Home

»

Tv News

Podharillu: ఇంటి నుంచి వెళ్లిపోతాడని పెద్ది కోసం తాళం వేసి మరీ పడుకున్న కేశవ!

Sep 20, 2026 11:15AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-214లో..  పెద్ది మళ్లీ ఎక్కడ ఇంటి నుంచి వెళ్లిపోతాడోనని మహా భయపడుతుంది. ఈ విషయం చక్రికి చెప్పడంతో రాత్రంతా పెద్ది కోసం కాపలా కాయాలని చక్రి నిర్ణయిస్తాడు. అయితే కాపలా విషయంలో మాత్రం చక్రి తెలివిగా కేశవను ముందు పెడతాడు. నువ్వే పెద్దోడివి కదా.. నువ్వే ముందు ఉండమని చెప్పడంతో కేశవ కాపలా కాస్తూ ఉండిపోతాడు. మరోవైపు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవ్వడంతో పెద్ది బాధపడుతున్నా బయటకు మాత్రం నవ్వుతున్నట్టు అనిపిస్తోందని మహా అతనిపై అందరూ ఒక కన్నేసి ఉంచాలని చెప్తుంది. దాంతో చక్రి.. ఒక కన్నేంటి.. రెండు కళ్లు వేసి ఉంచుదామంటూ బాధ్యత తీసుకుంటాడు.

ఇక పెద్ది నిజంగానే నిద్రపోతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి చక్రి ప్లేట్‌తో పెద్ద శబ్దం చేసి టెస్ట్ చేస్తాడు. దాంతో కేశవ, కన్నా ఉలిక్కిపడి లేవడంతో.. అన్నయ్య మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోతాడేమోనని డౌట్ వచ్చింది.. అందుకే ఇలా చేశానని చక్రి చెప్తాడు. పెద్ది నిద్రపోతున్నాడని నిర్ధారించుకున్న తర్వాత.. అన్నయ్య ఉదయం ఆరు గంటలకు లేస్తాడు.. అప్పటివరకు మనం కాపలా కాద్దామని చెప్పి మళ్లీ కేశవనే ముందు పెడతాడు. కేశవ మాత్రం నిజాయితీగా కాపలా కాస్తూ ఉండగా, చక్రి, కన్నా హాయిగా నిద్రపోతారు. కొంతసేపటికి చక్రిని నిద్రలేపడానికి కేశవ ప్రయత్నించినా అతను ఎంతకూ లేవడు. దాంతో.. ఇంటికి తాళం వేసి బయట పడుకుంటే పెద్ది బయటకు వెళ్లలేడు కదా అని అనుకుని ఇంటికి తాళం వేసి గుమ్మం దగ్గరే పడుకుంటాడు.

ఉదయం పెద్ది నిద్రలేచి తలుపు తీయడానికి ప్రయత్నించగా అది తెరుచుకోదు. బయట చూస్తే కేశవ గుమ్మం దగ్గర పడుకుని ఉంటాడు. మరోవైపు నిద్రలేచిన చక్రికి పెద్ది కనిపించకపోవడంతో.. వామ్మో.. అన్నయ్య మళ్లీ వెళ్లిపోయాడంటూ హంగామా చేస్తాడు. అందరు వెతుకుతుండగా చివరకు పెద్ది, కేశవ కనిపిస్తారు. నీకు బుద్ధి ఉందా.. మమ్మల్ని నిద్రలేపకుండా పడుకుంటావా అని కేశవపై చక్రి మండిపడగా.. అసలు విషయం ఏంటని పెద్ది అడుగుతాడు. దీంతో కన్నా నిజం చెప్పేస్తూ.. నువ్వు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోతావేమోనని మేమంతా భయపడ్డామని చెప్తాడు. దీంతో అసలు విషయం పెద్దికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Podharillu today episode 214, Star Maa Podharillu September 20 episode, Podharillu Peddi night guard comedy twist, Podharillu Chakri Keshava fun episode, Podharillu engagement cancel Peddi upset]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com