Home

»

Tv News

Karthika Deepam2 : దీపకి షాకిచ్చిన శివన్నారాయణ.. మూడు రోజుల్లో సూరజ్, జ్యోత్స్న పెళ్లి!

Aug 23, 2026 10:42AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-756 లో.. కంపెనీ బోర్డు మీటింగ్ లో అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటారు. ఇక నుండి దీపే శాశ్వత సీఈఓ అని శివన్నారాయణ చెప్తాడు. ఇది విని దాస్, ఇతర మెంబర్లు ఆశ్చర్యపోతారు. దీప మాత్రం .. నా వల్ల కాదు అంటూ సైన్ చేయడానికి భయపడుతుంది. కార్తీక్ మాత్రం ఆమెకు ధైర్యం చెప్తాడు. సీఈఓ పదవికి లాయర్ ఒక పెద్ద కండిషన్ పెడతాడు. దీప ఒకవేళ మధ్యలో పదవి వదిలేస్తే 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాలని పేపర్లో ఉంటుంది. ఇది విని కార్తీక్ .. 10 కోట్లా అని షాక్ అవుతాడు. కంపెనీని కాపాడటానికే ఈ రూల్ పెట్టామని శివన్నారాయణ చెప్తాడు. దీపకు ఇది పెద్ద టెన్షన్ అవుతుంది.

దీప ఇంకా టెన్షన్ లోనే ఉంటుంది. ఇంత పెద్ద బాధ్యత నేను మోయగలనా అని కార్తీక్ తో చెప్తుంది. నువ్వు చేయగలవు దీపా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని ధైర్యం ఇస్తాడు కార్తీక్. నువ్వు ఉంటేనే కంపెనీ సేఫ్ గా ఉంటుందని దీపతో కార్తీక్ అంటాడు. దీంతో దీప కొంచెం ఆలోచనలో పడుతుంది. మరోవైపు ఇంట్లో పెళ్లి వార్త వస్తుంది. 3 రోజుల్లో సూరజ్, జ్యోత్స్న పెళ్లి అని సుమిత్ర అనౌన్స్ చేస్తుంది. సూరజ్ చాలా సంతోషిస్తాడు. జ్యోత్స్న మాత్రం.. అంత తొందరగా పెళ్లా అని కంగారు పడుతుంది. జ్యోత్స్న వాళ్ల అమ్మ.. మంచి ముహూర్తం ఉంది తల్లి అని చెప్పి ఒప్పిస్తుంది.

దీప దగ్గరికి సూరజ్ వస్తాడు. అక్కా మొదటి శుభలేఖ నీకే ఇస్తా, ఇది నా చిన్న గిఫ్ట్ అని చెప్తాడు. దీప కళ్లలో నీళ్లు వస్తాయి. నీ వల్లే నా పెళ్లి జరుగుతుంది అక్కా అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న మాత్రం మనసులో ఏదో దాచుకుని.. ఈ పెళ్లి జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్లి పనులు మొదలవుతాయి. ఎపిసోడ్ చివర్లో అందరూ దీప సైన్ కోసం ఎదురు చూస్తారు. సైన్ చెయ్యి దీపా అని కార్తీక్ అంటాడు. దీప పెన్ను పట్టుకుంటుంది. దాస్ మాత్రం మనసులో ..‌దీప సీఈఓ అయితే నా ప్లాన్ అంతా పోతుందని ప్లాన్ వేస్తాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Karthika Deepam2 Today Episode, Suraj jyotsna Marriage, Karthik, Deepa, 756 episode, Deepa Permanent CEO

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com