'ఏ దేవి వరమో నీవు' హీరో మనీష్ ఎవరో తెలుసా?
Nov 29, 2026 3:21PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ లో హీరో మనీష్ గా నటిస్తున్న యాక్టర్ ఎవరో తెలుసా? అతనే బుల్లితెరపై "అంత సీన్ లేదులే" అంటూ ఫేమస్ అయిన యువర్ శ్రవణ్ (Your Shravan).
అసలు పేరు శ్రవణ్, కానీ సోషల్ మీడియాలో యువర్ శ్రవణ్ గా, సీరియల్ లో మనీష్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఏ దేవి వరమో నీవు సీరియల్ లో అంజలి, భవిత మధ్యలో మనీష్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
ఇటీవలే శ్రవణ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ ఫ్లెక్సీని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "Years ago, I wondered... What if Dad ever watched my ads on farms? Today, I'm the face of brands he sees everywhere! From 'Antha Scene Ledhule' to 'Sceneuuu Mamuluga Ledhu'!" అంటూ తన తండ్రి రైతు కావడంతో పొలాల్లో తన యాడ్స్ చూడాలన్న తన కల నెరవేరిందని చెప్పాడు.

శ్రవణ్ జర్నీ నిజంగా.. "అంత సీన్ లేదులే" నుంచి "సీనూ మామూలుగా లేదులే" వరకు సాగింది. మొదట్లో చిన్న చిన్న యాంకరింగ్, సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ మొదలుపెట్టి, తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో బుల్లితెరపై సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. పెద్ద వ్యవసాయ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం అతని కష్టానికి ఫలితం అని ఫ్యాన్స్ అంటున్నారు. మీ పట్టుదల, కృషి, దేవుని దయ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఏ దేవి వరమో నీవు సీరియల్ లో మనీష్ పాత్రలో అంజలికి చైన్ గిఫ్ట్ ఇవ్వబోతూ, ప్రేమలో ఉన్న కుర్రాడిగా శ్రవణ్ నటన ఆకట్టుకుంటుంది. బయట పొలాల్లో రైతులకు తన ఫ్లెక్సీలతో కనిపిస్తూ, టీవీలో హీరోగా కనిపిస్తూ రెండు చోట్లా దూసుకుపోతున్నాడు. అందుకే అతని ఈ ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



