మా ఆయన నాకే కదా ఫోన్ చేసింది.. తప్పేముంది?
on Aug 8, 2022
ఈ మధ్య బుల్లి తెర షోస్ ద్వారా చాలా మంది ప్రేమలో పడి రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకుని సెటిల్ ఐపోతున్నారు. అలాంటి ప్రేమ జంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి జంటల్లో ఒకరు సిద్ధు, విష్ణుప్రియ. వీళ్ళు కూడా అంతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ ఇద్దరి పేరుతో 'సిద్ష్ను' అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇందులో ఎన్నో అప్ డేట్స్ తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇక సిద్ధు ఐతే చాలా చిన్నపిల్లాడిగా, పెళ్లి కాని కుర్రాడిగానే అందరికీ కనిపిస్తూ, కవ్విస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా విష్ణుప్రియ ఒక వ్లాగ్ చేసింది. అందులో అమరదీప్ ఎంగేజ్మెంట్ వీడియో పోస్ట్ చేసింది. ఎంగేజ్మెంట్ కోసం ట్రైన్ లో వెళ్తూ మల్లిక, జానకి అల్లరి కూడా వీడియో తీసింది. "ప్రియాంక చూసారా ఎలా అల్లరి చేస్తుందో నిద్రపోకుండా" అంటూ చూపించింది. ఇక ఎవరి పనుల్లో వారు ఉంటే ఫోన్, లాప్ టాప్ తో బిజీ బిజీగా ఉన్నారంటూ చూపించి పరువు తీసింది.
ఇక అదే టైంలో విష్ణుప్రియకు తన హస్బెండ్ సిద్ధు నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ విని ప్రియాంక ఫుల్ సెటైర్స్ వేసింది. "అర్ధరాత్రి శ్రీవారు ఫోన్ చేస్తే చూడండి ఎలా సిగ్గు పడుతుందో" అంటూ ఆ సిగ్గును కూడా చూపించింది. "ఏమండి.. మీరు ఇలా ఫోన్ చేసి మాట్లాడుతుంటే దీన్ని కూడా వ్లాగ్ లో రికార్డు చేసేస్తున్నారు" అంటూ గారంగా చెప్తూ ఉంది. "మా ఆయనకు నేనంటే ఇష్టం, నేను ఎలా ఉన్నానా అని ఫోన్ చేసాడు. జాగ్రత్తగా వెళ్తున్నానా లేదా అని తెలుసుకుంటున్నాడు, తప్పేముంది!" అంటూ వీడియోలో తెగ సిగ్గు పడిపోయింది విష్ణుప్రియ. ప్రేమంటే ఇలా ఉంటది మరి.
Also Read