పచ్చిపాలు ఇలా వాడితే ముఖం నిగనిగ..!

ముఖం మెరిసేలా చేయడానికి మార్కెట్లో అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల ముఖానికి తక్షణ మెరుపు వస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ ఉత్పత్తులు చర్మానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో నటీమణుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఇంటి రెమిడీస్  ప్రయత్నించడానికి ఇష్టపడతారు. ఇలా ఉపయోగించేవాటిలో పచ్చిపాల వినియోగం చాలా ముఖ్యమైనది.

నిజానికి పచ్చి పాలు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పచ్చి పాలను  సరిగ్గా ఉపయోగించినప్పుడు  ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. అయితే పచ్చిపాలను ఎలా ఉపయోగించాలి? ఎలా ఉపయోగించడం వల్ల ముఖం నిగనిగలాడుతుంది? తెలుసుకుంటే..

పచ్చిపాలు ప్యాక్ వాడితే..

కావలసిన పదార్థాలు..

2-3 టేబుల్ స్పూన్లు పచ్చి పాలు
 1 స్పూన్ శనగపిండి

తయారీవిధానం..

పచ్చిపాలతో ఫేస్  ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో పచ్చి పాలు తీసుకోవాలి. దానిలో కొంచెం శనగపిండి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా నీళ్లగా ఉండకూడదు.పేస్ట్ పల్చగా  మారితే దానిని ముఖానికి పూయడం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం మందంగా పేస్ట్ తయారు చేసి కొంత సమయం అలాగే ఉంచాలి. తద్వారా అది బాగా సెట్ అవుతుంది.


ఎలా ఉపయోగించాలి?

తయారు చేసిన పేస్ట్ ను కొద్దిసేపు అలాగే నిల్వ చేసిన తరువాత  ముందుగా  ముఖం,  మెడను బాగా కడుక్కోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత పొడి టవల్ తీసుకుని ముఖం మీద తేమను శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ముఖం,  మెడపై సమానంగా అప్లై చేయాలి. ప్యాక్ ను 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ముఖం కడుక్కున్న తర్వాత, తేలికపాటి చేతులతో స్క్రైబ్ చేస్తూ  తుడవాలి.   తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడి టవల్ తో తుడుచుకోవాలి.  ముఖం తేమ లేకుండా తుడుచుకున్న తరువాత మాయిశ్చరైజన్ ను ముఖానికి అప్లై చేసి ఆ తరువాత టోనర్ ను ముఖానికి అప్లై చేయాలి.  ఇలా చేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

ఈ ప్యాక్ ను వారానికి 2-3 సార్లు మాత్రమే ఉపయోగించాలి.  2-3 సార్ల  కంటే ఎక్కువగా ఉపయోగిస్తే అది ముఖానికి హాని కలిగిస్తుంది. మరొక విషయం ప్యాక్ ట్రై చేసేముందు ప్యాక్ ను ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

                               *రూపశ్రీ.