అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు చేసే ఈ పనులు కొంప ముంచుతాయి తెలుసా... అందం అంటే అమ్మాయిలు,  అమ్మాయిలంటే అందం.. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటారు.  ఆడవాళ్ల కోసం రాజ్యాలే కూలిపోయాయి. అంత పవర్ ఉంది అందానికి, ఆడవారికి.  అలాంటిది అందం పెంచుతామంటూ సాగే వాణిజ్య ఉత్పత్తులు,   వ్యాపారాలకు మంచి ఊపు రాకుండా ఉంటుందా? స్వతహాగా అందంగా తయారు కాలేని వారికి ఇదిగో మేమున్నాం అంటూ బ్లూటీ పార్లర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.  ఇప్పుడేమో వీధికి ఒక బ్యూటీ పార్లర్ వెలిసింది. చాలా మంది అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ కు వెళితే.. కొందరేమో డబ్బు దండగ అని ఇంట్లోనే బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు.  అయితే బ్యూటీ ట్రీట్మెంట్ లో భాగంగా ఫేషియల్ చేయడం,  ముఖానికి ఆవిరి పట్టడం సహజంగా చేసేదే. కానీ ఇలా ఫేషియల్ చేయడం,  ముఖానికి ఆవిరి పట్టడం వంటివి చేయడం  చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు.  దీని గురించి తెలుసుకుంటే.. చర్మ సంబంధిత సమస్యలు వంటి చిన్న చిన్న విషయాల గురించే అమ్మాయిలు చాలా ఆందోళన చెందుతారు. వీటిని సరిచేయడానికి, కొన్నిసార్లు  బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు.  కొన్నిసార్లు ఆవిరి తీసుకుంటారు. కానీ ఈ రెండూ పరిమితిని మించితే అవి  చర్మానికి హాని కలిగిస్తాయి. ఆవిరి  చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రంధ్రాలను శుభ్రం చేయడానికి సులభమైన మార్గం. కానీ ఏదైనా అతిగా తీసుకోవడం  హానికరం.  ముఖానికి ఎక్కువ ఆవిరి పట్టుకుంటు ఉంటే దాన్ని వెంటనే ఆపడం మంచిది.  ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను పెద్దగా అయ్యేలా చేస్తుంది. చర్మం లో ఉత్పత్తి అయ్యే  నూనెలను తగ్గిస్తుంది. ఇది మొటిమల సమస్యలకు లేదా చర్మం పగుళ్లకు దారితీస్తుంది. కాబట్టి ఫేస్ స్టీమ్ చేయడానికి సమయం,  వ్యవధిని నిర్ణయించుకోవాలి.   రసాయన రహిత ఫేస్ ప్యాక్.. ముఖం సహజంగా అందంగా కనిపించడానికి రసాయనాలు లేని ఫేస్ ప్యాక్ లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  అలాంటి పేస్ ప్యాక్ ఏ ఇది. స్వయానా వైద్యులు సూచించిన ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి చాలా మంచి ఫలితాలు అందిస్తుంది. కావలసిన పదార్థాలు.. పసుపు - 1/3 టీస్పూన్ నిమ్మరసం - 1/2 టీస్పూన్ గంధం - 1 టీస్పూన్ అలోవెరా జెల్ - 1 టీస్పూన్ తేనె - 1 టీస్పూన్ (అవసరాన్ని బట్టి పై పదార్థాలు ఎక్కువ నిష్పత్తిలో కూడా తీసుకోవచ్చు) తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గంధం, పసుపు, నిమ్మకాయ రసం, కలబంద జెల్  వేసి బాగా కలపాలి. చివరగా తేనె వేసి అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. తయారుచేసిన ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. మొదటిసారి వాడినప్పుడే  చర్మం శుభ్రంగా,  రంధ్రాలు చిన్నగా కనిపించడం  గమనించవచ్చు.  ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించి  చర్మాన్ని సహజంగా శుభ్రం చేసుకుంటూ  ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ప్రయోజనాలు.. ఈ ఫేస్ ప్యాక్‌లో గంధపు చెక్కను ఉపయోగించారు . దీని శీతలీకరణ ప్రభావం కారణంగా  ముఖంపై వేడి సంబంధిత మొటిమలు పెరగకుండా నిరోధిస్తుంది. అలాగే తేనె చర్మాన్ని తేమగా మార్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయ చర్మాన్ని స్పష్టంగా కనిపించేలా చేయడం ద్వారా  మచ్చలను తేలికపరచడంలో  సహాయపడుతుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఏజింగ్,  యాంటీ ఫంగల్ వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  ముఖంపై చర్మ సమస్యలు,  ఇన్ఫెక్షన్లు పెరగకుండా నివారిస్తాయి. అందువల్ల చాలా మంది పెరుగు, పసుపు,  శనగపిండి ఫేస్ ప్యాక్‌లను కూడా ఉపయోగిస్తారు.                                          *రూపశ్రీ.

 7రోజుల్లో జుట్టు రాలడం ఆగి జుట్టు పెరగడం  స్టార్ట్ అవుతుంది. ఇలా చేయండి..! జుట్టు పెరగడం, జుట్టు రాలడం రెండూ ఒక దానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి.  చాలా మంది జుట్టు రాలిపోతుంటే జుట్టు బాగా రాలిపోతోంది నాకు జుట్టు పెరగాలి అని జుట్టు పెరగడానికి చిట్కాలు,  నూనెలు, షాంపూలు వాడతారు. కానీ జుట్టు రాలుతున్నప్పుడు మొదట చెయ్యాల్సింది జుట్టు రాలడాన్ని అరికట్టడం. జుట్టు రాలడాన్ని అరికట్టామంటే జుట్టు పెరుగుదల మోడ్ లోకి అదే వస్తుంది. అప్పుడు జుట్టు పెరుగుదలకు అవసరమైన చిట్కాలు పాటించవచ్చు. అయితే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒక చిట్కా పాటిస్తే అటు జుట్టు రాలడం తగ్గి.. ఇటు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.  ఇంతకీ అదేంటో తెలుసుకుంటే.. జుట్టు రాలడం ఆగి, జుట్టు తిరిగి పెరగడంలో అల్లం, ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తాయి. అల్లం ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.  జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అల్లం, ఉల్లిపాయ ఎలా వాడాలంటే.. ముందుగా, అల్లం,  ఉల్లిపాయలను మిక్సర్‌లో రుబ్బి పేస్ట్ సిద్ధం చేయాలి. దీని తరువాత, 50 గ్రాముల అల్లం రసం,  50 గ్రాముల ఉల్లిపాయ రసం కలిపి స్ప్రే బాటిల్‌లో ఉంచాలి. రాత్రిపూట, అల్లం-ఉల్లిపాయ రసాన్ని తల మొత్తం చల్లుకుని, తేలికపాటి చేతులతో జుట్టును మసాజ్ చేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత, స్నానం చేసేటప్పుడు, షాంపూ లేదా సబ్బు లేకుండా శుభ్రమైన నీటితో  జుట్టును కడగాలి. ఇలా తయారు చేసిన రసాన్ని రెండు రోజులు నిల్వ చేయవచ్చు. మైగ్రేషన్, సైనస్ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రాత్రి వాడకూడదు.  దీన్ని మధ్యాహ్నం సమయంలో తలకు అప్లై చేసుకుని కేవలం ఒక గంట సేపు తలకు అలాగే ఉంచి తరువాత తల స్నానం చేయాలి. సాధారణంగా ఉల్లిపాయ రసం మాత్రమే వాడటం వల్ల తల దుర్వాసన వస్తుంది. కానీ దీనికి అల్లం కూడా జోడించడం వల్ల ఉల్లిపాయ దుర్వాసన రాదు. ఇది జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు విరిగిపోకుండా చేయడంలో సహాయపడుతుంది.  అకాల బూడిద రంగును నివారించడంలో అలాగే జుట్టును మందంగా మార్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.                                   *రూపశ్రీ.

జిడ్డు చర్మాన్నివదిలించుకోవాలి అంటే.. ఈ టిప్స్ ట్రై చెయ్యండి..! జిడ్డు చర్మం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.  చర్మం ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ చర్మ తత్వాన్ని బట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పొడి చర్మం ఉన్నవారు   చర్మం తొందరగా పగుళ్లు రావడం, పొలుసులు రావడం వంటి సమస్యల వల్ల ఇబ్బంది పడితే.. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖం జిడ్డుగా ఉంటూ.. మొటిమల కారణంగా ఇబ్బంది పడతారు. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు ఈ సమస్యను తొలగించుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్.. జిడ్డు చర్మం ఉన్నవారు ఉపయోగించే ఫేస్ వాష్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఫేస్ వాష్ ఉపయోగించాలి.  సల్పేట్ లేని ఫేస్ వాష్ వాడాలి.  ఇది చర్మం నుండి నూనె తొలగించి ముఖం మెరిచేలా చేస్తుంది.  మొటిమలు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. మాయిశ్చరైజర్.. జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడాలి.  ఇది చర్మం మెరిసే చేయడానికి అలాగే జిడ్డు లేని చర్మానికి సహాయపడుతుంది.  తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.  అలాగే చర్మం పిహెచ్ ను సమతుల్యంగా ఉంచుతుంది. టోనర్.. టోనర్ వాడటం వల్ల చర్మం లోని నూనెను నియంత్రించవచ్చు. చర్మం రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో కూడా టోనర్ సహాయపడుతుంది. జిడ్డు చర్మానికి అలోవెరా,  గ్రీన్ టీ,  సాలిసిలిక్ యాసిడ్ కలిగిన టోనర్లు చాలా బాగుంటాయి.  బ్లాటింగ్ పేపర్.. ఎక్కడికి వెళ్లినా హ్యాండ్ బ్యాగ్ లో బ్లాటింగ్ పేపర్ ఉంచుకోవాలి.  ముఖం మీద జిడ్డు ఏర్పడినప్పుడు ఈ బ్లాటింగ్ పేపర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తుంది.  వీటి వల్ల చర్మానికి  ఎలాంటి హాని, నష్టం కలగదు. ఆహారం.. జిడ్డు చర్మం ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  వేయించిన ఆహారాలు,  కారంగా ఉండే ఆహారాలు,  ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తీసుకోవడం మానాలి.  ఆకుకూరలు,  పండ్లు తినడం,  పుష్కలంగా నీరు తాగడం చేయాలి. ప్రతిరోజూ డిటాక్స్ వాటర్ తీసుకోవాలి.  ముఖ్యంగా శరీరాన్ని లోపల శుభ్రం చేసే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి. ఫేస్ ప్యాక్.. జిడ్డు చర్మం తొలగించడానికి ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాలి.  ముల్తానీ మట్టి,  రోజ్ వాటర్ పేస్ ప్యాక్.. లేద వేప ఫేస్ ప్యాక్ వంటివి ఎంచుకోవచ్చు.  ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. జిడ్డును కూడా తొలగిస్తాయి.                                      *రూపశ్రీ.

గుమ్మడి గింజలు జుట్టుకు, చర్మానికి మేలు చేస్తాయా..నిజాలివి..!   గుమ్మడి గింజలు  ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి.  చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలని అంటున్నారు. ఒకప్పుడు పండ్లు, కూరగాయలలోని ఈ విత్తనాలను తెలియకుండానే పడేసేవాళ్లం. కానీ ఇప్పుడు వీటిని విడిగా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. అయితే గుమ్మడికాయ గింజలను రోజూ తింటుంటే చర్మం, జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుందట.   అయితే కేవలం తినడమే కాదు.. గుమ్మడి గింజలను కింద చెప్పుకున్న పద్దతిలో వాడితే మ్యాజిక్ జరగడం ఖాయం అంటున్నారు.  అసలు గుమ్మడి విత్తనాలలోని పోషకాలు ఏంటి? ఇవి చర్మానికి, జుట్టుకు ఎలా మేలు చేస్తాయి? తెలుసుకుంటే.. గుమ్మడి గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలలో ఐరన్, మెగ్నీషియం,  జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా మెరిచేలా చేస్తాయి.  గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకోవడమే కాకుండా గుమ్మడి గింజల నూనెతో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.  ఇది జుట్టు మూలాలను బలంగా మారుస్తుంది. గుమ్మడి గింజలలో విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి.  అలాగే పొడి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.   గుమ్మడి గింజలను  రోజూ ఆహారంలో తీసుకోవడమే కాకుండా గుమ్మడి గింజలను పెరుగుతో కలిపి పేస్ట్ లా మిక్సీ వేయాలి.  దీన్ని స్క్రబ్ గా ఉపయోగించాలి  చర్మం చాలా అందంగా,  మృదువుగా మారుతుంది. గుమ్మడి గింజలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి మొటిమలను, మొటిమల వల్ల  కలిగే నొప్పిని, మొటిమల  తగ్గించడంలో సహాయపడతాయి.  గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకోవడం మాత్రమే కాకుండా  ఓట్ మీల్ తో కలిపి పేస్ట్ లా చేసి ఫేస్ మాస్క్ గా వేసుకోవాలి. ఇది మంచి ఫలితం ఇస్తుంది. ముఖం మీద ముడతలు,  గీతలు తగ్గాలంటే గుమ్మడి గింజలతో మ్యాజిక్ చేయాల్సిందే.  గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి ముడతలు,  ఫైన్ లైన్స్ తగ్గించడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలు, తేనె కలిపి బాగా మిక్సీ వేయాలి.  దీన్ని పేస్ మాస్క్ వేసుకోవాలి. మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖం మీద వాపు,  వేడి కారణంగా ముఖం మీద వేడి గుల్లలు రావడం,  చర్మం మంటగా ఉండటం,  చర్మం చికాకులు ఇలాంటి సమస్యలు ఉంటే గుమ్మడి గింజల నూనెతో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి.  ఇలా చేస్తే ముఖ చర్మం వేడి నుండి వాపులు, చర్మం సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది.                                 *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

జుట్టుకు ఆలివ్ ఆయిల్ వాడితే ఏం జరుగుతుందో తెలుసా...   జుట్టుకు నూనె పెట్టడం కేశ సంరక్షణలో ప్రధాన భాగం.  జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.  తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.  జుట్టుకు కావలసినంత తేమ అంది..  జుట్టు మృదువుగా మారుతుంది. తల చర్మ సమస్యలు అయిన చుండ్రు,  తలలో పుండ్లు,  జుట్టు రంగు మారడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి.  అయితే జుట్టుకు అప్లై చేసే నూనెలను బట్టి ఫలితాలు  విభిన్నంగా ఉంటాయి. చాలామంది ఆలివ్ ఆయిల్ ను తలకు రాసుకోమని చెబుతుంటారు.  అసలు ఆలివ్ ఆయిల్ ను తలకు వాడవచ్చా? ఆలివ్ ఆయిల్ ను తలకు అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. పోషకాలు.. ఆలివ్ ఆయిల్ లో పోషకాలు సమృద్దిగా ఉంటాయి.  ఇందులో విటమిన్-ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి జుట్టుకు పోషణను ఇస్తాయి. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తాయి.  జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.  ఇది చుండ్రు సమస్యకు చెక్ పెట్టడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.  చుండ్రుకు కారణం అయ్యే ఫంగస్ ను తొలగించడంలో సహాయపడుతుంది.  చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ గా కేశ సంరక్షణలో వాడటం మంచిది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు లోతుగా తేమను అందిస్తుంది. దీని వల్ల జుట్టు పొడిబారడం,  విరిగిపోవడం వంటి సమస్యలు రాకుడా చేస్తుంది.  దీని వల్ల జుట్టు ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. కొన్ని రకాల నూనెలు రక్త  ప్రసరణను పెంచడంలో బాగా సహాయపడతాయి.  అలాంటి నూనెలలో ఆలివ్ నూనె కూడా ఒకటి. ఇది తలలో రక్తప్రసరణను పెంచుతుంది.   ఈ కారణంగా ఆలివ్ నూనె వాడేవారిలో  జుట్టు పెరుగుదల బాగా వేగంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ను తలకు నేరుగా అప్లై చేయడమే కాదు.. దీన్ని ఇతర హెయిర్ కేర్ పద్దతులలో కూడా వాడవచ్చు.  ముఖ్యంగా జుట్టుకు ఎంతో మేలు చేసే గుడ్డుతో  ఆలివ్ నూనె మంచి కాంబినేషన్. గుడ్డు లేదా తేనె లేదా పెరుగుతో ఆలివ్ నూనెను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ గా ఉపయోగించవచ్చు.  ఇది జుట్టుకు మంచి పోషణను చాలా లోతుగా అందిస్తుంది. జుట్టును దెబ్బ తీయడంలో సూర్యుని కాంతి చాలా కీలకమైనది. సూర్య కాంతి చాలా విపరీతంగా ఉన్నప్పుడు..  ఆ కాంతి కారణంగా జుట్టు దెబ్బితింటుంది. అయితే ఆలివ్ నూనెను జుట్టుకు రాసుకుంటే ఈ సూర్యుని అతినీల లోహిత కిరణాల నుండి జుట్టును కాపాడుకోవచ్చు.                                *రూపశ్రీ.

స్కిన్ టోన్ ప్రకారం ఫర్పెక్ట్ లిఫ్స్టిక్ ఇలా ఎంచుకోవచ్చు..!     లిప్స్టిక్.. నేటి కాలం అమ్మాయిలు తప్పక వాడుతున్న సౌందర్య ఉత్పత్తి.  ఒకప్పుడు లిప్స్టిక్ ను శుభకార్యాలు,  పార్టీలు,  ప్రత్యేక రోజులో మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ మేకప్ లో లిప్స్టిక్ భాగం అయిపోయింది. అమ్మాయిలు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు  కళ్లకు కాజల్,  పెదవులకు లిప్స్టిక్,  ఫౌండేషన్ వంటివి తప్పక వేసుకుంటారు. అయితే చాలా మంది అమ్మాయిలకు చర్మ రంగుకు తగిన లిప్స్టిక్ ఎంచుకోవడం తెలియదు.   చర్మ రంగుకు తగినట్టు ఫర్పెక్ట్ కలర్ ఎంచుకుంటే చాలా  అందంగా కనిపించవచ్చు.  ఇంతకీ చర్మ రంగుకు తగిన లిప్స్టిక్ ఎలా ఎంచుకోవాలంటే.. మేకప్.. రెగ్యులర్ గా అయినా, ప్రత్యేక సందర్భాలలో అయినా ఈ రోజులలో చాలా కామన్ అయిపోంది.  మేకప్ గురించి తెలియని అమ్మాయిలు ఈ కాలంలో బహుశా లేరనే చెప్పవచ్చు. ఎంత మంచి మేకప్ వేసినా సరైన లిప్స్టిక్ పడకపోతే అందం మొత్తం పాడైనట్టే కనిపిస్తుంది.   అయితే  మార్కెట్లో చాలా రకాల లిప్స్టిక్ లు అందుబాటులో ఉంటాయి. ఒకే రంగులోనే బోలెడు షేడ్స్ ఉంటాయి. డస్కీ స్కిన్ టోన్.. స్కిన్ టోన్ డస్కీగా ఉంటే అలాంటి వారు ప్రకాశవంతమైన రంగుల లిప్స్టిక్స్ ను ఎంచుకోవచ్చు.  డస్కీ టోన్ ఉన్న మహిళలకు చాక్లెట్ బ్రౌన్ లేదా మెరూన్ షేడ్స్ బాగుంటాయి.  ఈ లిప్స్టిక్స్ కూడా ముదురు రంగు దుస్తులతో ఇంకా అందంగా కనిపిస్తాయి. ఫెయిర్ స్కిన్ టోన్.. ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలకు పాస్టెల్,  లైట్ టోన్ షేడ్స్ తో కూడిన లిప్స్టిక్ లు చాలా బాగా నప్పుతాయి. అలాంటి షేడ్స్ లిప్స్టిక్స్ వాడితే అమ్మాయిల అందం ఇనుమడిస్తుంది.  ఫెయిర్ రంగులో ఉన్న అమ్మాయిలు లేత గులాబీ,  పింక్  న్యూడ్ కోరల్,  క్లాసికల్ రెడ్ కలర్ లిప్స్టిక్ లు అప్లై చేయవచ్చు. యావరేజ్ కలర్.. యావరేజ్ కలర్ లో ఉన్న అమ్మాయిలు మావ్, పించ్ కలర్ లేదా వార్మ్ బ్రౌన్ కలర్ లిప్స్టిక్ లను ట్రై చేయవచ్చు.  ఇలాంటి షేడ్స్ చాలా మంచి లుక్ ఇవ్వడంలో బాగా సహాయపడతాయి. అదే సమయంలో లేత రంగు దుస్తులపై ఈ లిప్స్టిక్స్ ను వాడటం వల్ల మరింత హైలెట్ గా కనిపిస్తారు. ముదురు చర్మం.. ముదురు చర్మం రంగు ఉన్నవారు కాపర్ బ్రౌన్,  డార్క్ వైన్, పర్పుల్ షేడ్స్ లో ఉండే లిప్స్టిక్ ను ఎంచుకోవచ్చు.  ఇవి ముదరుగా ఉన్నవారికి చాలా బాగా  సెట్ అవుతాయి.  మహిళల లుక్ క్లాసీగా చూపిస్తూనే బోల్డ్ గా కనిపించేలా చేస్తాయివి.                                 *రూపశ్రీ.

కాఫీ హెయిర్ మాస్క్.. ఇంట్లోనే ఇలా వాడి చూడండి.. షాకవుతారు..!   కెఫీన్.. కాఫీ, టీ లలో సాధారణంగా ఉండే రసాయనం. రోజూ ఉదయాన్నే కాఫీ,  టీ తాగే వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కెఫీన్ మెదడును ఉత్తేజపరుస్తుంది.  శరీరానికి మంచి బూస్టింగ్ ఇస్తుంది. అయితే కాఫీ కేవలం ఇలా ఆరోగ్యానికే కాదు..  జుట్టుకు కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో చర్మ రక్షణ ఉత్పత్తులు,  జుట్టు సంరక్షణ ఉత్పత్తులు కాఫీ ఆధారితంగా ఉన్నవి చాలా అందుబాటులోకి వస్తున్నాయి.  కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి. వీటికి బదులు ఇంట్లోనే కాఫీ హెయిర్ మాస్క్ ట్రై చేసి చూడండి.  కాఫీని కూడా విభిన్న రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది ఇచ్చే ఫలితాలు చూసి షాకవుతారు. కాఫీ, పెరుగు.. కాఫీ, పెరుగు రెండూ మిక్స్ చేసి కాఫీ మాస్క్ తయారు చేయవచ్చు.  పెరుగులో కాఫీ పౌడర్ మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుండి జుట్టు పొడవునా అప్లై చేయాలి.  ఇది జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. జుట్టును  మృదువుగా చేస్తుంది. కాఫీ, ఆల్మండ్ ఆయిల్.. కాఫీ పొడిని,  బాదం నూనెను కూడా కాఫీ మాస్క్ గా ఉపయోగించవచ్చు.  కాఫీ పొడిని బాదం నూనెతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి పొడవునా అప్లై చేయాలి.  ఇది జుట్టును బలపరుస్తుంది.  జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.  జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్-ఇ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు భలే సహాయపడుతుంది. కాఫీ, తేనె.. తేనెను ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు. కాఫీ పొడిలో తేనె మిక్స్ చేసి చిక్కటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి.  దీన్ని జుట్టు మూలాల నుండి అంచుల వరకు మొత్తం అప్లై చేయాలి.  ఇది జుట్టుకు తేమను అందిస్తుంది.  దీని వల్ల జుట్టు తిరిగి జీవం పోసుకుంటుంది.  పొడిగా,  టెంకాయ పీచులా ఉండటం తగ్గుతుంది.  జుట్టు ఆరోగ్యంగా సిల్కీగా మారుతుంది.   కాఫీ, గుడ్డు.. జుట్టు సంరక్షణలో గుడ్డును చాలా కాలం నుండి వాడుతున్నారు. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది.  కాఫీ పొడిని గుడ్డులో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించాలి.  ఇది జుట్టుకు ప్రోటీన్ ను అందిస్తుంది.  జుట్టును బలపరుస్తుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారతాయి.  జుట్టు పెరుగుదల బాగుంటుంది. కాఫీ, నిమ్మరసం.. జుట్టు సంరక్షణలో నిమ్మకాయ చాలా రోజుల నుండి ఉంది.  తలలో చుండ్రు,  దురదలు,  ఇన్ఫెక్షన్లు వంటివి నివారించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. కాఫీ పొడిని నిమ్మరసంలో కలిపి  జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి.  ఇది జుట్టును శుభ్రపరుస్తుంది.   కాఫీ, కొబ్బరినూనె.. వేరే పదార్థాలు ఏమీ లేకపోయినా కొబ్బరినూనెలో కాఫీ పొడి కలిపి తలకు పట్టించవచ్చు.  ఇది జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది.  జుట్టు పొడిబారకుండా చేస్తుంది.  జుట్టును బలపరుస్తుంది.                             *రూపశ్రీ.    

  నల్లగా ఉన్న పాదాలు  తెల్లగా,  అందంగా మారలంటే ఇంట్లోనే ఇలా స్క్రబ్ చేయండి..!     పాదాలు చాలా వరకు మన శరీరంో నిర్లక్ష్యం చేసే అవయవాలు.  ఎండలోనూ, వానలోనూ తిరుగుతుంటాం.  మురికిగా ఉన్న ప్రదేశాలలో కూడా తిరగాల్సి వస్తుంది.  కానీ ఇంటికి రాగానే కాళ్లు అయితే కడుక్కుంటాం కానీ ఇప్పటి  కాలుష్యానికి కేవలం కాళ్లు కడుక్కుంటే తగ్గిపోయేది కాదు ఈ మురికి దాని తాలూకు రంగు. చాలా వరకు పాదాలు పగిలి  వికారంగా కనిపిస్తూ ఉంటే మరికొందరికి పాదాలకు ఇరువైపులా  నల్లగా మారి ఉంటుంది.  దీన్ని తొలగించడానికి పెడిక్యూర్ బానే పనిచేస్తుంది కానీ బ్యూటీ పార్లర్ కు వెళ్లి వందలు, వేలాది రూపాయలు ఖర్చు చేయడం అందరి వల్లా కాదు.  తక్కువ ఖర్చుతో ఇంట్లోనే స్ర్కబ్ తయారు చేసుకుని వాడవచ్చు.  దీని గురించిప తెలుసుకుంటే.. మన ముఖాన్ని శుభ్రం చేయడానికి స్క్రబ్ ఎంత అవసరమో, అలాగే మన పాదాలకు కూడా స్క్రబ్ అవసరం. పాదాల కోసం కింద చెప్పిన విధంగా స్క్రబ్ తయారుచేసుకోవచ్చు.  ఇది పూర్తిగా సహజమైనది.  చర్మాన్ని లోతుగా  ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. ఫుట్ స్క్రబ్ కు కావలసిన పదార్థాలు.. వోట్మీల్ - 1 గిన్నె తేనె - 5 స్పూన్లు కాఫీ - 3 స్పూన్ కొబ్బరి నూనె - 1 టీస్పూన్ పెరుగు - 1 స్పూన్ తయారీ విధానం.. ముందుగా ఓట్ మీల్ ను మిక్సీలో వేసి దాని పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె లేదా గాలి చొరబడని కంటైనర్‌ను తీసుకుని అందులో గ్రైండ్ చేసిన  ఓట్ మీల్ పొడి, కాఫీ, తేనె, కొబ్బరి నూనె,  పెరుగు వేసి బాగా కలపాలి. కావాలంటే అందులో పెరుగు పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేయగానే పాదాలను అందంగా మార్చే స్క్రబ్ సిద్ధమైనట్టే.  స్నానం చేసేటప్పుడు పాదాలను పూర్తిగా స్క్రబ్ చేసి తర్వాత వాటిని కడగాలి. ప్రతిరోజూ స్క్రబ్‌ని ఉపయోగించిన తర్వాత  పాదాలు శుభ్రంగా, నలుపు పోయి అందంగా  మెరిసేలా కనిపించడం స్పష్టంగా గమనించవచ్చు.  రెగ్యులర్ గా చేయలేకపోతే  వారానికి రెండు మూడు సార్లు  పాదాలను స్క్రబ్ చేయవచ్చు.                                                      *రూపశ్రీ.  

అలోవెరా జెల్.. ముఖానికి మంచే కాదు..చెడు కూడా చేస్తుంది..!   అలోవెరా  జెల్.. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యింది.  తాజా కలబంద మొక్కల పెంపకానికి, మార్కెట్లో అమ్మే కలబంద జెల్ అమ్మకాలు పెరగడానికి సౌందర్య ప్రపంచం  మూలకారణంగా ఉంది.  అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా కనిపించడం కోసం చాలా మంది కలబంద జెల్ ను ఉపయోగిస్తుంటారు.  కలబంద జెల్ లో ఉండే పోషకాలు,  సమ్మేళనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  చర్మం మీద మచ్చలు,  మొటిమలు తొలగించి చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. అందుకే ఈ మధ్య అలోవెరా జెల్ కొనుగోళ్లు, వాడకం పెరిగాయి. అయితే  కలబంద జెల్ చర్మానికి మంచే కాదు చెడు కూడా చేస్తుంది. దీని గురించి తెలుసుకుంటే.. కొంతమందికి అలోవెరా అంటే అలెర్జీ ఉంటుంది.  కానీ మార్కెట్లో  లభించే ఉత్పత్తులు చూసినప్పుడు వాటిని వాడాలని అనిపిస్తుంది.  మరికొంతమంది ఇతరులను చూసి ఒక్కసారికి వాడదాం అని అనుకుంటారు. కానీ ఈ అలెర్జీ కారణంగా  చర్మం పైన దద్దుర్లు, దురదలు,  వాపులు లేదా బొబ్బలు కూడా వ్చచ్చే అవకాశం ఉంటుంది. చర్మం రంగును మార్చడం కోసం చాలామంది అలోవెరా జెల్ వాడుతుంటారు. కానీ కొంతమందికి తెలియదు ఇది చర్మాన్ని, చర్మం రంగును నల్లగా మారుస్తుంది.  ఇది చర్మం పిహెచ్  స్థాయిలను అసమతుల్యం చేస్తుంది. కలబంధ జెల్ ను  ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు.  దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి.  ఇది పొరపాటున కళ్లకు అంటినా,  కళ్లలోో పడినా చాలా చికాకు, ఇబ్బంది కలిగిస్తుంది. మార్కెట్లో లభించే  అలోవెరా జెల్ లో చాలా రసాయనాలు ఉంటాయి.  ఈ జెల్ ను అప్లై చేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమల సమస్య పెరుగుతుంది.                                        *రూపశ్రీ.  

శనగపిండిలో ఇవి మూడు కలిపి వాడండి..  ఫలితాలు చూసి షాకవుతారు.. !   ప్రతి ఒక్కరూ ముఖంలో మెరుపును కోరుకుంటారు.  చర్మం మెరిసేలా చేయడానికి రసాయనాలతో కూడిన ఉత్పత్తులు వాడతారు. అయితే  రసాయన ఉత్పత్తులకు బదులుగా  సహజ చిట్కాలు ఉపయోగించినట్లయితే, దాని కంటే మెరుగైనది ఏమి ఉండదు. ఈ రోజుల్లో అనేక సహజ సౌందర్యం మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు  ముఖాన్ని దెబ్బతీస్తాయి. చర్మ సంరక్షణలో చాలా ఏళ్ల నుండి  శనగపిండిని ఉపయోగిస్తున్నారు.  అందుకే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఇంట్లోనే  శనగపిండిలో మూడు పదార్థాలను కలపడం వల్ల అద్బుతం చేయవచ్చు.  అందేంటో తెలుసుకుంటే.. శనగపిండి ప్యాక్.. శనగపిండితో చేసిన ప్యాక్‌లను చాలా ఏళ్ల నుంచి ముఖానికి వాడుతూనే ఉన్నారు.   ఇది యాంటీ బాక్టీరియల్,  ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రంధ్రాలను శుభ్రపరచడంలో, మొటిమలను నయం చేయడంలో, డెడ్ స్కిన్‌ను క్లియర్ చేయడంలో,  చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి, చర్మ కాంతిని  మెరుగుపరచడంలో సహాయపడుతుంది. . శనగపిండి ప్యాక్ కావలసిన పదార్థాలు.. శనగ పిండి - 2 స్పూన్లు ముల్తానీ మట్టి - 1 టీస్పూన్ పసుపు - 1/4 టీస్పూన్ పెరుగు - 2-3 స్పూన్లు (  కావాలంటే మీరు ఈ ఫేస్ ప్యాక్‌లో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కూడా జోడించవచ్చు, ఇది ముఖానికి మెరుపును తెస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి అదనపు  ప్రయోజనాలు చేకూరుస్తుంది. ) తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, ముల్తానీ మట్టి, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసి ఆపై ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల పాటు  ముఖంపై ప్యాక్ ఉంచాలి.  సమయం ముగిసిన తర్వాత ముఖాన్ని కడగాలి. ముఖం కడుక్కున్న వెంటనే ముఖంలో  గ్లో ఎన్ని రెట్లు పెరగడం కూడా గమనించవచ్చు.  వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను ఉపయోగించవచ్చు.                                *రూపశ్రీ.

ఈ పువ్వు ఒక్కటి చాలు.. చర్మ సమస్యలు అన్నీ పరార్..!   ఔషధ గుణాలతో నిండిన పూలు మన చుట్టూ ఎన్నో ఉన్నా వాటి అందాన్ని చూసి సంతోషపడుతూ వాటి సువాసన ఆస్వాదిస్తూ గడిపేస్తుంటారు చాలా మంది.  అయితే పువ్వులు చర్మానికి వరం కంటే తక్కువ కాదు. ముఖ్యంగా కొన్ని పువ్వులు చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పట్లో అందరికీ అందుబాటులో ఉంటూ సౌందర్య రక్షణలో విరివిిగా ఉపపయోగిస్తున్న  పువ్వులలో గులాబీ ప్రథమ స్థానంలో ఉంది.  గులాబీ పువ్వును రోజ్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు.  అంతే కాదు.. గులాబీ పువ్వుల నుండి చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇది చర్మాన్ని రిపేర్ చేయడంలో చాలా సహాయపడుతుంది. ఇంట్లోనే రోజ్ మాయిశ్చరైజర్ తయారు చేసి వాడితే అన్ని రకాల చర్మ సమస్యలు  తగ్గిపోతాయి. కావలసిన పదార్థాలు.. గులాబీ - 1 నీరు - 5 మి.లీ అలోవెరా - 30 గ్రా అర్గాన్ ఆయిల్ - 4 మి.లీ తయారీ విధానం.. మిక్సర్ జార్‌లో  గులాబీ రేకులు, 5 ml నీరు, 30 గ్రాముల కలబంద,  4 ml ఆర్గాన్ ఆయిల్ వేయాలి.  అన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.  గ్రైండ్ చేసిన తర్వాత, గులాబీ సరిగ్గా గ్రైండ్ చేయబడిందో లేదో చెక్ చేయండి. అవసరమైతే, మరొకసారి గ్రైండ్ చేయాలి. బాగా గ్రైండ్ అయిన తరువాత అద్భుతమైన  మాయిశ్చరైజర్ సిద్ధంగా ఉన్నట్టే. దీన్ని నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు, కానీ స్నానం చేయడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఒకవేళ  ఇంట్లో ఆర్గాన్ ఆయిల్ లేకపోతే బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. గులాబీ ఎందుకంటే..  గులాబీ రేకుల సారంలో అధిక ఆంథోసైనిన్, పాలీఫెనాల్స్,  ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఉంటాయి. గులాబీ రేకుల సారం కూడా యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.   సూర్యుని  అతినీలలోహిత కిరణాలకు గురైనప్పుడు  ఎపిడెర్మల్ సెల్ లైన్లలో సైటోకిన్ లను అణిచివేయడం  ద్వారా మన చర్మంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. మొత్తంమీద గులాబీ చర్మానికి ఔషధంలా పనిచేస్తుంది.                                   *రూపశ్రీ.

దట్టమైన కనురెప్పలు కావాలా...ఇలా చేయండి..!     కవుల నుండి చిత్రాకారుల వరకు అమ్మాయిల కళ్లను ఎన్నిరకాలుగా పొగుడుతూ ఉంటారో  మాటల్లో చెప్పలేం.  కళ్లు అందంగా కనిపించడంలో కనురెప్పల పాత్ర చాలా ఉంటుంది.  కనురెప్పలు ఒత్తుగా, నల్లగా ఉంటే కళ్లు మాములు కంటే ఎక్కువ అందంగా కనిపిస్తాయి.  అయితే చాలామందికి కనురెప్పలు పలుచగా ఉంటాయి. ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో కృత్రిమ కనురెప్పలను ఉపయోగిస్తున్నారు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటాయి. అయితే అలా కాకుండా సహజంగానే కనురెప్పలు ఒత్తుగా, అందంగా పెరగాలంటే ఈ కింది చిట్కాలు పాటించాల్సిందే.. కొబ్బరినూనె.. వెంట్రుకలు సహజంగా పొడవుగా మందంగా పెరగడంలో చాలామంది వాడేది కొబ్బరినూనెనే. ప్రతి రోజూ  రాత్రి  పడుకునే ముందు కొబ్బరినూనెను కనురెప్పలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల కనురెప్పలు కొన్ని రోజులలోనే మందంగా,  ఒత్తుగా మారతాయి. నెయ్యి.. రోజూ కొన్ని చుక్కల నెయ్యిని ముఖానికి రాస్తుంటే చాలా మంచిదని వింటూనే ఉన్నాం. అయితే నిద్రపోయే ముందు దేశవాళీ నెయ్యిని రెండుమూడు చుక్కల మోతాదులో వేళ్లకు అద్దుకుని దాన్ని కనురెప్పల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.  ఇది కనురెప్పలను  పొడుగ్గా,  ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తుంది. వాసెలిన్.. కనురెప్పలు ఆకర్శణీయంగా మారాలన్నా,  ఒత్తుగా  పెరగాలన్నా వాసెలిన్ ను అప్లై చేయవచ్చు.   చలికాలంలో దీన్ని పెదవులకు కూడా అప్లై చేయడం చూస్తుంటాం. కానీ కనురెప్పలకు వాసెలిన్ అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కొబ్బరి నూనె, విటమిన్-ఇ.. విటమిన్-ఇ క్యాప్సుల్ చర్మానికి బాగా పనిచేస్తాయి.  విటమిన్-ఇ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.    కొబ్బరినూనెలో విటమిన్-ఇ క్యాప్సూల్ వేసి బాగా మిక్స్ చేయాలి, దీన్ని రోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పల మీద అప్లై చేయాలి.  మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె.. ఆలివ్ నూనె వంటలకు, జుట్టుకు, చర్మానికి ఇలా.. చాలా రకాలుగా మేలు చేస్తుంది.  ఆలివ్ నూనెలో ఆముదం కొద్దిగా మిక్స్ చేసి ఒక కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి.  దీన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు కనురెప్పలకు అప్లై చేస్తుండాలి. కనురెప్పలు ఒత్తుగా, నల్లగా మారతాయి. అలోవెరా జెల్.. అలోవెరా జెల్ అప్లై చేస్తే కూడా కనురెప్పలు పొడవుగా,  మందంగా పెరుగుతాయి. అలోవెరా జెల్ లో విటమిన్-ఇ క్యాప్సూల్ మిక్స్ చేసి  కనురెప్పలకు అప్లై చేసుకోవాలి.  ఇలా చేస్తే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.                                             *రూపశ్రీ.

  ఇంట్లోనే ఈ లిప్ బామ్ తయారు చేసి వాడండి.. పగిలిన పెదవులు ఎంత అందంగా మారతాయంటే..!   పెదవులు.. కవుల కలాలకు అదనపు పనులు చెబుతాయి.  అమ్మాయిల పెదవుల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.  పెదవులు అందంగా ఉంటే  అవి ముఖానికి బోలెడు అదనపు ఆకర్షణ అవుతాయి. కానీ అదే పెదవులు పగిలిపోయి, ఎండిపోయి, నల్లగా ఉండి కళావిహీనంగా ఉంటే మాత్రం ముఖారవిందం మొత్తం పాడయినట్టు అనిపిస్తుంది.  ముఖ్యంగా చలికాలంలో చాలా తొందరగా ప్రభావానికి గురయ్యేది పెదవులే.. పగిలిన పెదాలు ఆరోగ్యంగా మారాలన్నా, అవి మరింత అందంగా కనిపించాలన్నా లిప్ బామ్  వాడుతుంటారు. అయితే ఆరోగ్యకరమైన పద్దతిలో ఇంట్లోనే లిప్ బామ్ ను ఇలా తయారుచేసుకోవచ్చు.  అదెలాగంటే.. కావలసిన పదార్థాలు.. కొబ్బరి నూనె - 1 టీస్పూన్ వాసెలిన్ - 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం - 6 స్పూన్లు విటమిన్ ఇ-2 క్యాప్సూల్స్ తయారీ విధానం.. లిప్ బామ్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొబ్బరినూనె, వాసెలిన్ వేసి కరిగించుకోవాలి. రెండూ కరిగిపోయాక గిన్నెలో బీట్‌రూట్ రసం వేసి కలపాలి. ప్రతిదీ బాగా కలిపిన తర్వాత గిన్నెను గ్యాస్ నుండి వేరు చేసి ఈ ద్రవాన్ని ఒక గిన్నె లో వేయాలి. చివరగా విటమిన్ ఇ ఆయిల్ వేసి లిప్ బామ్ తో మిక్స్ చేయాలి. ఇప్పుడు  పగిలిన పెదాలను మృదువుగా మార్చే లిప్ బామ్ రెఢీ అయినట్టే. పెదాలను పింక్‌గా మార్చడంలో సహాయపడే బీట్‌రూట్ ఇందులో ఉపయోగించారు కాబట్టి పెదవులు పింక్ గా కూడా మారతాయి.  దీన్ని వాడితే లిప్ స్టిక్ వినియోగం తగ్గించుకోవచ్చు. విటమిన్-ఇ ఎలా పనిచేస్తుందంటే.. విటమిన్ ఇ నూనెలో  స్కిన్ ట్రీట్మెంట్ గుణాలు ఉంటాయి. ఇవి పెదాలను హైడ్రేట్ గా ఉంచుతాయి. రక్త ప్రసరణను పెంచుతాయి.  తరచుగా పగుళ్లు రాకుండా చేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్ పెదవుల చుట్టూ టానింగ్‌ను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది.  రోజూ రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ని పెదవులపై రాసుకున్నా ఫలితం ఉంటుంది.                         *రూపశ్రీ.  

డార్క్ సర్కిల్స్ తగ్గించుకునే నేచురల్ రెమిడీస్ ఇవీ..! డార్క్ సర్కిల్స్.. ఎంత అందంగా ఉన్న అమ్మాయిల ముఖాన్ని అయినా పాడు చేసే పెద్ద సమస్య. కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఉంటే ఏదో జబ్బు చేసిన వాళ్లలా కనిపిస్తుంటారు. ఇప్పట్లో చాలామంది ఈ డార్క్ సర్కిల్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మేకప్ తో వీటిని కవర్ చేస్తుంటారు. కానీ శాశ్వతంగా ఇవి తొలగిపోవాలంటే.. ఆయుర్వేదం సూచించిన చిట్కాలను పాటించాల్సిందే.. కారణాలు.. డార్క్ సర్కిల్స్ ఎందుకొస్తాయి అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే డార్క్ సర్కిల్స్ కు ఒత్తిడి ప్రధాన కారణమట.  మానసిక, శారీరక ఒత్తిడి, పర్యావరణ లేదా భావోద్వేగ సమస్యలు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట.  ఇవన్నీ  కలసి నిద్రలేమి, మానసికంగా అలసిపోవడం వంటి సమస్యలు సృష్టిస్తాయి.  ఎక్కువకాలం భావోద్వేగాలను క్యారీ చేయడం వల్ల ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు కొందరు.  ఇలాంటి వారిలో కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. కళ్ల కింద చర్మం పలచబడి రక్తనాళాలు ఎక్కువగా కనిపించేలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అలోవెరా.. అలోవెరా లేదా కలబంద డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  అలోవెరా జెల్ లేదా తాజా కలబంద ను శుభ్రం చేసి స్లైస్ లుకా చేసి  డార్క్ సర్కిల్స్ మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల  కళ్ల కింద నల్లటి వలయాలు నలుపు తగ్గి ఆ ప్రాంతంలో చర్మం కాంతివంతంగా మారుతుంది. దోసకాయ.. చాలామంది కళ్లమీద దోసకాయను పెట్టుకోవడం చూస్తూనే ఉంటాం.  దోసకాయ చలువ చేస్తుంది.  కళ్లను రిలాక్స్ చేస్తుంది.  ఇక కళ్ల కింద నల్లని వలయాలు ఉన్నట్టైతే  దోసకాయ రసాన్ని కళ్ల కింద రాసినా లేదా దోసకాయ ముక్కలను చక్రాలుగా కట్ చేసి కళ్ల మీద  పెచ్చుకుని అలా కాసేపు రిలాక్స్ గా పడుకున్నా మంచి ఉపశమనం ఉంటుంది.  ఇది కేవలం డార్క్ సర్కిల్స్ ను తగ్గించడమే కాదు.. ఉబ్బిన కళ్లను తిరిగి నార్మల్ చేయడంలో కూడా సహాయపడుతుంది. పసుపు.. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. నల్లని వలయాలను చాలా తేలికగా చేస్తుంది. రోజ్ వాటర్.. రోజ్ వాటర్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇందులో ఉండే గుణాలు చర్మానికి చలువదనాన్ని ఇస్తాయి.  చర్మానికి రిలాక్సేషన్ ను ఇస్తాయి.                                                    *రూపశ్రీ.

  కాలనుగుణంగా శరీర తత్వంలో కూడా మార్పు వస్తుంది.  వేసవికాలంలో ఉక్కపోత భరించలేక శరీరం మీద చెమట కాయలు, వడ గుల్లలు వంటివి వచ్చినట్టే.. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చలి గాలుల కారణంగానూ,  చలి చర్మాన్ని దెబ్బ తీయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.  అయితే  ఇలా పొడిబారడానికి చలి మాత్రమే ప్రధాన కారణం కాదు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. చలికాలంలో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇది చర్మం నుండి తేమను లాగేసుకుంటుంది.  పొడిగా కఠినంగా మారుస్తుంది.  దీని వల్లనే చాలా వరకు పొడి చర్మం సమస్య వస్తుంది. చలికాలంలో పొడిచర్మం ఉన్నవారికి సమస్య పెరుగుతుంది. చలికాలంలో  చలికి తాలలేక చాలా మంది వేడి నీటి స్నానమే చేస్తుంటారు.  అది కూడా చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తారు.  దీని వల్ల చర్మం దెబ్బతింటుంది.  చర్మం పొడిబారుతుంది. దీనికి కారణం.. చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోవడమే. చలికాలంలో చలి కారణంగా చాలా మంది నీరు తాగరు, పైగా చలి కారణంగా దాహం కూడా వేయదు. అందుకే శరీరంలో తేమ లోపించి చర్మం పొడిబారుతుంది. కేవలం పొడిబారడమే కాకుండా చర్మం నిర్జీవంగా మారుతుంది. చలి నుండి ఉపశమనం కోసం ఉన్ని బట్టలు వేసుకుంటారు.  ఇవి చర్మాన్ని రుద్దుతాయి.  చర్మానికి అలెర్జీ చర్యను ప్రేరేపిస్తాయి.  దీని కారణంగా చర్మం మీద దురద, దద్దుర్లు వస్తాయి.  ఇది కూడా చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది.  చలిని భరించలేక చాలామంది ఇళ్లలో వేడి హీటర్ లు ఏర్పాటు చేసుకుంటారు.  ఈ హీటర్ నుండి వచ్చే గాలి చర్మాన్ని సున్నితంగా మార్చి చర్మం మీద తేమను లాగేస్తుంది.  ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది. థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.  ఈ సమస్యలు ఉన్నవారి చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది.                       *రూపశ్రీ.

ఈ ఈజీ ట్రిక్స్ నేర్చుకుంటే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లను తలదన్నేలా రెఢీ అవ్వచ్చు..   అందంగా కనిపించడం అమ్మాయిల టార్గెట్.  అందానికి ప్రతిరూపంగా అమ్మాయిలను పోల్చడం, పువ్వులతో సమానంగా అమ్మాయిలను ప్రస్తావించడం చూస్తుంటాం.  ఇదంతా అందం మహిమే.. అయితే చాలామంది అందంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే అనే ఆలోచనలో ఉంటారు. దీనికి తగినట్టే ఏ చిన్న ఈవెంట్ .. ఏ చిన్న పార్టీ ఉన్నా పార్లర్ కు వెళ్ళి వందలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని ఈజీ ట్రిక్స్ ఫాలో అయితే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లు చేసిన మేకప్ కూడా చిన్నబోతుంది.  మేకప్ ను ఇష్టపడే ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన ఆ ట్రిక్స్ ఏంటంటే.. ఐ షాడో.. అమ్మాయిలను చూడగానే మొదటగా ఆకట్టుకునేవి కళ్లు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి సహజంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కళ్లను ఆకర్షణగా ఉంచుకునేవారు.  అయితే ఇప్పట్లో కళ్లకు ఐ లైనర్,  ఐ షాడో తో మెరుగులు దిద్దుతున్నారు.  ఐ షాడో ఫర్పెక్ట్ గా పెడితే కళ్లను చూసి ఇతరులు కళ్లు తిప్పుకోలేరు. అంత అందంగా కనిపిస్తారు.  అందుకే ఐ షాడో ను టేప్ సహాయంతో ఈజీగా అప్లై చేయడం నేర్చుకోవాలి. ఐ లైనర్.. ఐ షాడో మాత్రమే కాదు..  ఐ లైనర్ వేసుకుంటూ ఉంటారు.  రెండు కళ్లక వేర్వేరు ఐ లైనర్ వేసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఐ లైనర్ ను ఈజీగా అప్లై చేసుకునే విధానం ఉంది.   చూపుడు వేలిపై ఒక చుక్క ఐ లైనర్ ఉంచాలి. వేలిని కళ్ల మూలలో నుంచి చెవి వైపుకు నెమ్మదిగా ఒక గీతను గీసినట్టు అప్లై చేయాలి.  అంతే.. కష్టం లేకుండా కేవలం సెకెన్ల వ్యవధిలో అందంగా ఐ లైనర్ అప్లై చేసుకున్నట్టే. కలర్ ఫుల్ షాడో.. టేప్ సహాయంతో ఐ షాడో అప్లై చేయడం తెలుసుకున్నారు కదా.. ఇప్పుడు ఐ షాడోను మరింత ఆకర్షణగా మార్చడానికి ఇయర్ బడ్ తీసుకోవాలి. ఈ ఇయర్ బడ్ సహాయంతో కలర్ ఫుల్ షాడ్ ను అప్లై చేయాలి.  ఇయర్ బడ్ తో రుద్దాలి.  ఇలా చేస్తే మిక్స్డ్ కలర్ లో ఐ షాడో ఔరా అనిపిస్తుంది.                             *రూపశ్రీ.  

ఎర్ర కందిపప్పు ఇలా వాడితే.. మచ్చలేని చర్మం మీ సొంతం..! మచ్చలేని చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. ఇందుకోసం చాలా రకాల టోనర్లు,  సీరమ్ లు, ఫేస్ ప్యాక్ లు, క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అవన్నీ కాదు.. వంటింట్లో ఉండే ఎర్ర కందిపప్పును వాడితే ముఖం మీద మచ్చలు మాయమవుతాయట. మచ్చలేని చర్మం సొంతమవుతుందని అంటున్నారు. చర్మాన్ని నేచురల్ గా మెరిపించే పేస్ ప్యాక్ లను ఎర్ర కందిపప్పుతో తయారు చేసుకుని వాడవచ్చు.  అవెలా చేయాలో తెలుసుకుంటే.. కందిపప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కందిపప్పులో ప్రోటీన్,  ఫైబర్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి.  అయితే ఎర్ర కందిపప్పును పేస్ ఫ్యాక్ గా ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించాలో తెలుుకుంటే.. ఎర్రకందిపప్పు.. పాలు.. పొడి చర్మంతో ఇబ్బంది పడేవారు ఎర్రకందిపప్పు,  పాలతో పేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇది ముఖానికి తేమను అందిస్తుంది.  చాలా సేపు చర్మం తేమను నిలిపి ఉంచుకుంటుంది.  చర్మం మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. కావసిన పదార్థాలు.. తయారీ విధానం.. ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి.  మరుసటి రోజు పప్పును గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.  తరువాత 2 చెంచాల పాలు వేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.  ఇది మరీ జారుడుగా ఉండకూడదు. కాస్త పేస్ట్ లా ఉండాలి.   మొదట ముఖాన్ని శుభ్రం చేసుకుని ముఖం మీద దుమ్ము, ధూళి మలినాలు లేకుండా చేసుకోవాలి. తరువాత ముఖాన్ని తుడుచుకుని శుభ్రం గా ఉన్న ముఖానికి  ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  15 నుండి 20 నిమిషాలు ఈ పేస్ట్ ను అలాగే ఉంచి తరువాత నీటితో ముఖం కడుక్కోవాలి. ఎర్ర కందిపప్పు నానబెట్టుకోలేని పక్షంలో దీన్ని మెత్తని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి.  ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి 15 నుండి 30 నిమిషాల ముందు కొద్దీగా పొడిని పాలలో నానబెట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.   మెరిసే చర్మం సొంతమవుతుంది. ఎర్రకందిపప్పు,  ముల్తానీ మట్టి,  తేనె.. ముల్తానీ మట్టి ముఖానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది.  ఎర్ర కందిపప్పు లో ముల్తానీ మట్టిని కలపాలి. అందులో ఒక స్పూన్ తేనెను కలపాలి.  దీన్ని పేస్ ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.  దీన్ని వారానికి రెండు సార్లు వేసుకుంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.  ఈ ఫేస్ ప్యాక్ లు రెండూ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.                                       *రూపశ్రీ.

రెండు చుక్కల నెయ్యి ముఖానికి రాయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!   చలికాలం చర్మానికి పరీక్ష కాలం అని చెప్పవచ్చు.   చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఈ కాలంలో చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. వందలు, వేలాది రూపాయలు వెచ్చించి  ఫేస్ క్రీమ్ లు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేస్తుంటారు.  మరికొందరు ఇంట్లోనే చిట్కాలు ట్రై చేస్తుంటారు. అయితే ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను వదిలి కేవలం రెండు చుక్కల నెయ్యిని ముఖానికి రాసుకోమని చెబుతున్నారు  చర్మ సంరక్షణ నిపుణుల నుండి వైద్యుల వరకు. అసలు నెయ్యిని ముఖానికి రాయడం వల్ల జరిగేదేంటి? ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను మించి నెయ్యి చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుంటే.. ముఖం పై మచ్చలు, ముడతలు, పొడిబారడం వంటి వాటిని పోగొట్టుకోవడానికి చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు వాడతారు. అలాగే చలికాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా వాడతారు. అయితే వీటి బదులు నెయ్యి వాడవచ్చు. నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మ్యాజిక్ జరుగుతుంది.  నెయ్యిని ముఖానికి రాస్తుంటే చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. ఇది చర్మం చలి కారణంగా  పొడిబారడం, పగుళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.  నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. నెయ్యిలో అరాకిడోనిక్, లినోలెనిక్ ఆమ్లం వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దెబ్బతిన్న చర్మానికి పోషణను ఇస్తాయి. ఫలితంగా వాడిపోయి పగుళ్లు ఏర్పడిన చర్మం తిరిగి యవ్వనంగా, ఆరోగ్యంగా మారుతుంది. ముఖ చర్మం వాడిపోయి రంగు కోల్పోయినట్టుగా ఉన్నప్పుడు రెండు చుక్కల స్వచ్చమైన నెయ్యిని ముఖానికి అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల  ముఖం చర్మం కాంతివంతంగా మారుతుంది.  చర్మ కణాల నష్టం తగ్గుతుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటివి వస్తుంటే రెండు చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయాలి.  ఇలా ప్రతిరోజూ రెండు చుక్కల నెయ్యి ముఖానికి పూస్తుంటే  చర్మం పై మచ్చలు,  మొటిమలు వదులుతాయి.  చర్మం మీద అన్ని రకాల మచ్చలు లేకుండా క్లిస్టర్ క్లియర్ అవుతుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయనే విషయం తెలిసిందే.  ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ముఖం మీద ముడతలను తొలగించి ముఖ చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.  ప్రతిరోజూ నెయ్యిని ఇలా ముఖానికి రాసుకుంటూ ఉంటే ఎంత వయసు పెరిగినా చర్మం యవ్వనంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.