
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu . ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 187 లో....శైలు ప్రెగ్నెంట్ అని చెప్పి పెళ్లి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అందరికి అసలు విషయం చెప్తుంది. నేను ప్రెగ్నెంట్ కాదు నాన్నా, మీరు సడెన్ గా పెళ్లి అని బలవంతంగా తాళి కట్టించబోతే ఏం చెప్పాలో తెలీక అలా చెప్పేశా అని తండ్రి ముందు ఒప్పుకుంటుంది శైలు. దానికి కేశవ ఫుల్ సపోర్ట్ గా.. శైలు నాది, ఎప్పటికీ నేనే తాళి కడతా, మళ్లీ ఎవరైనా పెళ్లి ఏర్పాట్లు చేస్తే అనగానే.. చంపేస్తా అని శైలునే కంప్లీట్ చేస్తుంది. చక్రి విజిల్ కొడతాడు. సురేష్ గాడు కోపంతో శైలు మీద చేయి ఎత్తబోతే.. శైలు మీద చేయి పడితే చంపేస్తానని కేశవ వార్నింగ్ ఇస్తాడు.
ఆ గొడవ అయ్యాక కేశవ, శైలు బయటకు వచ్చి ప్రైవేట్ గా మాట్లాడుకుందామనుకుంటే చక్రి వెనకాలే వస్తాడు. డ్యూడ్ కాస్త దూరంగా ఉండు, మాకు ప్రైవసీ కావాలని శైలు అంటే చక్రి దూరంగా బైక్ మీద కూర్చుంటాడు. ఏరా ముంగీసా టెన్షన్ పడ్డావా అని శైలు అడిగితే చచ్చిపోయా టెన్షన్ తో అని కేశవ అంటాడు. నిన్ను కూడా టెన్షన్ పెట్టాలని అబద్ధం చెప్పా అని నవ్వుతూ హగ్ ఇస్తుంది శైలు. అది చూసి చక్రి షాక్ అయ్యి ముసిముసి నవ్వులు నవ్వుకుని తెలియనట్టు ఫోన్ చూస్తున్నట్టు నటిస్తాడు. తర్వాత ఇంటికి వచ్చాక పెద్ది.. నిజం తెలుసుకోకుండా కొట్టాను క్షమించురా అని అంటాడు. నేను బాబాయ్ ని అవ్వడం లేదా అని కన్నా అంటాడు. ఇక కన్నా చెవి మెలేసి పంపిస్తుంది మహా.
రాత్రికి చక్రి గోడ మీద కూర్చుని పాటలు వింటుంటే మహా వచ్చి భయపెడుతుంది. ఒకే హెడ్ సెట్ చెరో చెవిలో పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటారు. ఏం మొక్కుకున్నారని చక్రి అడుగుతాడు. పెద్ది కోసమని మహా అంటుంది, చక్రి మాత్రం మనసులో.. జీవితాంతం మీరు నాతోనే ఉండాలని అనుకుంటాడు. పైకి మాత్రం జాబ్ రావాలని అని చెప్తాడు. ఇంకో పక్క శైలు ఇంట్లో వాళ్ళు సడెన్ గా ప్రేమ ఒలకబోస్తారు, చికెన్ తిను అంటారు. కానీ మళ్లీ నా ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు పెళ్లి చేద్దామా అనగానే శైలుకు అర్థమైపోతుంది. వాళ్లకి ఇల్లే లేదు కదమ్మా అంటే ఏం లేకపోయినా వాడు మనసులో ఉన్నాడని తెగేసి చెప్తుంది. చివర్లో కేశవ ఫోన్ చేస్తే కోపంతో కట్ చేసి, వాడు తిరిగి చేయలేదని మళ్లీ తనే చేసి తిడుతుంది శైలు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





