Home

»

Tv News

Bigg Boss Agnipariksha season 2:యష్మీ గ్లామరస్ ఎంట్రీతో హీటెక్కిన అగ్నిపరీక్ష స్టేజ్..

Sep 1, 2026 10:31AM

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆదివారం ఎపిసోడ్‌లో యష్మీ గౌడ ఎంట్రీతో హౌస్‌లో గ్లామర్, ఎనర్జీ ఒక్కసారిగా పెరిగిపోయింది. రోహిత్ డేంజర్ జోన్ నుంచి సేవ్ అయిన వెంటనే యష్మీ సందడి చేస్తూ వచ్చింది. టెన్షన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు రిలీఫ్ ఇస్తూ నలుగురు లేడీ కంటెస్టెంట్లకు స్పెషల్ ఛాన్స్ ఇస్తానని అంది.

 

యష్మీ ఛాలెంజ్‌తో అమ్మాయిలంతా ఫుల్ జోష్‌లోకి వచ్చారు. ప్రియాంక తన అద్భుతమైన డ్యాన్స్‌తో ఆకట్టుకోగా.. ఝాన్సీ మధురమైన గాత్రంతో పాట పాడింది. శ్రష్టి, అపూర్వలు డ్యాన్స్, ర్యాంప్ వాక్‌తో అదరగొట్టారు. రాజకుమారి తన యాక్టింగ్ టాలెంట్‌ను చూపించి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించింది.

 

పర్ఫామెన్స్ ల తర్వాత యష్మీ తన వ్యక్తిగత ఎంపికగా రాజకుమారిని ఎంచుకుంది. అయితే జ్యూరీ మాత్రం ప్రియాంక టాలెంట్‌కు ఫిదా అయి ఆమెను సెలెక్ట్ చేసింది. దీంతో రాజ్ కుమారి vs ప్రియాంక మధ్య ఫైనల్ ఫైర్ టాస్క్‌కు రంగం సిద్ధమైంది.

 

ఫైనల్ టాస్క్‌లో ప్రియాంక తన అసలు సత్తా చాటింది. టాస్క్‌ను అద్భుతంగా పూర్తి చేసి జ్యూరీతో పాటు యష్మీని కూడా మెప్పించింది. దీంతో ఆమె డేంజర్ జోన్ నుంచి సేఫ్ అవ్వడమే కాకుండా, పవర్‌ఫుల్ ఫైర్ కార్డ్‌ను కూడా గెలుచుకుంది. ఓవరాల్‌గా యష్మీ ఎంట్రీ ప్రియాంకకు కలిసొచ్చిందని చెప్పాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com