Home

»

Tv News

Brahmamudi : వరలక్ష్మీ వ్రతంలో అక్షింతలు వేయకుండానే పారిపోయిన రాజ్..

Aug 29, 2026 8:18AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 1123 లో.... వ్రతం, పూజ ఉంది.. నువ్వు నాతో పాటు ఉండాలని రాజుని ఇందు రిక్వెస్ట్ చేస్తుంది. వద్దని రాజు మొదట చెప్పిన వెంకీ కోసం డబ్బు ఎలా సర్దాలని ఆలోచిస్తుండగా ఇందు పేమెంట్ ఇస్తానని ఆఫర్ ఇస్తుంది. దీంతో కాస్త బిల్డప్ ఇచ్చి క్యారెక్టర్ ఏమైనా ఛేంజ్ అవుతుందా అని అడిగి సైడ్ ఆర్టిస్ట్ లా నిల్చుంటే చాలు అని ఇందు చెప్పడంతో రాజ్ ఒప్పుకుంటాడు. వ్రతం వరకే చెప్పాను.. అక్షింతల గురించి రేపు చెప్తా.. ఏ ఆటంకం రాకుండా చూడు తల్లీ అని ఇందు అమ్మవారిని మొక్కుకుంటుంది.

 

మరోవైపు రాజు, ఇందు రారని ఐశ్వర్య చెప్తుంటే అపర్ణ హడావిడి చేస్తోందని భ్రమరం అంటుంది. ఇందు వస్తుంది, రాజు రాడు అని ఐశ్వర్య ఊహిస్తుంది. కానీ ఇద్దరు ట్రెడిషనల్ లుక్ లో కిందకు రావడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇప్పుడు వచ్చినా చివరి వరకు ఏదో వంక చెప్పి తప్పించుకుంటాడు చూడండి అంటూనే ఉంటుంది. పంతులు ఇంకా ఎవరైనా వ్రతంలో కూర్చునే వారు ఉన్నారా అని అడగ్గానే అపర్ణ ఐశ్వర్యను పిలుస్తుంది. నమ్మకం లేదని ఐశ్వర్య అనగానే కోటీశ్వరుడు భర్త రావాలని కోరుకుందాంరా అని ఇందు ఐశ్చర్య వీక్ పాయింట్ మీద కొట్టడంతో ఐశ్వర్య కూడా వ్రతంలో కూర్చుంటుంది. వ్రతం జరుగుతుండగా అందరి మనసులో కోరికలు నడుస్తుంటాయి. దొంగ పెళ్లి నిజం కావాలని, రాజు తన భర్త అవ్వాలని ఇందు కోరుకుంటుంది. కోటీశ్వరుడు రావాలని ఐశ్వర్య కోరుకుంటుంది. ఆస్తి మొత్తం తన పేరు మీదకు రావాలని రేఖ కోరుకోగా.. రాజు, ఇందుల పెళ్లి జరగాలని అపర్ణ కోరుకుంటుంది. పూజ పూర్తయ్యాక భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని పంతులు చెప్పడంతో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. భూషణ్ నుంచి రేఖ, శేషు నుంచి భ్రమరం ఆశీర్వాదం తీసుకోగా, రాజు మాత్రం చచ్చినా అక్షింతలు వేయకూడదని లోలోపల అనుకుంటాడు.

 

రాజుని ఇరికించడానికి ఇదే ఛాన్స్ అని ఐశ్వర్య - నువ్వు నీ భార్యని ఆశీర్వదించవా..ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ కదా అని ఐశ్వర్య అంటుంది. ఏం అడ్డం వస్తోందని శేషు అడగ్గా.. భార్యాభర్తల బంధమే అడ్డం వస్తోందని ఐశ్వర్య అంటుంది. చివరికి తప్పక ఆశీర్వదిస్తానని రాజు అక్షింతలు చేతిలోకి తీసుకుంటాడు. ఇందు సంబరపడుతుండగానే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందని చెప్తారు. దీంతో రాజు చేతిలో అక్షింతలను పక్కకు పారేసి కంగారుగా వెళ్లిపోతాడు. నేను ముందే చెప్పాను కదా అని ఐశ్వర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com