Home

»

Tv News

Jayam serial : గోరింటాకు వేడుకలో ఇషిక ప్లాన్ రివర్స్.. సీసీటీవీతో బయటపడే నిజం ఏంటి?

Aug 23, 2026 10:34AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -354 లో.....అందరు గోరింటాకు పెట్టుకోవడానికి రెడీ అవుతారు. జయకి వంశీ గోరింటాకు పెట్టకుండా స్నేహ పెట్టేలా గంగ చేస్తుంది. ఇప్పుడు అందరికి గోరింటాకు పెట్టడానికి ఉన్నారు కానీ ప్రమీల అక్కకి ఎవరున్నారని జయ అనగానే ప్రమీల బాధపడుతుంది. తను లోపలికి వెళ్తుంది.. సుధా నీ కూతురికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదని కాస్త నేర్పించమని శకుంతల కోప్పడుతుంది.

ప్రమీల వెనకాలే గంగ, రుద్ర వెళ్తారు. మీరు  ఈ ఇంట్లో జరిగే ప్రతి పండుగలో భాగం కావాలని రుద్ర చెప్తాడు. దాంతో ప్రమీల వాళ్లతో పాటు గోరింటాకు పెట్టుకోవడానికి వస్తుంది. అందరు మగవాళ్ళు తమ భార్యలకి గోరింటాకు పెడుతారు. ప్రమీలకి శకుంతల గోరింటాకు పెడుతుంది. గంగకి రుద్ర గోరింటాకు పెడతాడు. కాసేపట్లో గంగ చేతులు ఇరిటేషన్ వస్తాయి. ఎందుకు అంటే అందులో కెమికల్ కలిపానని జయతో ఇషిక అంటుంది. కానీ గంగకి కాకుండా ఇషికకి ఇరిటేషన్ వస్తుంది. అప్పుడే రంగ, గంగ వస్తారు. ఏంటి నువ్వు గోరింటాకులో మందు కలపడం మేము చూడలేదనుకున్నావా అని రంగ తను కెమికల్ కలుపుతున్న వీడియోని చూపిస్తాడు. అది చూసి ఇషిక సారీ చెప్తుంది.

ఆ తర్వాత అందరి గోరింటకు పండుతుంది. జయ గోరింటాకు పండదు. ఆ తర్వాత అసలు ఈ రోజు సరదాగా జరిగింది దానికి కారణం గంగ అని సుధా అంటుంది. మరొకవైపు ఇషిక గోరింటాకు కడుక్కుందని సూర్య కోప్పడతాడు. తరువాయి భాగంలో మన ఇంటికి ఎవరో వచ్చారు. స్టోర్ రూమ్ లో ఈ తాడు ఉంది.. చెప్పులున్నాయి నేను ఇంటికి వస్తుంటే బయట ఒక పెద్దకర్ర ఉందని రుద్ర చెప్తాడు. సీసీటీవీ చూద్దామని గంగ అంటుంది. రుద్ర సీసీటీవీ చూస్తుంటే వీరు టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Jayam serial, Zee Telugu serial updates, Ganga Ranga Ishika, Jayam serial latest episode, TeluguOne entertainment

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com