Home

»

Tv News

Godhavari:కూతుళ్లపై శంకర్ ప్రేమానురాగాలు.. మురళి మనసులో పెళ్లి సందడి!

May 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -04 లో..... తన కూతురు కర్రసాములో గెలిచి తనకి అభిషేకం చేసే అదృష్టం కలిగించినందుకు శంకర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. శంకర్ తన కుటుంబంతో కలిసి అభిషేకం చేస్తాడు. ఆ తర్వాత గోదావరి గట్టున నలుగురు కూతుళ్లు సరదాగా ఆడుకుంటుంటే శంకర్ వాళ్ళని చూసి మురిసిపోతాడు. ఎందుకు అండి కూతుళ్ళకి అంత దూరం ఉంటారు. మీరు ఎంత బాధని అనుభవిస్తున్నారో నాకు తెలుస్తుంది.. దుబాయ్ కి వెళ్లకుండా ఇక్కడే ఉండొచ్చు కదా అని శంకర్ తో శారద అంటుంది. వాళ్ళ జీవితాలు బాగుండాలంటే వెళ్ళక తప్పదని శంకర్ అంటాడు.

ఆ తర్వాత సీతారాముల పల్లకి సేవలో శంకర్ కుటుంబం పాల్గొంటుంది. అలకనంద వైపు మురళి చూస్తుంటాడు. మరొకవైపు జానూ వంక సూర్య చూస్తాడు. ఆ తర్వాత మురళి తన కాబోయే భార్య అయిన అలకనంద జ్ఞాపకాలన్నీ ఒక బాక్స్ లో దాచుకుంటాడు. వాటిని చూస్తూ మురళి మురిసిపోతాడు అందులో తాళి కూడా ఉంటుంది. అలకనంద మెడలో మురళి తాళిని కడుతున్నట్లు ఉహించుకుంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వస్తుంది. నీలో పెళ్లికళ కన్పిస్తుందిరా.. రేపు మీ మావయ్యని పెళ్లి గురించి అడుగుతానని చెప్తుంది. మరొకవైపు జానూని గుర్తు చేసుకుంటాడు సూర్య.

ఆ తర్వాత జానూ టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తుంది. అక్కడికి సూర్య వస్తాడు. తనతో మాట్లాడాలని ట్రై చేస్తాడు. మనం ఇన్నిసార్లు కలుస్తున్నాం.‌ డెస్టిని ఏదో చెప్పాలని అనుకుంటుందని సూర్య అంటే జానూ వెటకారంగా మాట్లాడుతుంది. మరొకవైపు శంకర్ భోజనం చెయ్యడానికి కూర్చుంటాడు. కిన్నెర తను గీసిన డ్రాయింగ్ తీసుకొని వస్తుంది. అలకనంద వాళ్ళ నాన్న కోసం కుట్టిన షర్ట్ ఇస్తుంది. నాన్న మీ కోసం వెల్ కమ్ ముగ్గు వేసాను కానీ అది పోయిందని గౌతమి అనగానే ఫోటో తీసుకున్నానని శంకర్ చూపిస్తాడు. దాంతో గౌతమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకి జానూ ఎక్కడ అని శంకర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com