Home

»

Tv News

Ye Devi Varamo Neevu: ఇంట్లోకి అంజలి ఎంట్రీ.. గీత షాక్, కోపంతో ఊగిపోయిన వైనం!

Aug 26, 2026 10:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 46 లో..... రత్నంతో అంజలి రావడం చూసి గీత షాక్ అవుతుంది. ఎందుకు వచ్చావని కోప్పడుతుంది.అంజలి వస్తేనే నేను వస్తాను లేదంటే వెళ్ళిపోతానని రత్నం చెప్తుంది. అదేంటీ అత్తయ్య గారు గీత కోపంగా ఉంటుంది కానీ మంచి మనసు ఉంటుంది అంజలి ఉంటే తనకేం ప్రాబ్లమ్ ఉంటుందని భాను ఇండైరెక్ట్ గా అంటాడు. గీత నువ్వు తను ఉండడానికి ఒప్పుకుంటున్నట్లే కదా అని భాను అడుగుతాడు.

 

గీత వాళ్ళ అమ్మకోసం సరే అంటుంది. ఆ తర్వాత రత్నం లోపలికి వస్తుంటే గీత హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. దాంతో అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత థాంక్స్ మావయ్య అంటూ భానుని మనీష్ ఎత్తుకొని తిరుగుతాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని అంజలిని రత్నం అడుగుతుంది. అవును అమ్మమ్మ అని అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

 

ఆ తర్వాత గీతకి కమల ఫోన్ చేస్తుంది. అంత అవమానం చేసినా కూడా ఆ అంజలిని రానిచ్చావంటే గ్రేట్ అని అంటుంది. అమ్మ కోసం తప్పలేదు వదిన అని గీత అంటుంది. వాళ్ళ అమ్మని అంత దగ్గరగా చూడడంతో అంజలి ఫుల్ హ్యాపీగా ఉంటుంది. తరువాయి భాగంలో అందరు భోజనం చేస్తుంటే గీతకి పొలమరుతుంది. దాంతో అంజలి వాటర్ తీసుకొని వస్తుంది. నీ పేరు కుడా ఈ ఇంట్లో వినపడకుండా జాగ్రత్త పడమన్నాను కదా అని అంజలిపై గీత కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com