Home

»

Tv News

Karthika Deepam2 : పీటలపై ఆగిన పెళ్ళి.. సూరజ్ నా కొడుకంటూ బాంబు పేల్చిన మాలిని!

Aug 29, 2026 8:10AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 763లో.. పెళ్లి పీటలపై నుంచే జ్యోత్స్న అందరి ముందూ నిజం చెప్పేసినట్లు కనిపిస్తుంది. ఏవండీ.. దీప మన కూతురండీ అంటూ సుమిత్ర కన్నీళ్లతో దీపను ఆత్మీయంగా హత్తుకుంటుంది. జ్యోత్స్న కార్తీక్‌తో ఉన్న అగ్రిమెంట్ కాగితాన్ని అందరి ముందూ చింపేసి..దీపా.‌. నీ రుణం కొంతైనా తీర్చుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు మీ అమ్మని ధైర్యంగా అమ్మా అని పిలువమని చెప్తుంది. దీప ఎంతో ఆనందంతో సుమిత్రను అమ్మా అని పిలిచి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

 

దీప కళ్లెంబడి ఆనందబాష్పాలు తుడిచిన కార్తీక్.. ఏంటి దీపా.. ఈ కన్నీళ్లు అని అడగ్గానే దీప ఒక్కసారిగా ఆ కల నుంచి బయటకు వస్తుంది. కార్తీక్ ఆశ్చర్యపోతూ.. ఏమైంది దీపా? నువ్వే శివన్నారాయణ గారి మనవరాలివని జ్యోత్స్న అందరికీ చెప్పేసినట్టు కల కన్నావా అని అడుగుతాడు. దానికి దీప.. అవును బావా.. జ్యోత్స్న అన్నది అంటే చేస్తుంది కదా. ఊహే ఇంత అందంగా ఉంటే నిజం ఇంకెంత అందంగా ఉంటుందోనని అంటుంది. నువ్వు ఊహించిన దానికంటే అందంగా ఉంటుందిలే కానీ.. వెళ్లి మీ అత్త మాలిని పక్కన కూర్చో.. జ్యోత్స్న మెడలో మూడు ముళ్లు పడే వరకూ ఈ పెళ్లి మన బాధ్యత అని దీపని పంపిస్తాడు కార్తీక్. మరోవైపు వీరిద్దరి కదలికలపై నిఘా పెట్టిన శ్రీధర్.. వీడేదో గట్టిగానే ప్లాన్ చేశాడు.. ఇక్కడేదో జరగబోతుంది.. ఆ ఊహించని షాక్‌ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని మనసులో అనుకుంటాడు. కార్తీక్ కూడా వెళ్లి మాలిని పక్కన కూర్చోగానే. ఏంట్రా.. అటు దీప, ఇటు నువ్వూ నన్ను రౌండప్ చేశారు? మీ తాత నాపై భయంతో కాపలా పెట్టాడా ఏంటని అడుగుతుంది. భయపడటానికి నువ్వేమైనా రాక్షసివా అత్తా? మామూలు మనిషివే కదా.. పైగా పెళ్లికూతురు అత్తవి అని దీప అంటుంది.

 

 

మరోపక్క సూరజ్, జ్యోత్స్నల పెళ్లి తంతు వేగంగా జరుగుతూ ఉంటుంది. పెళ్లి అయిన తరువాత అందరం కలిసి బంతి భోజనం చేద్దాం.. పాపం తాతయ్య మిస్ అయ్యారు కానీ, పెళ్లి వీడియో ఫస్ట్ కాపీ ఆయనకే పంపిద్దామని మాలినితో కార్తీక్ ,దీప అంటారు. దానికి మాలిని చిన్నగా నవ్వి.. బాగానే సంబరపడుతున్నారురా అని అంటుంది. సూరజ్‌ని పెంచిన ఆ పెద్ద మనిషిని చూడు అత్తా, ఎంత ఆనందిస్తున్నాడో అంటే, మాలిని శంకిస్తూ.. అతను పెంచడం నువ్వు ప్రత్యక్షంగా చూశావా అని అడుగుతుంది. మనుషుల్ని నమ్మాలి పిన్నీ అని కార్తీక్ అంటే అవునవును.. నమ్మితేనే కదా మోసం చేసేదని మాలిని బదులిస్తుంది. సూరజ్ అనాథ కాదు పిన్నీ.. మా అమ్మనాన్నలే ఇప్పుడు సూరజ్‌కి కూడా అమ్మానాన్నలు. సూరజ్ నాకు తమ్ముడు అని కార్తీక్ చెప్తాడు. హో.. నేను పిన్నిని, సూరజ్ తమ్ముడా? వరుస బాగానే సరిపోయిందిరోయ్ అని అంటుంది. నీలాంటి వాళ్లతో సూరజ్‌ని పోల్చుకోవద్దు పిన్నీ! సూరజ్ లాంటి నిజాయితీ నువ్వు సంపాదించుకోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలని కార్తీక్ అంటాడు. అవును అత్తా.. సూరజ్ ఉత్తముడు, వీరుడు, ధీరుడు అంటూ దీప అంటుంది. బావుంది కానీ.. ఈ ఉత్తముడితో జ్యోత్స్న పెళ్లి జరుగుతుందంటారా.. మధ్యలోనే ఆగిపోతుందంటారా అని మాలిని అడుగుతుంది. ఎవ్వరు అడ్డొచ్చినా ఈ పెళ్లి ఆగదు పిన్నీ.. తథాస్తు దేవతలు దిగొచ్చినా ఆగదు. కళ్లముందే తాళి కడుతున్నాడు చూడు అని కార్తీక్ అంటాడు. అయినా ఈ పెళ్లి ఆగదంటావా అని మాలిని అనడంతో.. నీకేమైనా మతిపోయిందా అత్తా? ఓ పక్క పెళ్లి జరుగుతుంటే అవుతుందా అవ్వదా అంటారేంటని దీప అంటుంది. జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కట్టబోయే సరిగ్గా ఆ క్షణంలో హఠాత్తుగా ఆగిపోతాడు. శివన్నారాయణ, జ్యోత్స్నలతో పాటు అందరు తాళి కట్టమని బతిమాలినా సూరజ్ వినకుండా ఆ తాళిని జ్యోత్స్న ఒడిలో పడేసి పీటలపై నుండి లేచిపోతాడు. అంతా షాక్‌లో ఉండగా మాలిని ముందడుగు వేసి సూరజ్ నా కొడుకురా కార్తీక్! నా కొడుకని తెలిసినా ఈ పెళ్లి జరుగుతుందా అని అంటుంది. శివన్నారాయణ కుటుంబం మొత్తం ఈ మాట వినగానే ఉలిక్కిపడి అవాక్కవుతుంది. సూరజ్ అనాథ కాదు.. నా భర్త కృష్ణమూర్తి, నా యొక్క ఒక్కగానొక్క కొడుకు.. ఆ పెంచిన పెద్ద మనిషి నా మనిషే.. ఇదంతా నేను ఆడించిన నాటకం. నా పగకు నిలువెత్తు రూపమే నా కొడుకు సూరజ్ అని మాలిని అసలు నిజాన్ని చెప్పేస్తుంది. శివన్నారాయణ గారి మనవరాలి పెళ్లి ముచ్చటగా మూడోసారి ఆగిపోయింది.. ఇక మీరంతా ఇక్కడి నుంచి వెళ్లొచ్చని బంధువులకు తేల్చి చెప్పేస్తుంది మాలిని. దాంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అవుతారు.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com