Home

»

Tv News

ప్రియాంక నార్మల్ కాల్ చేస్తే వీడియో కాల్ ఎందుకు చేసావ్... అవినాష్‌కు ఇచ్చిపడేసిన శివ్

Aug 25, 2026 2:36PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఈ వారం సెలబ్రిటీస్ కి ఇచ్చిన కాన్సెప్ట్ వెరైటీ గా ఉంది. ఏదైనా కోరిక కోరుకుని స్టిక్ ని విరగ్గొట్టే ఆ టాస్క్ తో అందరూ ఎంటర్టైన్ అయ్యారు. మధ్యలో శివ్ ని పిలిచింది శ్రీముఖి.
"శివ్ కోరిక ఏంటో చూద్దాం "అంది . "ఈరోజు ఇమ్మానుయేల్ చాలా ఆడుకుంటున్నాడు నాతో. 4 పాక్స్ ఉన్నాయి 6 ప్యాక్స్ లేవని. 250 ఎపిసోడ్స్ కాదు. నేను ఆదివారానికి ఎప్పుడొచ్చినా నా 6 ప్యాక్స్ తోనే రావాలి. " అన్నాడు. "షర్ట్ లేకుండా రావాలి " అని రోహిణి కోరస్ పాడింది. "నేను ప్రతీ ఆదివారం ఈ షోకి వస్తా. వస్తే 6 ప్యాక్ తోనే రావాలి " అని నా కోరిక అంటూ దేవుడిని కోరుకుంటూ స్టిక్ విరగ్గొడదామనుకున్నాడు కానీ విరగలేదు. దాంతో శ్రీముఖి "6 ప్యాక్ ఉండడం ఎల్లప్పుడూ అంత హెల్తీ కాదు నాయనా అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ ఉండాలి మా మానస్ లాగ కానీ పరివారం షోకి వస్తావు. నీ కోరిక నెరవేరుతుందో లేదో తెలీదు నువ్వు సైటిస్ఫై అయ్యేట్టు నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తున్నాను అంటూ ఒక బాక్సింగ్  గ్లోవ్ ఒక పంచ్ బాగ్ ఇచ్చింది. ఆ పంచ్ బాగ్ మీద అవినాష్ ఫోటో ఉంది. ఇమ్మానుయేల్ ని హ్యాపీగా కొడతా.

"పరివారం షోకి ఐతే శివ్ ఉంటాడు లేదా ప్రియాంక జైన్ ఉంటది. ఇద్దరూ కలిసి ఉండరు. అది ఎవరి ప్లానో తెలుసా అవినాష్ ది" అంది శ్రీముఖి. దాంతో శివ్ ఆ పంచ్ బాగ్ ని అవినాష్ అనుకుని లాగి పెట్టి కొట్టాడు. "ఆ బాగ్ ని ఎందుకు డైరెక్ట్ గా అవినాష్ ని కొట్టేయండి " అంటూ దీపికా సలహా ఇచ్చింది. "నాకు ఇంత కోపం ఉందా నీకు " అన్నాడు అవినాష్. "నిజంగా చాలా ఉంది. నైట్ 11. 30 కి ఎందుకు వీడియొ కాల్ చేసావ్ "అని అడిగాడు శివ్. "10. 30 కి మీ పరి నాకు మిస్డ్ కాల్ ఇచ్చింది. అందుకే చేశా " అన్నాడు. " 11. 30 కి ఎందుకు చేస్తారు " అన్నాడు.  "10. 30 కి ఆవిడేందుకు చేసింది. నాకు పెళ్లయింది కదా  " అన్నాడు అవినాష్. "ఆరోజు ఫంక్షన్ కి వెళ్లలేదని చాలా బాధపడ్డారు అని చెప్పారు ఎవరో . ఆ రోజు షూటింగ్ ఉంది రాలేకపోయాము అని చెప్పడానికి కాల్ చేస్తే మీరు 11. 30 కి ఎందుకు కాల్ చేశారు.  "నాకు అప్పుడే షూటింగ్ ఐపోయింది" అన్నాడు
అవినాష్. ఆమె నార్మల్ కాల్ చేస్తే మీరు వీడియో కాల్ ఎందుకు చేశారు  " అన్నాడు శివ్. దాంతో అవినాష్ కి నోట మాట రాలేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com