Home

»

Tv News

Godhavari:  హాస్పిటల్‌లో సూర్య, నిత్యను చూసి షాక్ అయిన జాను.. కిన్నెరని కాపాడుకుంటుందా!

Sep 20, 2026 11:24AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి (Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-117 లో..  రాత్రిపూట సూర్య నడుచుకుంటూ వెళ్తుంటే సింహాద్రి చూసి నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఆ జాను వెంట పడతావా.. నువ్వు ఇలా ఉంటే నా కూతురు నిన్ను మర్చిపోలేదు.. నిన్ను నా అల్లుడిని చేసుకొని నీ ఆస్తిని నా ఆస్తిలో కలుపుకోవాలి అనుకున్నా అన్నీ ఫెయిల్ అయ్యాయి.. ఇక నువ్వు ఉండకూడదు.. నువ్వు చస్తే నా కూతురు రెండు రోజులు ఏడుస్తుంది. తర్వాత  వేరే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది. నువ్వు ఉండకూడదనుకొని సూర్యని కారుతో గుద్దేస్తాడు సింహాద్రి. దాంతో సూర్యకి దెబ్బలు తగిలి అక్కడే కుప్పకూలిపోతాడు.  

మరోవైపు జాను చెల్లి కిన్నెరకి ఎలా ఆపరేషన్ చేయించాలని డబ్బు ఎలా కట్టాలని జాను ఏడుస్తుంది. డబ్బు ఎవరు ఇస్తారని ఫ్రెండ్స్‌ని అడగాలని చాలా మందికి ఫోన్లు చేస్తుంది. అంత డబ్బు కష్టం అని అందరు అనేయడంతో జాను చాలా ఏడుస్తుంది. అదేసమయంలో  కిన్నెరకు ఊపిరి సరిగా అందక చాలా ఊపిరిఎత్తేస్తుంది. జాను, నందు, శారద,  మురళీ హడావుడికి  ఐసీయూకి తీసుకెళ్తారు. డాక్టర్ ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ బయటకు వచ్చి జాను వాళ్లని తిడుతుంది. గుండెల్లో రెండు హోల్స్ ఉన్నాయి. ఆపరేషన్ చేయాలంటే సరే అన్నారు.. ఇప్పటికీ డబ్బు కట్టలేదు.. విదేశాల నుంచి డాక్టర్ వచ్చారు. అన్నీ రెడీ చేస్తే మీరు లేట్ చేస్తున్నారు. పాప ప్రాణాల మీదకు తెస్తున్నారని తిడుతుంది. పాపని మీరు ఇంటికి తీసుకెళ్లిపోండి అని చెప్పి పంపేయమని చెప్పడంతో జాను డాక్టర్‌ని బ్రతిమాలుతుంది. చాలా ఆలోచించి సంజయ్‌ కండీషన్ గుర్తుచేసుకొని అరగంటలో డబ్బు కడతానని చెప్తుంది. బావ నేను వచ్చే వరకు నువ్వు అక్కా వాళ్లకి కనిపించకని మురళీతో జాను చెప్పి సంజయ్ దగ్గరకు పరుగులు తీస్తుంది. 

సంజయ్ దగ్గరకు జాను వెళ్తూ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన సూర్యని చూస్తుంది. సూర్య అని లోపలికి వెళ్తూ నిత్యని చూసి ఆగిపోతుంది. సూర్యకి నిత్య ముద్దు పెట్టి.. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను బావ అని అంటుంది. ఇక డాక్టర్ రావడం చూసిన జాను ఏమైందని అడుగుతుంది. సూర్యకి యాక్సిడెంట్ అయిందని డాక్టర్ అంటారు. ఇక డాక్టర్‌ నిత్యతో నీ భర్తని చాలా బాగా చూసుకుంటున్నావ్.. నువ్వు గ్రేట్ అని మాట్లాడటం విన్న జాను సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు పారుకి ఫుల్‌ ఫీవర్ వస్తుంది. శివుడు పారుకి మందులు వేసుకోమని అంటే శివుడు సంజు పెళ్లి నేను చూస్తానా.. చూడకముందే పోతానా.. మాట వరసకి పెళ్లి చేసుకుంటా అన్నాడు కానీ తను చేసుకోడు.. నేను పోయిన తర్వాత నా ఫొటోకి దండ వేసి ఐలవ్‌యూ అమ్మమ్మా,, ఐ మిస్‌యూ అమ్మమ్మా అంటాడు అంతే కదా అని ఏడుస్తుంది. ఇలా మాట్లాడకు పారు అని శివుడు మందులు ఇస్తాడు. దూరం నుంచి సంజు ఆ మాటలు విని చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Godhavari today episode 117, Star Maa Godhavari September 20 episode, Godhavari Surya accident Simhadri plan, Godhavari Janu Kinnera operation money twist, Godhavari Janu sees Surya Nithya hospital]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com