Home

»

Tv News

Illu illalu pillalu : ప్రేమ, ధీరజ్ లవ్-హేట్ ట్రాక్ మజా!

Aug 24, 2026 10:32AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 559 లో.....ప్రేమ అలిగి కోచింగ్ సెంటర్ దగ్గరే కూర్చుంటే ధీరజ్ వచ్చి తీసుకెళ్దామని చూస్తాడు. ఇద్దరి మధ్య మామూలే, నువ్వు నలుగురిలో మాట జారావని ప్రేమ, నువ్వు బ్రహ్మరాక్షసి అని ధీరజ్ తిట్టుకుంటారు. మాట పెరిగిపోయేసరికి ధీరజ్ నర్మదకు ఫోన్ చేస్తాడు. నర్మద వచ్చి ఇద్దరిని తిడుతుంది. ఈ టైమ్ వరకు రోడ్డు మీద ఉండటం కరెక్ట్ కాదని. అంతలో ఒక పోరగాడు వచ్చి ప్రేమను ఏడిపిస్తే, ప్రేమ వాడిని చితకబాదేస్తుంది. అది చూసి ధీరజ్ భయపడిపోతే, నర్మద నవ్వుతూ.. నీ పరిస్థితి కూడా అంతే అని భయపెడుతుంది. చివరికి ఆ ఏరియా డేంజర్ అని చెప్పి ధీరజ్ చేతే ప్రేమను డ్రాప్ చేయిస్తుంది నర్మద.

 

కారులో కూడా వాళ్ళ గొడవ ఆగదు. ప్రేమ కావాలని ధీరజ్ పక్క సీట్లోనే కూర్చుంటుంది. దారి పొడుగునా మాడిపోయిన దోశ, ఎండిపోయిన పూరీ అని ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఇంటికి వస్తారు.  మధ్యలో నర్మద చెవులు మూసుకుని భరిస్తుంది. ఇటు ఇంట్లో చందు లెక్కలు చూస్తే ఆరు లక్షలు తేడా వస్తుంది. వర్మకు కాల్ చేస్తే ఎనిమిది లక్షలు ఇచ్చానంటాడు. ఆ మాట వినగానే వల్లికి గుండె జారిపోతుంది, ఎందుకంటే ఆ డబ్బు తనే చింతామణికి ఇవ్వడానికి తీసుకుంది. దొరికిపోతానని భయపడి, అమాయకంగా నటిస్తూ ఆ తప్పంతా తిరుపతి బాబాయ్ మీదకు తోసేస్తుంది. డబ్బులు వసూలు చేసేది ఆయనే కదా అని చందు మైండ్ డైవర్ట్ చేస్తుంది.

 

అటు ఇంటి బయట వేదవతి, శారదాంబ ఇద్దరూ ప్రేమ, ధీరజ్ ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఎదురుచూస్తుంటారు. కారు రావడం చూసి.. హమ్మయ్య ఇద్దరూ కలిసొచ్చారని సంబరపడతారు, కానీ ధీరజ్ మాత్రం.. జాలి పడి తీసుకొచ్చా అంతే అని బిల్డప్ ఇస్తాడు. ఇంట్లోకి వచ్చాక కూడా మళ్ళీ చిన్న చిన్న తిట్టుకోవడాలు స్టార్ట్ చేస్తారు. అది చూసి నర్మద.. వీళ్ళు కోపంతో తిట్టుకోవట్లేదు.. ప్రేమతోనే తిట్టుకుంటున్నారు.. వాళ్ళ తిట్ల దండకంతో నా చెవులు పోయాయని చెప్తుంది. దాంతో వేదవతి నవ్వుకుంటూ.. పోనీలే, ఎలాగైనా కలిసుంటే చాలు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com