Home

»

Tv News

Illu Illalu Pillalu : నర్మద ప్లాన్ ఫెయిల్... భద్రవతి ఫైర్!

Sep 1, 2026 10:58AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu Illalu Pillalu. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్   567 లో .....ప్రేమ, ధీరజ్ ల మధ్య రోజూ గొడవలతో విసిగిపోయిన నర్మద, వారి మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి ఇద్దరిని రెస్టారెంట్ కి పిలుస్తుంది. అక్కడ కూడా వాళ్లు.. నువ్వు పొగరు చూపించావు, నీ ఫేస్ చూస్తేనే వాంతి వస్తుందంటూ ఇద్దరు తిట్టుకుంటారు. దీంతో నర్మద వారి కోపాన్ని ఐస్ క్రీమ్ లా కూల్ చేయడానికి ఒక కొత్త ప్లాన్ వేస్తుంది. రోల్స్ రివర్స్ చేసి ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్లి మాట్లాడుకోమంటుంది. ఈ ప్లాన్ వెనుక విశ్వ బ్లూటూత్ సహాయం ఉందని దూరం నుండి చూస్తున్న అమూల్య పసిగడుతుంది.

 

రోల్స్ రివర్స్ లో భాగంగా ధీరజ్ ప్రేమ పాత్రలోకి, ప్రేమ ధీరజ్ పాత్రలోకి వెళ్తారు. మొదట సారీలు చెప్పుకున్నట్లు నటించినా.. ధీరజ్ తెలివిగా తప్పంతా ప్రేమదే అన్నట్లు మాట్లాడటంతో మళ్లీ గొడవ మొదలవుతుంది. కళ్యాణ్ గాడి విషయం ఎవరికి చెప్పనని మాటిచ్చి తప్పావని ప్రేమ అంటుంది. నిజమే కదా చెప్పానని ధీరజ్ వాదించుకుంటారు. చివరికి కోపంతో ప్రేమ ధీరజ్ మీద ఐస్ క్రీమ్ విసిరేసి వెళ్లిపోతుంది. దీంతో నర్మద ప్లాన్ మరోసారి బెడిసికొడుతుంది. ఆ తర్వాత రైస్ మిల్లు నుండి 6 లక్షలు మాయం కావడంతో వేదవతి తన తమ్ముడు తిరుపతిని..‌ఆ డబ్బుతో ఎవరికైనా గిఫ్ట్ కొనిచ్చావా అని అడుగుతుంది. అతడు అవమానంగా ఫీలై శారదాంబ దగ్గర ఏడుస్తాడు. విషయం తెలిసిన భద్రవతి తిరుపతిని తీసుకొని వేదవతి, రామరాజుల ఇంటి ముందుకు వచ్చి పెద్ద గొడవకు దిగుతుంది. నా తమ్ముడిని దొంగ అంటారా? మీ కొడుకు పెళ్లి డబ్బులు కొట్టేసి ఉద్యోగం కొనలేదా అంటూ పాత లెక్కలు బయటపెడుతుంది. వేదవతి కూడా.. సొంత తమ్ముడిని పట్టించుకోని నువ్వు నన్ను అంటావా అని ఎదురుదాడి చేస్తుంది.

 

అసలు ఆ 6 లక్షల చైన్ సుక్కుకి తిరుపతి గిఫ్ట్ గా ఇచ్చాడని వల్లి కావాలనే పుకారు లేపింది. అందరు కొట్టుకోవడం చూసి ఆరు లక్షలు కొట్టేసింది నేనే అన్న డౌట్ ఎవరికీ రాదు, నేను సేఫ్ అని మనసులో అనుకొని సంబరపడుతుంది. చివరికి భద్రవతి.. వారం రోజుల్లో నా తమ్ముడికి జమీందారు స్థాయి అమ్మాయితో పెళ్లి చేసి మీ పరువు తీస్తానని శపథం చేసి తిరుపతిని లాక్కెళ్లిపోతుంది. ఇంట్లో నర్మద, ధీరజ్, చందు, సాగర్ అందరు వేదవతిని ఆధారం లేకుండా కష్టపడే మామను ఎలా అనుమానిస్తావని నిలదీస్తారు. నిజం బయటపడుతుందనే భయంతో వల్లి.. ఆపండి అని అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com