పవన్ మాటల వెనుక మర్మం అదేనా..!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ మాట్లాడని విధంగా అందరిపై కామెంట్స్ చేసి ఒక్కసారిగా అందరికీ షాకిచ్చాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం పైన ఏంటీ.. ప్రతిపక్షం పైనా అందరిపై కామెంట్లు చేసి అసలు పవన్ కళ్యాణ్ ఏనా మాట్లాడేది అనేలా చేశాడు. అంతేనా ప్రజారాజ్యం పార్టీపైనా.. తన అన్న చిరంజీవిని మోసం చేసిన వారిపైనా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 

దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ఆయన గతంలో ఎప్పుడూ చిరంజీవి గురించి కానీ.. ప్రజారాజ్యం గురించి కానీ పబ్లిక్ మీటింగ్ లో స్పందించలేదు. కానీ ఇప్పుడు చిరింజీవిని తెరపైకి తీసుకురావడం.. ఆయన గురించి.. ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తన అన్నయ్య చిరంజీవికి కూడా ఉందంటూ... కానీ కొంతమంది ఆయనను మోసం చేశారని బహిరంగంగానే కొన్ని పేర్లు కూడా బయటపెట్టాడు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. పవన్ ఇలా మాట్లాడుతుంటేనే ఎక్కడా లేని డౌట్లు వస్తున్నాయి. అవేంటంటే... భవిష్యత్తులో ‘జనసేన’ బాధ్యతలను నెమ్మదిగా చిరు నెత్తిన పెట్టేలా చేయబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అందుకే గత రెండు రోజులుగా ‘ప్రజారాజ్యం’ పల్లవిని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. అందుకే చిరంజీవిని మోశాడా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

ఇదిలా ఉండగా.. చిరు అంటే పవన్ ఎప్పుడూ అభిమానమే అన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా పరంగా అయితే నెంబర్ వన్ కానీ... రాజకీయాల్లో మాత్రం ఆయన కాస్త వెనుకబడే ఉన్నారన్నది వాదన. దీంతో... చిరంజీవిని తెరపైకి తెచ్చి  పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేసుకుంటారా అని అనుకుంటున్నారు.  ఎందుకంటే… పవన్ గానీ, మెగా ఫ్యాన్స్ గానీ ఒప్పుకున్నా, లేకున్నా… ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా చిరంజీవి షో ‘అట్టర్ ఫ్లాప్’ అని చెప్పకతప్పదు. అందుకే పవన్ ఇవన్నీ గమనించుకోవాలని అని అనుకుంటున్నారు. మరి పవన్ అన్నయ్యను మోసం చేసినందుకు తట్టుకోలేక అలా మాట్లాడాడా.. లేక రాజకీయ ఆలోచన ఏదైనా ఉందా.. చూద్దాం ఏం జరుగుతుందో..