.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. సోమవారం నాటి ఎపిసోడ్ 361 లో ఏం జరిగిందంటే.. రుద్ర వాళ్ళు భోజనం చేస్తుంటారు. అప్పుడు పెద్దసారు.. గంగ ఎక్కడ అని అడుగుతాడు. తనకి ఆకలిగా లేదట అని రుద్ర చెప్తాడు. అదంతా పైనుండి రంగా, గంగ చూస్తూ ఉంటారు. చూసావా అన్నయ్యా.. సర్ ఎలా అంటున్నారో.. ఆయన వచ్చి పిలిచేవరకు వెళ్లొద్దని గంగ అంటుంది. తర్వాత రుద్ర వచ్చి గంగ వాళ్ళని భోజనానికి పిలుస్తాడు. మేం రాము, మాకు ఆకలిగా లేదని గంగ చెప్తుంది.
గంగని నేనే వెళ్లి పిలుచుకొని వస్తానని పెద్దసారు అంటుంటే మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, నేనే వెళ్లి భోజనం ఇస్తానని రుద్ర అంటాడు. ఇది చూసిన శకుంతల.. ఆయనొకరు, వాళ్ళ మధ్య ఇంకా దూరం పెంచాలనుకుంటే, ఇలా చేస్తారని మనసులో అనుకుంటుంది. అన్నయ్య సర్ వచ్చేసరికి మనం అలిగినట్లు యాక్టింగ్ చెయ్యాలని రంగకి గంగ చెప్తుంది. గంగ కోసం రుద్ర కోపంగా గొడ్డు కారం వేసి అన్నం తీసుకొని వస్తాడు. తిను, ఇది తింటే అయినా నీకు పౌరుషం వస్తుంది.. బాక్సింగ్ కసిగా చేస్తావని రుద్ర అంటాడు. దాంతో గంగ కోపంగా ఆ భోజనం తింటుంది. వెంటనే రుద్ర మజ్జిగ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇలాంటి విషయాలు మాత్రం సీరియస్ గా తీసుకుంటావని కోప్పడతాడు.
ఆ తర్వాత రుద్ర కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ తన చేతిలోని గ్లాస్ కిందపడి పగిలిపోతుంది. దాన్ని క్లీన్ చేస్తుంటే ఒక టాబ్లెట్ కనిపిస్తుంది. గంగ కోసం రుద్ర పాలు పెట్టినప్పుడు కిచెన్ లో సౌండ్ వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటాడు. మరోవైపు గంగ కిచెన్ లో వర్క్ చేస్తుంటే తనతో పనులు చేయించాలని శకుంతల, ఇషిక ప్లాన్ చేస్తారు. వాషింగ్ మెషిన్ పాడైంది కదా, నువ్వు వెళ్లి అందరి బట్టలు ఉతుకమని గంగకి శకుంతల చెప్తుంది. మరి రుద్రకు దొరికిన టాబ్లెట్ ఏంటి. గంగ బట్టలు ఉతికే విషయంలో ఏం జరగబోతోందనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
