ఆరోగ్యానికి చిన్న చిట్కాలు     1. వంటింట్లో పొరపాటున వేడి గిన్నెలను ముట్టుకుంటే చాలా మంటగా వుంటుంది. బర్నాల్ వంటివి అందుబాటులో లేకపోతే కొంచెం టూత్ పేస్ట్ రాసి చూడండి. నొప్పి త్వరగా తగ్గిపోతుంది. 2. వేడి వేడి టీ, కాఫీ గబుక్కున తాగితే నాలుక కాలినట్టు అవుతుంది. అప్పుడు ఒక చెంచా పంచదార నోట్లో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. 3. ఏదైనా కుట్టినట్టు మంటగా వుంటే వంట సోడాలో కొంచెం నీళ్ళు పోసి కలిపి ఆ పేస్ట్‌ను చీమ, దోమ కుట్టినచోట రాస్తే ఆ దద్దురు, మంట తగ్గుతాయి. 4. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే ఒక చెంచా  చక్కెర నాలుక మీద వేసుకుని చప్పరిస్తే చాలు. నెమ్మదిగా ఎక్కిళ్ళు పోతాయి. 5. కడుపు బరువుగా వుంటే పుదీనా ‘టీ’ తాగితే రిలాక్స్‌గా వుంటుంది. పుదీనా ఆకులను శుబ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. తెర్లుతున్న నీటిలో పుదీనా ఆకులను వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత పాలు, పంచదార కలిపితే పుదీనా టీ రెడీ. పాలు లేకుండా తాగితే ఇంకా మంచిది.   - రమ

  పనితోపాటు ఆహారమూ ముఖ్యమే   ఉద్యోగం చేసే ఆడవారు ఇంట్లో, బయటా పని ఒత్తిడితో తమ ఆహారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు. దాంతో వయసు పెరిగినకొద్దీ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. సాధారణంగా రెండుపూటలా తీసుకునే ఆహారంతోపాటు మధ్యమధ్యలో తప్పనిసరిగా ఏదో ఒకటి తింటుండాలిట. అయితే ఆ ఏదో ఒకటి అధిక క్యాలరీలని పెంచేది కాక ఆరోగ్యాన్నీ, శక్తినీ ఇచ్చేది అయితే మంచిది అంటూ కొన్ని సూచనలు చేస్తున్నారు. 1. సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు సలాడ్ల వంటివి తీసుకోవాలి. సలాడ్ల వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. ఆకలి తీరుతుంది కూడా. అందులోనూ క్యాబేజీని సలాడ్‌లో కలిపి తీసుకుంటే దీనిలోని ‘గ్లాటామైన్’ అనే అమినో యాసిడ్ చిన్న పేగు ఆరోగ్యంగా పనిచేసేట్టు చూస్తుంది. డైజేషన్ ఇబ్బందుల వంటివి తగ్గుతాయి. 2. బాదం, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ నేరుగా తీసుకోవడం వల్ల  కొలెస్ట్రాల్ సమస్య వుండదు. వీటిలో విటమిన్ ‘ఇ’తోపాటు మాంనీస్, విటమిన్ బి2, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. డ్రై ఫ్రూట్ర్‌ని మధ్యాహ్నం వేళ తీసుకుంటే శక్తి లభిస్తుంది. 3. వేరుశనగలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటిలో మాంసకృత్తులతోపాటు బి3, కాపర్, మాంగనీస్ వంటి పోషక విలువలు సమృద్ధిగా వుంటాయి. కాబట్టి వేరుశనగలని వేయించి లేదా ఉడికించి ఓ చిన్న బాక్సులో వేసుకుని ఆకలి అనిపించినప్పుడు నాలుగు గింజలు నోట్లు వేసుకుంటే చాలు ఆకలి తీరుతుంది. ఓపిక వస్తుంది. 4. ఇక పండ్లు తింటే శరీరంలోకి అనవసర కేలరీలు చేరవు. ఆకలి అదుపులో వుంటుంది. అరటిపండుని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకుంటే రోజంతటికీ కావలసిన శక్తి లభించినట్టే. ఎందుకంటే అరటిపండ్లలోని కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్‌లతోపాటు కార్బొహైడ్రేట్లు త్వరితగతిన శక్తినిస్తాయి. ఇక ఆపిల్స్‌లోని విటమిన్ ‘ఎ’, ఐరన్, బొప్పాయిలోని విటమిన్ ఎ, కె, ఇ తదితర పోషకాలు శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. 5. మొలకెత్తిన గింజల్ని ఓ గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు వీటిలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులు శరీరానికి శక్తినిస్తాయి. చురుగ్గా వుంచుతాయి. ఇలా రోజు మొత్తంలో అప్పుడప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే ఓపిక లేకపోవడం అన్న సమస్య వుండదు. బరువు పెరుగుతామనే భయమూ వుండదు. చలాకీగా రోజువారీ పనులు ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. -రమ

రాగి జావతో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..    

ఫిట్‌నెస్ రహస్యం మన చేతుల్లోనే బాడీ ఫిట్‌నెస్‌తో మైండ్ ఫిట్‌నెస్ కూడా సాధ్యపడుతుంది. అది ఎలా అంటే...మంచి ఆహారం, వ్యాయామం శరీరానికి కావలసిన శక్తినివవడమే గాక ఉత్సాహాన్ని పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. తద్వారా ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం, పోషకాహారం చాలా అవసరం. * బరువు పెరుగుతున్నట్లు తెలియగానే చాలామంది వెంటనే తినడం తగ్గించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవలసి వస్తుంది. * ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల గంటలో జీర్ణమవగా మిగిలింది కొవ్వుగా మారిపోయి శరీరంలో నిలవ ఉంటుంది. తద్వారా కొవ్వు పరిమాణం పెరిగి బరువు పెరుగుతారు. * దృఢమైన శరీరానికి ఉపయోగపడే ముఖ్య పోషకాలు కార్బోహైవూడేట్లు. ఈ చక్కెర పదార్థాలు దాదాపు అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయల్లో లభిస్తాయి. * 50 శాతం శక్తి వీటి ద్వారానే చేకూరుతుంది. కొవ్వు పదార్థాల నుంచి 35 శాతం, ప్రొటీన్ల నుంచి 15 శాతం శక్తిని పొందగలుగుతాం. * పైగా బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుందే కానీ తగ్గదు. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న ఒక గంట వరకు మన శరీరంలోని ఎంజైములు అతి చురుకుగా పనిచేస్తాయి. * కాబట్టి ఒక్కసారి ఎక్కువ లాగించేకన్నా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది.   ఇకపోతే ఫిట్‌నెస్‌ను పెంచే మరో ముఖ్య కారకం వ్యాయామం. కావలసినదాని కన్నా ఎక్కువ శక్తి చేరినప్పుడు ఆ కేలరీలన్నీ కొవ్వులుగా మారి ఫిట్‌నెస్‌ను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని కరిగించాలంటే క్రమం తప్పని వ్యాయామం అవసరం. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజులు దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం వల్ల మెదడులో ఎండోమార్ఫిన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. వ్యాయామం ఇలా చేయండి. * వ్యాయామం ప్రారంభించే ముందు ఒకేసారి పెద్ద పెద్ద ఎక్సర్‌సైజులు కాకుండా కనీసం వారానికి మూడుసార్లు ఒక అరగంట సేపు మీరు ఇష్టంగాచేయగలిగే పద్ధతిని ఎంచుకోండి. * కొద్దిరోజులు చేసి మానేయడం కాకుండా మెల్లమెల్లగా రోజూ చేయడానికి ప్రయత్నించండి. * యోగా, వాకింగ్, స్విమ్మింగ్.. ఇలా ఏదో ఒకటి మీకు సరిపోయే వ్యాయామ పద్ధతిని ఎంచుకోండి. * మీరొక్కరే చేయడానికి విసుగ్గా ఉంటే టీమ్‌గా, ఒకాటలాగా చేయండి. మెల్లగా అలవాటవుతుంది. * ఒక్కటి కన్నా ఎక్కువ వెరైటీలలో ఉండే వ్యాయామ పద్ధతులు ఆసక్తిని పెంచుతాయి. మెదడుకు చురుకుదనం. మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి మన మానసిక దృఢత్వం, చురుకుదనం ఆధారపడి ఉంటాయి. కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం మెదడును మత్తుగా ఉంచుతుంది. అన్నం తినగానే నిద్ర ముంచుకురావడానికి కారణం ఇదే. అందుకే సాయంకాలం కార్బోహైవూడేట్‌లను తీసుకోవడం వల్ల సుఖనివూదకు ఆస్కారం ఉంటుంది. ప్రొటీన్లు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక సామర్థ్యం పెంచుకోవాలంటే ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇక కాఫీ, టీలు మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమే. ఒక కప్పు కాఫీ మెదడును చైతన్యవంతం చేస్తుంది. కానీ గంటకో కప్పు తీసుకోవడం వల్ల అలసట, ఉద్రేకం, నిద్రలేమి వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. అలాగని హఠాత్తుగా మానివేస్తే తలనొప్పి, వికారం వంటివి కనిపిస్తాయి.

సన్నబడాలనుకుంటున్నారా   " అర్జంటుగా సన్నబడాలి" అనుకుంటే, ఎం చెయ్యాలో  తెలీక  అవస్థాపడుతుంటాం. అయితే తీసుకునే ఆహారాన్ని తగ్గించటంలో పాటు క్రమం తప్పని వ్యాయామం మాత్రమే అధిక బరువును ఆడుతూ,పాడుతూ తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం ద్వారా ఎన్ని కెలోరీలు ఖర్చు చేయొచ్చో తెలిస్తే చక్కగా ప్లాన్ చేయొచ్చు కదా! ఇదిగో ఆ వివరాలు చదవండి- పాటించండి- సన్నబడండి.   నడక: బరువు తగ్గాలనుకునే వారికీ అందరూ చెప్పే సలహా నడవమని నడక వాళ్ళ అంత లాభం ఉంటుందా అని అనుమానం వస్తుంటుంది కదా మనకి కాని నిజంగా చాలా లాభం వుంటుందట. ఎందుకంటే ఒక గంట నడిస్తే చాలు 300 కెలోరీలు ఖర్చవుతాయి. ఇంకాస్త ఓపిక ఉంటె కాస్త ఎత్తైన ప్రదేశాలవైపు నడిస్తే చాలు 400 దాకా కెలోరీలు కరిగిపోవడం ఖాయం.     ఇక నడుము కింద భాగం నాజుకుగా, ఉండాలంటే రోజు హాయిగా సైకిల్ తొక్కండి చాలు 350 కెలోరీలు  వద్దన్నా కరిగిపోతాయి.400 వందలకు పైగా కెలోరీలు ఖర్చు కావాలంటే పరుగుకు మించిన వ్యాయామం లేదు.   అలాగే మంచి మ్యూజిక్ పెట్టుకుని  నచ్చిన డ్యాన్స్ చేస్తే చాలు కెలోరీలు ఇట్టే కరిగిపోతాయంటే ఎవరు మాత్రం డ్యాన్స్ చేయకుండా ఉంటారు చెప్పండి. అలా డ్యాన్స్ చేస్తే చేస్తే గంటకు మూడొందల కెలోరీలకు పైగా ఖర్చవుతాయి. నచ్చిన మ్యూజిక్ పెట్టి సాల్సా, రాక్ఎన్రోల్ , బెల్లి డ్యాన్సింగ్ ఇలా వచ్చినది చేసేయండి.చాలు ఇక , స్కిప్పింగ్, స్పీడ్ జాగింగ్ , ఈత, ఆటలు, ఇవన్ని కూడా మానసిక ఆనందాన్నిచ్చెవె. వీటిలో గంటపాటు ఏ ఒక్కటి చేసినా 400  పైగా కెలోరీలు ఖర్చవటం ఖాయం. కాబట్టి కష్టంగా కాక ఇష్టంగా శరీరాన్ని కదిలించి బరువు తగ్గించండి అంటున్నారు నిపుణులు ఆలోచించండి ఆచరణలో పెట్టండి. - రమ.

Fitness-day1 of the new fitness regime Usually, we all are used to drinking a cup of coffee, or tea, or just simply milk as our first food in the morning. Breakfast is definitely important. Fitness with Detoxification goes well, hand in hand. For years, we have consumed foods with pesticides and chemicals, all those have toxic affect on our body. A cup of warm water with a small fresh lemon squeezed does wonders to detoxify the human body. If you like, you can add few drops of honey. Let this be the first drink of the day, everyday! After the warm lemon water, give a break for 30mins and start with breathing and just a few warm up exercises. The web provides numerous exercises suitable for every health condition. Warm up exercises are the ones we all learnt at school. Followup with actual exercises, depending on your requirement, some are for toning, some for muscle buildup, some for strength and stamina, etc.,Some of us have back, neck, knee problems...carefully choosing the right kind of exercise is also important. Start your initial workout session, Day1 with only 15mins of exercising. Gradually, increase the timing at an interval of 5 days-1week. You will feel hungry now. Have a glass of fatfree milk or a heavy healthy breakfast. The rest of the day is in your hands, but make sure you drink 8 palm length glasses of water through the day. Keep a watch and dont consume oily foods. If you have done most of the jobs i mentioned, count this as Day 1 of your new regime. Rest follows!! Pratyusha.t

  * ఏరోబిక్ వ్యాయామం మొదలు పెట్టే ముందు అప్పటి వరకు చేస్తున్న వ్యాయామాన్ని, ఆరోగ్యస్థితిని, బరువును దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ఏరోబిక్ వ్యాయామం ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలంటే కనీసం 12 వారాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. * ఏరోబిక్ వ్యాయామం వల్ల శరీరంలో పేరుకొన్న అదనపు కొవ్వులను కరిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది మరియు స్టామినాను పెంచుతుంది. * ఏరోబిక్ వ్యాయామం వల్ల మధుమేహం వలన వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. * గుండె పనితీరులో మెరుగుదల ఉంటుంది. శరీర కండరాల బలానికి తోడ్పడుతుంది. * క్రమం తప్పని ఏరోబిక్‌ వ్యాయామాలు అధిక రక్తపోటును తగ్గించడమేకాదు, అసలు అధిక రక్తపోటు రాకుండా నిరోధిస్తాయి. * శ్వాస సంబంధ సమస్యల నివారిణిగా, ఆక్సిజన్‌ను తొందరగా గ్రహించేవిధంగా శరీర స్ధాయిని పెంచుతుంది.

డెలివరీ తర్వాత ఇవి తింటేనే తల్లికి పిల్లకి ఆరోగ్యం..!   డెలివరీ తర్వాత తల్లికి ఎక్కువ పాలు రావడానికి, తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి? సాధారణంగా ప్రతి ఇంట్లో డెలివరీ తర్వాత సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుంటారు. ముఖ్యంగా ఆహరం విషయంలో. ఇంతకీ ఎలాంటి ఆహరం తీసుకుంటే తల్లికి పాలు వచ్చే అవకాశం ఉంటుంది, మరియు ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=xnbfOVVUkKI    

Diet Plan For Polycystic Ovary Syndrome...  

ఈ పవర్ ఫుల్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకోండి.. బరువు తగ్గండి...   అట్కిన్స్ డైట్ అని మీరు వినుంటారు. మరి, మీకు దీని గురించి ఏమయినా తెలుసా? అట్కిన్స్ అనేది తిండి పదార్థం పేరు కాదు, అది ఒక డాక్టర్ పేరు. అట్కిన్స్ అనే డాక్టర్ వెజ్ మరియు నాన్ వెజ్ తింటూ కూడా శరీరం బరువు తగ్గొచ్చు అని నిరూపించారు. మరి, అట్కిన్స్ డైట్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=BCPN6pg_OKo

పొట్టలోని కొవ్వు సులువుగా కరిగిపోతుంది.. ఇవి తింటే...   పొట్టలోని కొవ్వు అనేది ఈ రోజు ఆడవాళ్ళూ, మగవాళ్ళు అని లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యగా మారింది. అయితే, పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీ గా కరిగించొచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. ఆ సూచనలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=4bwqeLCKHX4

అన్ని తింటూ కూడా బరువు తగ్గచ్చు .. తినే విధానం మారిస్తే చాలు...   ఈరోజుల్లో డైట్ చేయాలంటే కడుపు మాడ్చుకోవాల్సిందే అని బ్లైయిండ్ గా అలా చేస్తుంటారు. అలా కాకుండా.. అన్ని తింటూ కూడా బరువు తగ్గొచ్చు అంటున్నారు న్యూట్రిషియనిస్ట్ బృందావని. మరి ఆ టిప్స్ ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=070GizcUYsA

రోజుకి 500 కేలరీలు వదిలించు కుంటే  వారానికి అరకేజీ తగ్గచ్చు..   ఈరోజుల్లో యువత డైటింగ్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొంత మంది మాత్రం డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటారు. అది ఇంకా డేంజర్. అలా కాకుండా మంచిగా డైట్ ప్లాన్ చేసుకుని... కాస్త కేలరీలు తగ్గిస్తే బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి డాక్టర్ గారు చెప్పే టిప్స్ పాటించి బరువు తగ్గించుకోండి.. 

ఆరోగ్యకరమైన రుతు చక్రం కోసం యోగ..   కొంతమందికి పీరియడ్స్ టైంకి రావు. నెలనెల రాకుండా కొందమంది చాలా టైం గ్యాప్ తీసుకుంటుంది. అలాంటి వారికి ఉపయోగపడే యోగా టిప్స్ కొన్ని మీ ముందుకు తీసుకొచ్చారు రాజేశ్వరి విడపర్తి అనే యోగ నిపుణురాలు. మరి ఇంకెందకు ఆలస్యం ఈ వీడియో చూసి ఆ యోగా టిప్స్ మీరు కూడా నేర్చుకోండి... https://www.youtube.com/watch?v=Kd-JYqazLAY  

Importance Of Prenatal Vitamins...!  

మహిళలకు 40 ఏళ్ల వయసు అత్యంత కీలకమైన దశ..   మహిళలకు 40 ఏళ్ల వయసు అత్యంత కీలకమైన దశ.. ఈ వయసులో శరీరం పలు మార్పులకు గురవుతుంది.. వ్యాధులు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మంచి ఆహారం, వ్యాయామం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు... అవేంటో డాక్టర్ జానకి శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=rG4bWDtXt2Q

ఒత్తిడిని తగ్గించే ఆహారం   ఈ రోజుల్లో ఒత్తిడి అనే పదం ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం, బరువు బాధ్యతలు ఇలా చాలా అంశాలు ఒత్తిడికి దారి తీస్తున్నాయ్. ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందువరుసలో ఉంటున్నారని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అయితే మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవి ఏవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=-aSktghfBRg

అమ్మాయిలూ క్యాన్సర్ వచ్చిందేమో ఇలా తెలుసుకోండి...   ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు బిజి బిజీగా ఉండే జీవితాలు మనవి. అందులోనూ మహిళలు.. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ల విషయం చెప్పనవసరం లేదు. కుటుంబ భారం మోస్తూ తమను తమ ఆరోగ్యాన్ని కూడా మరచిపోతూ ఉంటారు. దీంతో ప్రమాదకర వ్యాధుల బారినపడుతున్నారు. వాటిలో ముఖ్యమైనది క్యాన్సర్.. ఇటీవలి కాలంలో ఈ మహమ్మారి వేగంగా మగువలను కబలిస్తోంది. అయిత ఈ లక్షణాలతో మీకు క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=r1fxLhUvgIs