Home

»

Tv News

Podharillu : అన్నయ్య కోసం తమ్ముళ్ల త్యాగం.. మాధవ పెళ్లి ఫిక్స్ అయినట్లేనా?

Apr 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -96 లో.....మాధవకి మంచి సంబంధం చూడమని మ్యారేజ్ బ్రోకర్ ని నారాయణ ఇంటికి పిలిపిస్తాడు. మా అన్నయ్యకి మంచి సంబంధం చూడండి అని చక్రి అంటాడు. మొన్న వచ్చింది మంచి సంబంధం.. మీ అన్నయ్య వాళ్లకి బాగా నచ్చాడు కానీ ఏదో కండిషన్ పెట్టారట అని అతను అంటాడు. ఏం కండిషన్ అని చక్రి వాళ్ళు అడుగుతారు. ఏమో నాకు తెలియదు ఆ కండిషన్ ఒప్పుకోనందుకే క్యాన్సల్ అయిందన్నారు.. అమ్మాయి మీ అన్నయ్యని కలిసి మాట్లాడిందట అని బ్రోకర్ చెప్పగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు.

ఆ తర్వాత మాధవ ఇంటికి రాగానే అందరు తన చుట్టూ చేరి మొన్న పెళ్లి సంబంధం చూసిన అమ్మయిని కలిశారట వాళ్ళు ఏదో కండిషన్ పెట్టారట ఏంటని మహా వాళ్ళు అడుగుతారు. కానీ మాధవ ఏం చెప్పకుండా వాళ్ళని దబాయించి పంపిస్తాడు. ఆ తర్వాత అన్నయ్య ఒక రీల్ చేద్దామని కేశవతో కన్నా అంటాడు. రీల్స్ చూస్తుంటే శైలు, కేశవ చేసిన రీల్ వస్తుంది. ఆ రీల్ లో  కేశవ చెయ్ ని కన్నా గుర్తుపడతాడని కేశవ టెన్షన్ పడి రీల్స్ వద్దు ఏం వద్దని వెళ్లిపోతాడు. ఏంటి సడెన్ గా ఇలా అయ్యాడని కన్నా ఆలోచిస్తాడు. రీల్స్ చేద్దామంటే ఫస్ట్ ఒకే అన్నాడు.. ఇప్పుడు వద్దని వెళ్తున్నాడని కన్నా అనగానే కన్నా ఫోన్ తీసుకొని మహా చూస్తుంది. అందులో కేశవ చెయ్ గుర్తుపట్టి మొన్న మనతో మాట్లాడింది ఈ అమ్మాయి లాగే ఉందని అనుకుంటారు. చక్రి, మహా, కన్నా అందరు కలిసి కేశవ ని బుస్ అంటూ ఆటపట్టిస్తారు.

ఆ తర్వాత ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చేది ఉంది. అందుకే ఫోన్ తీసుకున్నానని కేశవ చెప్తుంటే ఎవరు నమ్మరు. ఆ తర్వాత మాధవకి వచ్చిన పెళ్లి సంబంధం అమ్మాయి వాళ్ళు ఏం కండిషన్ పెట్టారో తెలుసుకోవాడానికి మహా, చక్రి వెళ్తారు. పెళ్లి అయ్యాక వేరుగా ఉంటే సంబంధం ఖాయం చేస్తామని వాళ్ళు అంటారు. ఇంట్లో అడిగి చెప్తామని మహా, చక్రి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి ఆ విషయం కన్నా, కేశవకి చెప్తారు. అన్నయ్య హ్యాపీగా ఉంటాడంటే అలాగే చేద్దామని అందరు అనుకుంటారు. ఇక అన్నయ్య మనతో ఉండడా అని కన్నా ఏడుస్తాడు. తనని నవ్వించడానికి కేశవని మహా కర్రతో కొట్టినట్లు యాక్టింగ్ చేస్తుంటే కన్నా నవ్వుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com