
బిబి జోడి సీజన్ 2 గ్రాండ్ ఫినాలే పూర్తయిపోయింది. నాలుగు జోడీలు ఫినాలే లోకి ఎంట్రీ ఇచ్చాయి. మానస్ - స్రష్టి వర్మ అమరదీప్ - నైనికా, నేహా - విశ్వ, శ్రీసత్య- అర్జున్ కళ్యాణ్. అందరూ పోటాపోటీగా డాన్స్ చేశారు. ఇక థర్డ్ పొజిషన్ లో అమరదీప్ - నైనికా సెకండ్ పొజిషన్ లో నేహా - విశ్వ ఉండగా విన్నర్ గా మానస్ - స్రష్టి వర్మ నిలిచారు. టైటిల్ తో పాటు 15 లక్షల క్యాష్ ప్రైజ్ ని విన్ అయ్యారు. ఇక స్రష్టి వర్మ ఏడ్చేసింది. "మానస్ కి థ్యాంక్స్ చెప్పాలి నా పార్టనర్ గా ఉన్నందుకు.. ప్రతీదాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్లడం అనేది చాలా కష్టమైన పని. కానీ మన గురించి మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇదంతా చేయాల్సి వస్తుంది " అంటూ ఏడుస్తూ చెప్పింది.
.webp)
ఇక మానస్ కూడా మాట్లాడాడు " కంటెస్టెంట్ దగ్గర నుంచి నాకు స్రష్టి కావాలనే అనుకున్నా ఎందుకంటే తనలో కసి ఉంది. చాలామంది అన్నారు స్రష్టి ఎందుకు నెగటివిటీ ఉంది వద్దు అన్నారు. కానీ నేను మాత్రం స్రష్టి వర్మనే కావాలి అని పట్టు బట్టాను. ఎలాగైనా నేను ప్రూవ్ చేసుకోవాలి అందరి నోర్లు మూయించాలి అనుకుంది అలాగే కసితో డాన్స్ చేసింది. నేను స్రష్టి వర్మ కలిసి ఒక సాంగ్ చేసాం అక్కడి నుంచి మా ధ్యాస ఒక్కటే..బిబి జోడి టైటిల్ విన్ అవ్వాలని అంతే " అన్నాడు.






