Home

»

Tv News

Jayam serial : గంగ తండ్రిని చూసిన లక్ష్మి.. రుద్ర డబుల్ గేమ్ వెనుక అసలు ప్లాన్ ఏంటి?

Apr 21, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -248 లో... కేసు విత్ డ్రా చేసుకుంటాను.. నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తాను.. కేసులో ఇవన్నీ గొడవలతో ప్రీతి డిస్టబ్ అవుతుందని రుద్ర అంటాడు. ఏంటి రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నాడుని వీరు అనుకుంటాడు. ఏం అంటావ్ వీరు నేను ఏం చేసినా ప్రీతీ కోసం ప్రీతి కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మాత్రమే ఓపికపడుతున్నానని రుద్ర డబల్ మీనింగ్ లాగా మాట్లాడుతుంటే వీరుకి అర్థం అవుతుంది. మరొకవైపు లక్ష్మీ డల్ గా ఉంటుంది. ఏమైందని పైడి రాజు అడుగుతాడు. గంగని చిన్నప్పుడు వదిలేసినా వాళ్ళ నాన్నని చూసానని లక్ష్మి అంటుంది.

ఇన్ని రోజులకి కన్పించాడా అసలు అతన్ని చీకట్లో చూసానన్నావ్ అతన్ని గుర్తుపట్టావా అని పైడిరాజు అంటాడు. అతనే అని లక్ష్మీ చెప్తుంది. ఆ తర్వాత విశ్వనాథ్ ఇంట్లో పని చేయుటకు పైడిరాజు, లక్ష్మి ఇద్దరిని ఒకతను మాట్లాడుతాడు. కానీ లక్ష్మీ, విశ్వ నాథ్ ని చూడదు. ఆ తర్వాత సుధా డల్ గా ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావని విశ్వ అడుగుతాడు. నీ కుటుంబానికి కొడుకుని దూరం చేసి మంచి పని చేసాడని విశ్వ అంటాడు. మీరు నాకు అర్థం కారు.. మిమ్మల్ని ఆ కుటుంబం దూరం పెట్టారని వాళ్ళ గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదని సుధా అంటుంది.

మరొకవైపు ఒక అమ్మాయి రుద్ర దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తుంది. ఆ అమ్మాయి రుద్ర గురించి మాట్లాడుతుంటే.. గంగ జెలస్ గా ఫీల్ అవుతుంది. ఏంటండి మీరు నాకు సవతిని తీసుకొని వచ్చారా అని రుద్రతో గంగ అంటుంటే రుద్ర కోపంగా ఏం మాట్లాడుతున్నావ్.. తను ట్రైనింగ్ కోసం వచ్చిందని రుద్ర అంటాడు. దాంతో అపార్థం చేసుకున్నానని గంగ అనుకుంటుంది. తరువాయి భాగంలో సుధాకి లక్ష్మి తన కూతురు గంగ అని చెప్పనుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com