించిన గోచి కట్టు, ఆయన మాసివ్ బాడీ లాంగ్వేజ్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. దీనిపై రఘు కుంచె స్పందిస్తూ.. "అది నిజమైన పహిల్వాన్ లుక్. చరణ్ పడ్డ కష్టం ఆ స్క్రీన్‌పై కనిపిస్తోంది. నిజానికి ఆ కుస్తీ ఫైట్లు చేస్తున్నప్పుడు ఆయనకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని విన్నాను. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా అంత రిస్క్ తీసుకుని రియలిస్టిక్‌గా చేయడం గొప్ప విషయం." అని చరణ్ డెడికేషన్‌ను కొనియాడారు.
నటనలో కష్టం.. సౌకర్యాల మధ్యే అసలైన సవాల్..
పూర్వం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో ఆర్క్ లైట్ల కింద నటించడం ఎంతో కష్టంగా ఉండేదని, ఇప్పటి హీరోలకు క్యారవాన్లు వంటి సౌకర్యాలు ఉన్నా.. క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడంలో అదే కష్టం ఉంటుందని రఘు కుంచె వివరించారు. రామ్ చరణ్ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక పల్లెటూరి మల్లయోధుడిగా మారడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు.
మొత్తానికి 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, బుచ్చిబాబు సానా మేకింగ్ మరియు రెహమాన్ సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని రఘు కుంచె నమ్మకం వ్యక్తం చేశారు. మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
రఘు కుంచె ఫుల్ ఇంటర్వ్యూ & మరిన్ని ఆసక్తికర సినీ విశేషాల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
బాలకృష్ణ బుల్లెట్ స్పీడ్
NBK 111 సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు
ఊహించని దర్శకులకు ఓకే చెప్పిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆయన, కుర్ర హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ (NBK 111) షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య.. మరో ఇద్దరు కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమేడలతో బాలయ్య జతకట్టబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కనకమేడల చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చిందని, అందులోని ఇంటెన్సిటీ ఆయనను ఇంప్రెస్ చేసిందని సమాచారం. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.
విజయ్ చెప్పిన పాయింట్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో బాలకృష్ణ వెంటనే ఓకే చెప్పేశారట. తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసేలా ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. నిజానికి విజయ్ కనకమేడల సినిమాలంటే అందులో సామాజిక అంశాలతో పాటు గ్రిప్పింగ్ నరేషన్ ఉంటుంది. ‘నాంది’లో న్యాయవ్యవస్థలోని లోపాలను చూపించి మెప్పించిన ఆయన, బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ లేదా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక బాలయ్య ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే విజయ్ కనకమేడల సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నయా క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది.
విజయ్ కనకమేడల ప్రాజెక్టుతో పాటు, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించవచ్చని టాక్. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకోవాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే వైవిధ్యమైన దర్శకులతో పనిచేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు.
మొత్తానికి బాలయ్య తన సినిమాల వేగాన్ని పెంచడమే కాకుండా, కథల ఎంపికలో కూడా కొత్తదనాన్ని చూపిస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ లైనప్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. "బాలయ్య బాబు స్పీడు మామూలుగా లేదు.. వరుసగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తున్నారు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచూ వింటుంటాం. అప్పుడప్పుడు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ నైనిక(Nainika) చేరింది. తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను, అలాగే ఊర్లో ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
80 లక్షలతో హైదరాబాద్‌లో వ్యాపారం
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు మారిన తర్వాత, తన తల్లికి ఏదైనా వ్యాపారం ఉండాలనే ఉద్దేశంతో నైనిక ఒక లగ్జరీ సలోన్ (స్టూడియో) ప్రారంభించాలని నిర్ణయింకుంది. అయితే దీని వెనుక పెద్ద త్యాగమే ఉందని ఆమె తెలిపింది. ఒడిశాలో తన తల్లి ఎంతో కష్టపడి కట్టుకున్న సొంత ఇంటిని అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో సుమారు రూ. 70 నుంచి 80 లక్షల వరకు పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌లో ఈ సలోన్ ను ఏర్పాటు చేసినట్లు నైనిక చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాపారం బాగానే సాగుతోందని, హైదరాబాద్ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
కాస్టింగ్ కౌచ్ అనుభవం
తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, కానీ క్లీన్ ప్రాజెక్ట్‌లు దొరకడం కష్టమవుతోందని తెలిపింది. కొన్నిసార్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని నైనిక ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ నిర్మాత తనకు సినిమా అవకాశం ఇస్తానని చెప్పి 'కమిట్‌మెంట్' అడిగారని ఆమె వెల్లదించింది. "కమిట్‌మెంట్ అడుగుతూ ఓ నిర్మాత మెసేజ్ లో ఒక ఫామ్ లాంటిది నింపమని పంపారు. అది చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. మీకు సిగ్గులేదా? అని గట్టిగా రిప్లై ఇచ్చాను" అని నైనిక పేర్కొంది.
నైనిక ప్రయాణం చిన్నప్పటి నుంచే చాలా కష్టాలతో కూడుకున్నది. తండ్రి నుంచి ఎదురైన వేధింపుల కారణంగా తల్లితో కలిసి ఒంటరిగా పోరాటం చేసి ఈ స్థాయికి చేరుకుంది. నేషనల్ లెవల్ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’లో సత్తా చాటిన నైనిక, ఆ తర్వాత తెలుగులో ‘ఢీ’ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కూడా కంటెస్టెంట్‌గా అలరించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
కష్టపడి ఎదుగుతున్న నైనిక.. తన జీవితంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకోవడంతో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. టాలెంట్ ని బట్టి కాకుండా, కమిట్‌మెంట్ ని బట్టి అవకాశాలు ఇచ్చే కొందరు నిర్మాతల వల్లే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే అమ్మాయిలు భయపడుతున్నారు అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి తప్పుకున్న టోవినో థామస్!
https://www.instagram.com/reel/DWOlHU3kzzJ/
శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్'(Biker). అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్(Rajasekhar) కీలక పాత్ర పోషించడం విశేషం. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ ఫిల్మ్ గా ఏప్రిల్ 3న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన రాజశేఖర్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
- చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
- ముందుగా నేను ఏ క్యారెక్టర్ చేసినా అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
- నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ). బైకర్ లో నా క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్. ఈ క్యారెక్టర్ గురించి పూర్తి వివరాలు మీరు సినిమాలోనే చూడాలి.
- అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద, క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్న దర్శకుడు . ఆయన అనుకున్నది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూపించారు. డైరెక్టర్ విజన్. కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా క్యారెక్టర్ ని అభినందిస్తారు.
- ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.
- యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్మెంటు. ఎక్కడ ఖర్చుకి వెనకాడరు. ఈ సినిమాని హాలీవుడ్ క్వాలిటీతో తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సబ్జెక్టు కోసం క్వాలిటీ కోసం ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు. ఈ విషయంలో వారిని అభినందించాలి. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.
- నాకు ఫ్యామిలీ ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఈ సినిమా, నా క్యారెక్టర్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.
- మా పాషన్, ప్రొఫెషన్ రెండు సినిమానే. ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయితే నేరుగా థియేటర్స్ కి వెళ్లి చూస్తుంటాం. అలాగే ఏదైనా కథ క్యారెక్టర్ వస్తే అందరం కలిసి డిస్కస్ చేస్తాం. అలాగే షూటింగ్లో జరిగిన విశేషాలు కూడా మాట్లాడుకుంటుంటాం. మేమందరం కూడా సినిమా ప్రొఫెషన్ లోనే ఉన్నాం కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది.
- పవన్ సాదినేని గారితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య, విశ్వదేవ్, శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం. బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు. బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది. అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా కూడా సాగుతాయి. చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి గొడవలే కాదు.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. బంధాన్ని నాశనం చేసే అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..
తప్పులు వెతకడం..
భార్యాభర్తల బందం ముడిపడింది అనగానే పూర్తీగా ఒకరి చేతిలో బంధం కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కొందరు. మరీ ముఖ్యంగా భర్తలు ఇలా ఎక్కువ చేస్తారు. వారు నిలబడే తీరు, ధరించే దుస్తులు, చేసే పనులు ఇలా.. ప్రతి విషయంలో తప్పులు వెతకడం చేస్తుంటారు. అలా తప్పులు చూపించడం తమ గొప్ప అని వారు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్ పార్ట్నర్ చాలా ఇబ్బంది పడతారు. ఇదే విధంగా ఎక్కువ కాలం సాగితే.. మా ఇద్దరికి సెట్ కావడం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాస్తా బంధం పెళుసుబారడానికి దారితీస్తుంది.
మౌనం..
భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరైనా సరే.. ఏదైనా తమకు నచ్చని పని జరిగినప్పుడు లేదా తమకు ఏ విషయంలో అయినా అసంతృప్తి ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడటం కంటే.. మౌనంగా ఉండి భాగస్వామిని సాధిస్తూ ఉంటారు. ఈ పద్ధతి చాలా హానికరమైనది. భాగస్వామిని పట్టించుకోకుండా మానసిక హింసకు గురి చేయడం లాంటిది ఇది. ఆరోగ్యకరమైన సంబంధానికి, మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. మౌనంగా ఉండటం వల్ల భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ, అంతేకాదు.. ఇలాంటి ప్రవర్తన వల్ల బంధంలో దూరం పెరుగుతుంది.
పాత విషయాలు..
గొడవల సమయంలో బార్యాభర్తలలో చాలామంది పాత విషయాలను బయటకు లాగి వాటిని తమకు అనుగుణంగా ఉండేలా చేసుకుంటారు. భాగస్వామి చేసిన తప్పును ఒకసారి క్షమించేశాక.. తరువాత వాదన జరిగిన ప్రతిసారీ ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల భాగస్వామి నమ్మకం దెబ్బతింటుంది, ఇంకా పాత విషయాలను మనసులో పెట్టుకున్నారని, బంధంలో అర్థం చేసుకునే తత్వం లేదని అనుకుంటారు.
ఆధిపత్యం..
ప్రేమ అంటే భాగస్వామి ఫోన్‌ను నిరంతరం రహస్యంగా చూడటం, వారు స్నేహితులతో ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు గమనించడం, గూఢచర్యం చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ కాదు.. చాలామంది ఇవన్నీ చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాన్ని ప్రేమ అని అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే.. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి బంధంలో నమ్మకం పోతుంది.
పోలిక..
లైఫ్ పార్ట్నర్ ను ఇతరులతో పోల్చడం మంచిది కాదు. భాగస్వామిని స్నేహితులు, వారి భాగస్వాములు, అక్క చెళ్లేళ్లు, అన్నదమ్ములు ఇలా అందరితో పోల్చడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. పోలికల వల్ల భాగస్వామి బాధపడవచ్చు. బంధంలో ఎప్పటికీ వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి.అప్పుడే బంధం బాగుంటుంది. లేదంటే బంధం విచ్చిన్నమవుతుంది.
*రూపశ్రీ
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది. మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్దం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. ఇంత కఠినమైన వేసవి ఎండలో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఎంటో తెలుసుకుంటే..
వాటర్ బాటిల్..
మండుటెండలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమై అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ.
సన్ గ్లాసెస్..
వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ నుండి కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి.
సన్‌స్క్రీన్ క్రీమ్..
వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్ రాసుకోవచ్చు.
గొడుగు..
వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది ఎండ నుండి కాపాడటానికి సహాయపడుతుంది.
స్కార్ఫ్ లు..
అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ, చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.
*రూపశ్రీ.
వేసవి అంటేనే కూలర్లు, ఏసీలు గుర్తుకు వస్తాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు. చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు. అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి?
1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది. ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్ పనితీరును అందిస్తుంది.
నైట్ బ్యాకప్ సెలక్షన్..
సోలార్ ఏసీ అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట బ్యాటరీ బ్యాకప్ అయిపోతే, దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది. సులభంగా చెప్పాలంటే, సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు.
పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.
*రూపశ్రీ.
పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో ఏకంగా పది గంటల పాటు బైఠాయించి సంచలనం సృష్టించారు. పల్పాడు జిల్లా జిల్లా పోలీసు లీగల్ సలహాదారుగా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని వెంటనే నియమించాలంటూ ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి ఏకంగా పది గంటల పాటు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై తెలుగుదేశం అధిష్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విషయమేంటంటే.. పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం (మార్చి 31) ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు. ఆయన జరిపి ఉత్తర్వులిస్తానని చెప్పారు. అయితే ఎమ్మెల్యే చదలవాడ మాత్రం నియామక పత్రం చేతికిచ్చే వరకు కదిలేది లేదని ఎస్పీ ఛాంబర్‌లోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో ఆయన తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎస్పీ చాంబర్ లోనే కూర్చున్న ఎమ్మెల్యే ఒక దశలో ఆ చాంబర్ లోని బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లో మాట్లాడినా ఆయన బయటకు రాలేదు. దీంతో పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకువచ్చారు.
చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర తెలుగుదేశం నేతలు వచ్చి బుధవారం (ఏప్రిల్ 1) సాయంత్రంలోగా నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శాంతించారు. రాత్రి తొమ్మదిన్నర గంటల ప్రాంతంలో ఆయన తన నిరసర విరమించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం అమరావతి. ఈ విషయంలో వైఎసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట. అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు.
ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది.
మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.
అస్సాంలో యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది. ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో యువత బరిలోకి దిగింది.
అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు.
నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది.
గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది. తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి. ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం. చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు. అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, వాపును తగ్గిస్తాయి, నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం అందరికీ సురక్షితం కాదని అంటున్నారు. కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి. ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే..
పసుపు పాలు ప్రయోజనాలు..
రోగనిరోధకశక్తి..
పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
జలుబు, దగ్గు..
పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి. దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది.
వాపులు..
పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు, కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు.
పసుపు పాలు ఎవరు తాగకూడదు?
జీర్ణసమస్యలు ఉన్నవారు..
తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం, పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.
రక్త సంబంధ వ్యాధుల మందులు..
పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది. ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు.
మధుమేహ రోగులు..
పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు. మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు.
మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు..
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
గర్భిణీ స్త్రీలు..
గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు. దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.
*రూపశ్రీ.
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
రాత్రి భోజనం..
రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది. చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు. కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ, గుండె పనితీరు ప్రభావితం కావచ్చు.
కాఫీ..
కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
ఫోన్..
రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు. పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
చిరుతిళ్లు..
కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల ఆకలి తగ్గడమే కాకుండా, నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఒత్తిడి..
నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి. అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు, గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు.
మద్యం..
రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు. ఈ అలవాటు వల్ల రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.
*రూపశ్రీ.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది. వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది. అయితే వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే..
రోగనిరోధక శక్తి..
వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది.
బరువు..
వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్.
వ్యాధులు..
వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే..
రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.
*రూపశ్రీ.
