(5).webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 356లో.....రామనాథం అసిస్టెంట్ ఇంటికి వస్తాడు. అతన్ని వీరు కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత అతన్ని పంపిస్తాడు. మన ఇంటికి ఎవరో వచ్చారు.. స్టోర్ రూమ్ లో తాళ్లున్నాయి.. చెప్పులున్నాయని వీరు చెప్తాడు. దాంతో అందరూ కంగారు పడుతారు. ఒకసారి సీసీటీవీ చూద్దామని గంగ అంటుంది. తీరా సీసీటీవీ చూసేసరికి ఆ పర్టికులర్ వీడియో డిలీట్ అయి ఉంటుంది. ఆ తర్వాత వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. బ్రో అది డిలీట్ చేసానని నాకు చెప్పొచ్చు కదా బ్రో.. ఎంత టెన్షన్ పడ్డానని వీరుతో ఇషిక అంటుంది. అది నేను డిలీట్ చెయ్యలేదు.. నువ్వు డిలీట్ చేసావనుకున్నానని వీరు అంటాడు.
అప్పుడే రుద్ర వస్తాడు. ఏంటి అన్నాచెల్లెలు డిస్కషన్ చేసుకుంటున్నారని అంటాడు. ఏం లేదు బావ గారు అంటూ ఇషిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి వీరు రామనాథం అసిస్టెంట్ ని ఏం చేసావ్.. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసాను. అది డిలీట్ చేసింది కూడా నేనే అని రుద్ర అనగానే వీరు టెన్షన్ పడుతాడు. అసలు ఎందుకు అతన్ని అలా చేసావ్.. దీన్నిబట్టి ఏదో క్రైమ్ చేస్తున్నావని అర్ధం అయింది. ఇన్నాళ్లు నీ గురించి తెలిసినా ప్రీతీ గురించి ఓపిక పట్టానని రుద్ర అంటాడు. నా గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడిన తర్వాత నేను ఓపెన్ అవ్వకుండా ఎలా ఉంటాను.. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు బావ అని డైరెక్ట్ గా చెప్తాడు. నీ చెల్లి సెంటిమెంట్ ఉన్నంతవరకు నన్ను ఏం చెయ్యలేవని వీరు నవ్వుతాడు.
మరొకవైపు పెద్దసారు ఫ్రెండ్ తన భార్యతో ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తాడు. శకుంతల కావాలనే మీ కోడలు డాక్టర్ కదా అలా గొప్పింటి నుంచి కోడలిని తీసుకొని రావాలి.. నా ఇద్దరు కోడళ్లని అలాగే తెచ్చుకున్నాను కానీ రుద్ర మాత్రం చెప్తే వినలేదని శకుంతల అంటుంది. దాంతో పెద్దసారు గంగ గురించి గొప్పగా చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా గంగ గురించి పాజిటివ్ గా చెప్తుంటే గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






