Home

»

Tv News

Jayam serial: జయకు స్పాన్సర్ షిప్, ప్రీతికి బాబు.. వీరు కొత్త కుట్ర!

Sep 17, 2026 10:46AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 375 లో.. విశ్వ వాళ్ళ ఇంటికి బాక్సింగ్ పోటీ స్పాన్సర్స్ వస్తారు. విశ్వ, సుధా, జయ ఇంకా లక్ష్మీ, పైడిరాజు అంతా హాల్లో ఉంటారు. ఈ సారి ఎలాగైనా మీ కూతురు జయని ఛాంపియన్ ని చేస్తారనే నమ్మకంతో ఆమెకు స్పాన్సర్ షిప్ ఇవ్వడానికి వచ్చామని వాళ్ళు అనగానే కచ్చితంగా జయనే ఈ సారి చాంపియన్ అవుతుంది. తను చాలా కష్టపడుతుందని విశ్వ చెప్పడంతో.. ఒకే సర్ మీరు ట్రైనింగ్ ఇవ్వండి..‌మేం వెళ్ళొస్తామని చెప్పేసి స్పాన్సర్స్ వెళ్తారు. విన్నావ్ గా జయ.. నేను ఎంత కాన్పిడెంట్ గా చెప్పానో నువ్వు అంతే కాన్ఫిడెంట్ గా ప్రాక్టీస్ చేసి గెలిచి చూపించాలని విశ్వ అనగానే అలాగే నాన్నగారు.. ఈ సారి గెలిచి చూపిస్తానని జయ అంటుంది.

 

ఇక ఆ మాటలన్నీ విన్న లక్ష్మీ, పైడిరాజు బాధపడతారు. మన కూతురికి దక్కాల్సినవి ఈ వగలాడికి దక్కుతున్నాయని లక్ష్మీ అనగానే దేవుడు మంచివాళ్ళకి మంచే చేస్తాడని పైడిరాజు అంటాడు. రుద్ర బాబు గంగని గెలిపిస్తాడంటి అంటూ లక్ష్మీ అంటుంది. మరోవైపు హాస్పిటల్ లో ప్రీతీ పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. ఇక తన దగ్గర వీరు ఉంటాడు. సారీ ప్రీతి స్ట్రక్ అయిపోయి..  డెలివరీ సమయంలో నీ పక్కన ఉండలేకపోయానని వీరు అంటాడు. ఏం పర్లేదండి.. రుద్ర అన్నయ్య మిమ్మల్ని తీసుకొని వస్తానని మాటిచ్చారు. అలాగే తీసుకొచ్చారని ప్రీతి అంటుంది. దాంతో వీరు కోపంగా చూస్తాడు. అవును రుద్ర బావ నన్ను చాలా బాధ్యతగా తీసుకొచ్చాడని వీరు అంటాడు. ఇన్నిరోజులు ప్రీతీని అడ్డుపెట్టుకొని చాలా పాపాలు చేశాను.. ఇకనుండి వీడిని అడ్డుపెట్టుకొని చేస్తానని వీరు అంటాడు. ఇక అప్పుడే శకుంతల, పెద్దసారు ప్రీతీ బాబుని చూడటానికి వస్తారు. రుద్ర అన్నయ్య, గంగ వదిన ఎక్కడ నాన్న అని ప్రీతీ అంటుంది.

 

వాళ్ళు బయటున్నారమ్మా అని పెద్దసారు అనగానే వాళ్ళిద్దరే మొదటగా చూడాలి.. ఎందుకంటే వాళ్ళే ప్రాణాలకి తెగించి నన్ను, నా బిడ్డని కాపాడారని ప్రీతీ అంటుంది. దాంతో పెద్దసారు వెళ్ళి రుద్ర, గంగలని తీసుకొస్తాడు.‌ఇక గంగ మొదటగా బాబుని చేతుల్లోకి తోసుకోగా తన నుండి రుద్ర తీసుకుంటాడు. చాలా సంతోషంగా ఉంది అమ్మా, మన ఇంటికి భాను వచ్చాడని రుద్ర అనగానే ఇకనుండి వాడే నా ఆశాకిరణం.. వాడే నా రక్షణకవచం అని వీరు ఇన్ డైరెక్ట్ గా మాట్లాడతాడు. దాంతో రుద్ర అది అర్థం చేసుకొని బయటకొస్తాడు. ఇక బాబుని చూడటానికి అందరు వస్తారు. మరోవైపు రుద్ర ఏడుస్తుంటే గంగ, రంగా వస్తారు. ఏంటి బావ..  ఆ కన్నీళ్ళేంటని రంగా అనగా చాలా సంతోషంగా ఉందని రుద్ర అంటాడు. ఇంతకముందు వరకు ప్రీతీని అడగుపెట్టుకొని మోసాలు, కుట్రలు చేసిన వీరు.. ఇప్పుడు తనకు పుట్టిన బాబుని అడ్డంపెట్టుకొని మరెన్ని పాపాలు చేయనున్నాడు.. వీరు ఎత్తుగడలని రుద్ర ఎలా అడ్డుకోగలడో  తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com