.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1029 లో.... రాజు, ఇందు పెళ్లి చేసుకొని రావడంతో రేఖ షాక్ అవుతుంది. పెళ్లిని నేను ఒప్పుకోవడం లేదని ఇందు మెడలో తాళి తియ్యబోతుంటే రాజు అడ్డుపడుతాడు. ఇప్పుడు తను నా భార్య అని పెళ్లి వీడియోస్ చూపించేసరికి రేఖ సైలెంట్ అయిపోతుంది . బయటకు వెళ్లి మీడియా వాళ్ళని కలుస్తామని రాజు బ్లాక్మెయిల్ చేయగానే లోపలికి రమ్మని అంటుంది రేఖ. ఆ తర్వాత రాజుని చూసి అపర్ణ ఇంకా డైలామాలోనే ఉంటుంది. నువ్వు ఎవరు బాబు మీ పేరెంట్స్ ఎవరు అని అపర్ణ అడుగుతుంది. రాజు ఏదో అబద్ధం చెప్పబోతుంటే ఇందు వాళ్ళ పేరెంట్స్ పేర్లు చెప్తుంది.
ఆ తర్వాత సారీ పిన్ని ఇందాక నిన్ను కొట్టానని భ్రమరాంబకు సారీ చెప్తాడు రాజు. మా భ్రమని కొట్టింది నువ్వా అని శేషు అంటాడు. ఆ తర్వాత ఏయ్ ఇందు మన రూమ్ ఎక్కడ అని రాజు అడుగుతుంటే.. ఇందు కోపంగా చూస్తుంది. మరొకవైపు రేఖ కోపంగా గదిలో ఉన్న వస్తువులన్ని విసిరేస్తుంది. ఏంటి రేఖ ఆగు అని భూషణ్ ఆపుతాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఈ ఆస్తులు సొంతం అవుతాయి.. ఎక్కడి అప్పులు అక్కడ తీరుతాయనుకున్నాం కానీ ఈ రాజుగాడు వచ్చి మొత్తం ఫెయిల్ చేసాడని భూషణ్ అంటాడు. మరొకవైపు ఇందు గదిలోకి రాజుని తీసుకొని వెళ్తుంది. ఏంటి స్టోర్ రూమ్ కి తీసుకొని వచ్చావని అడుగుతాడు. ఇది స్టోర్ రూమ్ కాదు.. నా రూమ్ అని రాజు అనగానే అంటే నువ్వు ఈ ఇంటికి మహారాణివి అన్నావ్.. నువ్వు అలా అన్నావనే నేను యాక్టింగ్ చెయ్యడానికి వచ్చాను.. ఇప్పుడు నాకూ డబ్బు ఎలా ఇస్తావని ఇందుని రాజు అడుగుతాడు.
నోరు ముయ్ ఈ ఆస్తులన్ని నావే.. అది నీకు చెప్పినా అర్థం కాదని ఇందు అంటుంది. ఏంటి ఇందాకటి నుండి ఎక్స్ ట్రాలు చేస్తున్నావ్.. మన డీల్ ఏంటో ఒకసారి గుర్తుచేసుకోమని ఇందు అనగానే ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నది రాజు గుర్తుచేసుకుంటాడు. భర్తగా యాక్టింగ్ చేసినందుకు రోజుకి పదివేలు ఇస్తానని ఇందు చెప్తుంది. హాస్పిటల్ ఖర్చుకి అవుతుందని రాజు ఒప్పుకంటాడు. తను చెప్పినట్లు వినాలని ఇందు చెప్తుంది. అదంతా రాజు గుర్తుచేసుకుంటాడు. డీలింగ్ గుర్తుంది కదా ఎక్స్ ట్రాలు చేస్తే ఊరుకోనని ఇందు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
