మాన్సూన్.. వర్షాకాలంలో కూడా ముఖం మీద టాన్ వస్తుందా..ఇలా తొలగించుకోవచ్చు..!


వర్షాకాలంలో చాలామంది   దురద, చర్మంపై మంట, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.  అయితే  ఈ సీజన్‌లో వచ్చే  మరొక సమస్య ఉంది. ఇది ప్రతి రెండవ వ్యక్తిని బాధపెడుతుంది.  ఈ సమస్య చర్మంపై టానింగ్.  చాలామంది సూర్యరశ్మి వల్ల మాత్రమే టానింగ్ వస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వర్షాకాలంలో కూడా టానింగ్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఇంట్లోనే  మొండి టానింగ్ ను కూడా తొలగించుకోవచ్చు.  దీని కోసం ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే..

టిప్..1

మొదటి టిప్ ప్రయత్నించడానికి మీకు 2 చెంచాల శనగపిండి, 1 చెంచా పెరుగు, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం అవసరం.

ఉపయోగించే విధానం..

పైన చెప్పుకున్న మూడు పదార్థాలను కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ సిద్ధమైన తర్వాత, దానిని  చేతులపై అలాగే చర్మం టాన్ అయిన చర్మంపై అప్లై చేయాలి. ఇప్పుడు 15-20 నిమిషాల తర్వాత దానిని సున్నితంగా రుద్ది కడగాలి. ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల మృత కణాలు  తొలగిపోతాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

టిప్..2

రెండవ టిప్ కసం  పచ్చి బంగాళాదుంపలు మాత్రమే అవసరం.

ఉపయోగించే విధానం..

ముందుగా బంగాళాదుంప రసాన్ని తీయాలి. పచ్చి బంగాళాదుంపను తురుమి ఆ గుజ్జును పిండితే రసం వస్తుంది.  దాని రసాన్ని తీసి చర్మానికి పూయాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి. బంగాళాదుంపలో బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి ఇవి చర్మ రంగును కాంతివంతం చేస్తాయి.

టిప్..3

మూడవ టిప్ పాటించడం కోసం టమోటాలు అవసరం.

ఉపయోగించే విధానం..

 ముందుగా  టమోటాను గుజ్జు చేయాలి. టమోటాను గుజ్జు చేసిన తర్వాత టానింగ్ ఉన్న చర్మంపై  ఆ గుజ్జును అప్లై చేయాలి.  గుజ్జు అప్లై చేసిన  ప్రాంతాన్ని తేలికగా స్క్రబ్ చేసి, 15 నిమిషాల తర్వాత  చర్మాన్ని కడగాలి. టమోటాలో లైకోపీన్ ఉంటుంది, ఇది టానింగ్‌ను తగ్గిస్తుంది.

                              *రూపశ్రీ.