Home

»

Tv News

Podharillu: మహా, ఆదిల మధ్య రాఖీ సెంటిమెంట్..

Sep 1, 2026 10:27AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  పొదరిల్లు  Podharillu. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 196 లో.. గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా తన అన్నయ్య ఆది ఇచ్చి వెళ్లిన బంగారు గొలుసు తెగి కింద పడటంతో మహా చాలా ఎమోషనల్ అవుతుంది. ఒకప్పుడు తానంటే ఎంతో ప్రాణమిచ్చే అన్నయ్య, ఇప్పుడు తనకు పూర్తిగా దూరమయ్యాడని తలచుకుని బాధపడుతుంది. తనను ఎంతగానో ప్రేమించే అన్నయ్యతో ఈ దూరం రావడానికి చక్రియే కారణమని అతనిపై కోపాన్ని ఆవేదనను బయటపెడుతుంది. మరోవైపు ఆది కూడా తన చెల్లెలు మహాని గుర్తు చేసుకుంటాడు. ఫైల్స్ వెతుకుతున్న సమయంలో కిందపడిన డబ్బాలో నుంచి మహా తనకు గతంలో కట్టిన రాఖీలు బయటపడతాయి. వాటిని చూస్తూ ఆది కన్నీరు పెట్టుకుంటాడు. ప్రతీ ఏటా తన చెల్లి ఎంతో ఆశగా వచ్చి రాఖీ కట్టేదని, ఇప్పుడు ఆ డ్రైవర్ గాడితో వెళ్లిపోయి తనకు దూరమైందని హారిక దగ్గర తన బాధను పంచుకుంటాడు ఆది.

 

ఇక తాయారు తన అన్న రమణయ్యకు రాఖీ కట్టి, తన భర్త నారాయణకు కూడా రాఖీ కట్టాలని నిర్ణయించుకుంటుంది. గాయత్రి చేసిన బ్లాక్‌మెయిల్ వల్లనే తాయారు ఈ పనికి ఒప్పుకుంటుంది. అయితే దీనిని కూడా తమ స్వార్థానికి వాడుకోవాలని రమణయ్య కుట్ర పన్నుతాడు. నారాయణకు రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ కింద ఇంటి పేపర్లపై సంతకం చేయించుకోవాలని రమణయ్య, తాయారుకు సలహా ఇస్తాడు.మహాలక్ష్మి పడుతున్న బాధను చూసిన చక్రి, ఆమెను ఎలాగైనా సంతోషపెట్టాలని అన్నయ్యతో రాఖీ కట్టించి ఇద్దరిని కలపాలని అనుకుంటాడు. వెంటనే హారికకు ఫోన్ చేసి మహా బాధపడుతున్న విషయాన్ని చెప్తాడు. ఆది కూడా చెల్లెలి జ్ఞాపకాలతో బాధపడుతున్నాడని గ్రహించిన హారిక.. చక్రి ప్లాన్‌కు సాయం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆదిని బయటకు తీసుకువస్తానని మాటిస్తుంది.

 

ఉదయాన్నే తాయారు తన అన్నయ్య రమణయ్యకు రాఖీ కడుతుంది. ఆ తర్వాత గాయత్రి కోపంగా చెప్పడంతో అలాగే రమణయ్య సైగ చేయడంతో నారాయణ మామయ్యకు కూడా రాఖీ కట్టడానికి సిద్ధమవుతుంది తాయారు. తన అన్నయ్యతో బాండింగ్ బాగుందని చెప్తూనే, ఇంకో పక్క నారాయణపై ప్లాన్ అమలు చేయడానికి అడుగులు వేస్తుంది. ఇంట్లో పని చేసుకుంటున్న మహాలక్ష్మి వద్దకు వచ్చి చక్రి ఒక సర్ ప్రైజ్ ఉందంటూ బయటకు వెళ్దామని పిలుస్తాడు. ఆమెను ఎలాగైనా అన్నయ్య ఆది దగ్గరకు తీసుకెళ్లి రాఖీ కట్టించి ఇంప్రెస్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అంతలోనే గాయత్రి హడావిడిగా వచ్చి తన తల్లి తాయారు నారాయణ మామయ్యకు రాఖీ కట్టడానికి వస్తోందని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com