TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

BiggBoss 10 Telugu : సుధీర్ నక్కతోక తొక్కి రావడం కాదు.. మింగేసి వచ్చాడు!

Nov 24, 2026 2:07PM

బిగ్ బాస్ సీజన్-10 లో నిన్నటి పన్నెండో వారం నామినేషన్ లో..త్రిగుణ్, వంశీ, దేబ్జానీ, వర్షిణి, రామ్ ప్రసాద్, ముఖేష్, రామకృష్ణ నామినేషన్లో ఉన్నారు. ఇంకా శివ్, నరేశ్, అమన్, సుధీర్ నామినేషన్ లో లేరు.  ఇందులో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు అతనే సుధీర్.. అతడు ఎప్పుడో బయటకి వెళ్ళే కంటెస్టెంట్ పన్నెండు వారాలున్నాడు. 

దేబ్జానీ, త్రిగుణ్, ముఖేష్, వర్షిణి,  రామ్ ప్రసాద్ వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడానికి వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకొని మరి నామినేషన్ లోకి వచ్చారే తప్ప ఎవరిని నామినేట్ చేస్తే డబల్ ఎలిమినేషన్ లో వెళ్ళిపోతారనేది ఆలోచించలేదు.. సుధీర్, శివ్ వీళ్ళద్దరు స్పెషల్లీ వీళ్ళద్దరూ నామినేషన్ లోకి వస్తే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్లు.. వాళ్ళద్దరిని బాటమ్ లో అన్నిసార్లు చూసిన తర్వాత కూడా వాళ్ళని నామినేట్ చేయలేదెవరు కూడా.. ఏందో ఈ ప్రాసెస్ ఏందో మరి బిగ్ బాస్ మామ కూడా.. ఈ పీక్ సిచువేషన్ లో 12వ వారంకి వచ్చినాక కూడా 11 మందిని హౌస్ లో ఉంచాడు.

అమన్,  నరేష్ ఓకే వాళ్ళకంటే ఓటు బ్యాంక్ ఉంది.. అమన్ ఆల్రెడీ క్యాప్టెన్ అనుకో ఆ పక్కన పెడితే ఆయనకి ఓటు బ్యాంక్ ఉంది నరేష్ కి ఓటు బ్యాంక్ ఉంటది. ఇప్పుడు శివ్ ఉన్నాడు.. సుధీర్ ఉన్నాడు వాళ్ళని ఎవరు ముట్టలేదు.. సుధీర్ నిజంగా మార్కండేయుడు, మృత్యుంజయుడు, ప్రహ్లాదుడు, అమృతం తాగినోడు ఇవన్ని పేర్లకి అర్హుడే.. అయితే అంతకుమించి సుధీరుడు..ఇప్పుడు చూడు టికెట్ ఫినాలే కొడతానని కూర్చున్నాడు. ఇప్పుడు టికెట్ ఫినాలే కొట్టాలే అతను టాప్-5 కన్ఫమ్ పోతాడు. మొదటి వారం నుండి ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అన్న కంటెస్టెంట్ కొంత ఆయన లాక్కుంటే కొంత వీళ్ళు వదిలేస్తే ఇలా హౌస్ లో ఉన్నాడు.. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఉంటాడు. ఈ వీక్ ఉంటాడు నెక్స్ట్ వీక్ ఉంటాడు ఆ తర్వాతనే పోతే 14వ వారంలో పోవాలే వహ్ అన్నా వా.. అసలు తెలుసుగా నక్క తోకని తొక్కొచ్చుడు కాదు నక్క తోకని నమిలి మింగివచ్చిండు.. మామూలోడు కాదు అదృష్టవంతుడికి మమ్మీ హస్బెండ్ అంతే. మరి సుధీర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 

 

google-ad-img