Home

»

Tv News

Agnipariksha season2: బాక్స్ ల టాస్క్ లో షాలిని మాస్టర్ స్కెచ్!

Sep 1, 2026 11:22AM

అగ్ని పరీక్షలో నేడు బాక్సులతో లీడర్ టాస్క్ పెట్టారు. జ్యూరీ ముందుగా చరణ్‌ను పిలిచి అన్ని బాక్సుల్ని చూసుకునే అవకాశం ఇచ్చింది. ఏ బాక్స్ ఎవరికి ఇవ్వాలో నీ ఇష్టం అంటూ పూర్తి పవర్ ఇచ్చింది. దీంతో చరణ్ తన తెలివి, సమయస్ఫూర్తితో ఆలోచించి ఒక్కొక్కరికి బాక్సుల్ని పంచాడు. అందులో ఐదు బాక్సులు లీడర్ అయ్యే అవకాశం ఉన్నవి కావడంతో తన దగ్గర ఏ బాక్స్ పెట్టుకున్నాడు.. లీడర్ బాక్సుల్ని ఎవరికి ఇచ్చాడని మిగిలిన కంటెస్టెంట్లు ఆలోచనలో పడ్డారు.

 

అయితే జ్యూరీ స్వాపింగ్ కి కేవలం ఐదు అవకాశాలు మాత్రమే ఇచ్చింది. దీంతో స్వాపింగ్ మొదలైంది. చరణ్ వద్ద ఉన్న బాక్స్ ని మిథిలేష్ తీసుకున్నాడు. మిథిలేష్ దగ్గర ఉన్న బాక్స్ ని శ్రష్టి తీసుకుంది. భాగి మాత్రం తనకు వచ్చిన బాక్స్ ని స్వాప్ చేయకుండా తన దగ్గరే ఉంచుకుంది. రాజ కుమారి రామకృష్ణ బాక్స్ ని తీసుకోగా.. రాజ కుమారి దగ్గరకు వచ్చిన బాక్స్ ని షాలిని తీసుకుంది. ఇలా ఐదు స్వాప్ లు పూర్తయ్యాయి.

 

ఈ స్వాపింగ్ లోనే పెద్ద గొడవ జరిగింది. ఎందుకు తీసుకున్నావ్ అని జ్యూరీ షాలినిని ప్రశ్నించగా.. వాళ్ళు ప్రీ-ప్లాన్డ్ గా చేసుకుని ఉంటారు అందుకే తీసుకున్నానని షాలినీ చెప్పింది. దీనికి చరణ్ వెంటనే ఫైర్ అయ్యాడు. నా మీద అలాంటి అబాండాలు వేయొద్దు.. ప్రీ-ప్లాన్డ్ అని ఎలా అంటావని గట్టిగా నిలదీశాడు. జ్యూరీ కూడా అదే ప్రశ్న అడగ్గా ఫ్రెండ్స్ కాబట్టి గ్రూప్ గా డిస్కస్ చేసుకుని ఉంటారేమోనని అన్నా అంటూ షాలిని కవర్ చేసింది. ఆ మాట అనకూడదు.. తప్పు అని బిందు సర్ది చెప్పింది.

 

చివరికి మాత్రం షాలిని  వేసిన స్కెచ్ వర్కౌట్ అయింది. ఆమె స్వాప్ చేసుకున్న బాక్స్ లీడర్ బాక్స్ గా తేలడంతో ఆమె లీడర్ గా మారింది. భాగి తన దగ్గరే ఉంచుకున్న బాక్స్ కూడా లీడర్ బాక్సే కావడంతో ఆమె కూడా లీడర్ బోర్డ్ లోకి వచ్చింది. శ్రష్టికి కూడా లీడర్ బాక్స్ వచ్చినా ఆమె తనంతట తానే మార్చుకుంది. ఇలా చివరకు రోహిత్, హేమంత్ తో సహా అందరు లీడర్లు అయ్యారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com