గెలుపుని తీసుకున్నప్పుడు ఓటమిని కూడా తీసుకోవాలి: శ్రీసత్య
on Dec 1, 2022
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఎందుకంటే వారాలు గడిచేకొద్దీ హౌస్ మేట్స్ ప్రవర్తన చేంజ్ అవుతూ వస్తోంది. 'టికెట్ టు ఫినాలే' రేస్ లో అందరూ కూడా వారి బెస్ట్ ఇస్తున్నారు.
ఒక్కో లెవల్ పూర్తయ్యే కొద్ది రేస్ నుంచి ఒక్కో కంటెస్టెంట్ బయటకొస్తున్నారు. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఇద్దరు బయటకొచ్చారు. మిగతా నలుగురు రేస్ లో ముందుకెళ్ళారు. అయితే వారికి బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా, ఆ టాస్క్ లో మొదటగా ఫైమా వెళ్ళిపోగా, తర్వాత రేవంత్, శ్రీహాన్ లు వెళ్ళిపోయారు. చివరగా ఆదిరెడ్డి ఉన్నాడు.
రేవంత్ టాస్క్ నుండి వెళ్లిపోతూ "నా శాడిస్టిక్ చూపిస్తా" అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న శ్రీసత్య, రేవంత్ దగ్గరికి వెళ్ళి "ఏంటి రేవంత్ ఎందుకలా అంటున్నావ్, టాస్క్ లో అందరూ ఫన్నీ గానే కదా జోక్స్ వేసుకున్నారు. గెలుపుని తీసుకున్నప్పుడు.. ఓటమిని కూడా తీసుకోవాలి" అంటూ చెప్పింది. "నాకు తెలుసులే.. నువ్వు వెళ్ళు" అని రేవంత్ అన్నాడు. అయితే రేవంత్ తో ఇంతకముందు ఇదేమాట ఆదిరెడ్డి కూడా చెప్పాడు. అయితే రేవంత్ తనకి ఫేవర్ గా ఉండి గెలిస్తే కామ్ గా ఉంటాడు. తను గెలవకపోతే కోపాన్ని చూపిస్తాడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read