
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1032 లో.....చలపతి ఇంటికి అపర్ణ వెళ్తుంది. మీ బాబు అచ్చం మా అబ్బాయి లాగే ఉన్నాడు. అసలు అతను మీ అబ్బాయేనా లేక మీకు దొరికాడా అని అపర్ణ అడుగుతుంది. కుటుంబాన్ని అంతా పోగొట్టుకొని ఉన్నాను.. అతన్ని చూస్తే నా మనవడు బ్రతికే ఉన్నాడనిపించింది ప్లీజ్ చెప్పండి.. అతను మీకు దొరికాడు కదా అని అపర్ణ అడుగుతుంది. లేదమ్మ అతను మా కొడుకే మీరు ఇలా అడగడం కరెక్ట్ కాదని చలపతి అంటాడు. మీరు ఎందుకో అబద్ధం చెప్తున్నారనిపిస్తుందని అపర్ణ అంటుంది. అదేం లేదని చలపతి అనగానే అపర్ణ అక్కడ నుండి వెళ్తుంది. ఆవిడని చూస్తే చాలా జాలిగా ఉంది.. నిజం చెప్తే బాగుండేదని లక్ష్మీ అంటుంది. శృతి ఏం చెప్పింది.. రాజు బ్రతికి ఉన్నాడని రేఖకి తెలిస్తే రాజుని బ్రతకనివ్వదని చెప్పింది కదా ఈవిడ ద్వారా తనకి తెలిస్తే... ఈవిడ మంచి వారో లేక యాక్టింగ్ చేస్తుందో తెలియదు కదా అని చలపతి అంటాడు.
ఆ తర్వాత అపర్ణ నడుచుకుంటూ వెళ్తుంటే దార్లో శృతి కన్పిస్తుంది. బాగున్నారా మేడమ్ అని అడుగుతుంది. ఎవరు నువ్వు అని అపర్ణ అడుగుతుంది. నేను మేడమ్ శృతిని అని చెప్తుంది. ఏంటి మేడం ఇక్కడున్నారని అపర్ణని శృతి అడుగుతుంది. చిన్న పని ఉండి వచ్చానని అపర్ణ చెప్తుంది. ఆఫీస్ లో ఏ ఇబ్బంది లేదు కదా అని అపర్ణ అనగానే రాజ్ సర్ కావ్య మేడమ్ ఉన్నప్పుడు బాగుండేది ఇప్పుడు అసలు బాలేదు ఎంప్లాయిస్ ని ఎవరు పట్టించుకోరు.. అసలు ఈ నెల జీతాలు ఇవ్వలేదని రేఖ చేస్తున్న పనుల గురించి అపర్ణకి శృతి చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సారీ మేడమ్ మీ మనవడు బ్రతికే ఉన్నాడని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ రేఖకి తెలుస్తుందని చెప్పట్లేదని శృతి అనుకుటుంది. మరొకవైపు ఇందుకి నందు వీడియో కాల్ చేస్తుంది. కాల్ ని రాజు లిఫ్ట్ చేస్తాడు. ఏంటి నువ్వు.. మా అక్క ఫోన్ లిఫ్ట్ చేసావని నందు అడుగుతుంది. మీ అక్క కూడా నా దగ్గర ఉంది.. మీ అక్కని పెళ్లి చేసుకున్నానని రాజు అనగానే నందు షాక్ అవుతుంది. నేను నమ్మను.. మా అక్క నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటని నందు అడుగుతుంది. నమ్మకపోతే వచ్చి అడుక్కోమని రాజు చెప్తాడు. మరొకవైపు ఆంటోనీ జైలు నుండి విడుదల అవుతాడు. తన కోసం లక్కీ వెయిట్ చేస్తాడు. ఎరా లక్కీ వచ్చావా.. నా కోసం బీర్ , బిర్యానీ తెచ్చావా అని అడుగుతాడు. నిన్ను భరించేది మా అమ్మ గురించి తెలుసుకోవడానికి అని లక్కీ అనుకుంటాడు.
ఆ తర్వాత ఇందుని నందు కలుస్తుంది. ఏం చేస్తున్నావ్ అక్క.. నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటని కోప్పడుతుంది. నీకు మంచి సంబంధం చూస్తాను వాడిని వదిలేయ్ అని నందు అనగానే ఏంటి తెగ ఫీల్ అవుతున్నావ్ నా గురించి నీకేంటి అని ఇందు కోప్పడుతుంది. ఎందుకు అంటే నేను నీ సొంతచెల్లెలు కాబట్టి అని నందు చెప్పగానే ఇందు షాక్ అవుతుంది. అవును అక్క అని నందు చెప్పగానే నందుని ఇందు హగ్ చేసుకొని ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదని ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో ఇప్పుడు ఆఫీస్ పరిస్థితి చూసి మీ అమ్మ ఉంటే ఆఫీస్ కి వెళ్ళేది నువ్వు ఆఫీస్ కి వెళ్ళమని ఇందుతో అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






