
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-66 లో..... రోహిత్ చేత అంజలికి రాఖీ కట్టించాలని మనీష్ రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు. నానమ్మ అంజలికి హామీ ఇచ్చింది.. రోహిత్ ని చూస్తే తమ్ముడు లాగా అనిపిస్తాడు. అందుకే రాఖీ కడతానంటే సరే కట్టిస్తానని మాటిచ్చింది. మనమంతా హ్యాపీగా ఉన్నాం.. ఇంట్లో తను ఒక్కతే హ్యాపీగా లేకపోతే ఎలా.. మంచి పనికి అత్తయ్య వద్దని ఎలా అంటుందని చెప్పి అంజలిని పిలుస్తాడు. అంజలి వచ్చి రోహిత్ కి రాఖీ కట్టబోతుంటే గీత వచ్చి అడ్డుపడి.. ఎవరు పడితే వాళ్లు నా కొడుకుకి రాఖీ కట్టొద్దంటూ రోహిత్ ని అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది.
ఆ తర్వాత రాకీ పక్కకి వచ్చి డాన్స్ చేస్తుంటే రోహిత్ వచ్చి.. ఏమైంది ఎందుకు డాన్స్ చేస్తున్నావని అడుగుతాడు. ఇండైరెక్ట్ గా అంజలి నాకు ఒకే చెప్పింది.. నిన్ను బ్రదర్ అనుకొని రాఖీ కట్టాలనుకుందంటే.. నన్ను బావ అనుకున్నట్లే కదా అని రాకీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు భవిత వాళ్లు తమకి ఇచ్చిన గిఫ్ట్స్ చూసి మురిసిపోతుంటే అంజలి మాత్రం ఏడుస్తుంది. దీంతో మనీష్ తన దగ్గరికి వెళ్లి ఓదార్చి.. నువ్వు ఏడవకు, రోహిత్ కి రాఖీ కట్టేలా చేస్తానని అని మాటిస్తాడు. ఆ తర్వాత రత్నం దగ్గరికి వెళ్లి ఎలాగైనా రాఖీ కట్టించాలని ఇద్దరు ప్లాన్ చేస్తారు.
అటుగా వెళ్తున్న రోహిత్ కి వినపడేలా.. రాఖీ కట్టకుండా ఆగిపోతే రాఖీ కట్టించుకోవాల్సిన వాళ్లకి ఏదైనా జరుగుతుందనే భయాన్ని రోహిత్ లో క్రియేట్ చేస్తారు మనీష్, రత్నం. దీంతో రోహిత్ భయపడతాడు. తరువాయి భాగంలో అంజలి దగ్గరికి రోహిత్ వచ్చి.. అక్కా రాఖీ కట్టు అంటాడు. అంజలి రాఖీ కడుతుంటే అప్పుడే గీత అక్కడికి వస్తుంది. మరి గీత చూస్తే ఏం జరుగుతుందో..రాఖీ కట్టడం పూర్తవుతుందో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
