జెన్ జెడ్ అమ్మాయిలకు కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అదిరిపోయే చిట్కాలు..!

 

చర్మాన్ని ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంచడానికి ఎల్లప్పుడూ జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటి తరంలో చాలా వరకు జెన్ జెడ్ అమ్మాయిలు తమ   చర్మాన్ని బాగా చూసుకోవడంలో వెనుక బడ్డారని చెప్పవచ్చు. దీనివల్ల  చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో జెన్ Z అమ్మాయిలు  ముఖంపై గాజు లాంటి మెరుపును పొందాలని ఎంతో ట్రై చేస్తుంటారు.  కానీ కొరియన్ గ్లాస్ స్కిన్‌ పొందడంలో ఫెయిల్ అయ్యే వారు చాలామంది ఉన్నారు. ఈ కొరియన్  గ్లాస్ స్కిన్ ను  సులభంగా పొందడానికి అద్బుతమైన చిట్కాలు తెలుసుకుంటే..

కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే..

 కొరియన్ గ్లాస్ స్కిన్ పొందాలనుకుంటే బియ్యం నీటిని ఉపయోగించవచ్చు. బియ్యాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని ఫిల్టర్ చేసి చర్మానికి అప్లై చేయాలి.

చర్మాన్ని మెరిచేలా,  మృదువుగా చేయడానికి,  పాలు,  తేనె కలిపి  ముఖానికి పూయవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా,  ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

 కొరియన్ గ్లాస్ స్కిన్ పొందాలనుకుంటే ముఖాన్ని రోజూ రెండుసార్లు సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.  మురికిని కూడా తొలగిస్తుంది.

ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొరియన్ గ్లాస్ స్కిన్ పొందడానికి ఇది చాలా ముఖ్యమైనది.  ఇది నిస్తేజంగా,  నిర్జీవంగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది.

వారానికి ఒకసారి అయినా  ముఖాన్ని స్క్రబ్ చేసి, మురికిని తొలగిస్తే చర్మం చాలా మృదువుగా,  మచ్చలు లేకుండా మారుతుంది.  తద్వారా కొరియన్ గ్లాస్ స్కిన్‌ను కూడా పొందవచ్చు.

                         *రూపశ్రీ.